AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్యాంట్ ఎక్క‌డా.? అంటూ స్టుపిడ్ కామెంట్స్ చేయోద్దు.. నెటిజన్స్ నోరు మూయించిన టాలీవుడ్ బ్యూటీ

సోషల్ మీడియా పుణ్యమా అని చాలా మంది హీరోయిన్స్ అభిమానులకు రెగ్యులర్ గా టచ్ లో ఉంటూ అలరిస్తున్నారు. ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ అభిమానులను విశేషంగా కవ్విస్తున్నారు. తాజాగా ఓ హీరోయిన్ షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఫోటోలకు నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

ప్యాంట్ ఎక్క‌డా.? అంటూ స్టుపిడ్ కామెంట్స్ చేయోద్దు.. నెటిజన్స్ నోరు మూయించిన టాలీవుడ్ బ్యూటీ
Tollywood Actress
Follow us
Rajeev Rayala

|

Updated on: Apr 16, 2025 | 4:16 PM

హీరోయిన్స్ సినిమాలతో పాటు సోషల్ మీడియా ద్వారా కూడా అభిమానులను ఆకట్టుకుంటున్నారు. సినిమాల్లో ఎంత బిజీగా ఉంటున్నారో.. నెట్టింట కూడా అంతే బిజీగా గడిపేస్తున్నారు. అభిమానులను నిత్యం ఆకట్టుకునేలా ఫోటోలు, వీడియోలు పంచుకుంటున్నారు. అయితే సోషల్ మీడియా వల్ల ఎంత లాభం ఉంటుందో అంతే నష్టం కూడా ఉంటుంది. కొంతమంది ట్రోల్స్ తో సెలబ్రెటీలు ఆడుకుంటూ ఉంటారు. ముఖ్యంగా హీరోయిన్స్ చిన్న తప్పు చేస్తే చాలు ఓ రేంజ్ లో ఆడేసుకుంటారు. అంతే కాదు హీరోయిన్స్ కూడా నెగిటివ్ కామెంట్స్ కు అదిరిపోయే కౌటర్స్ కూడా ఇస్తుంటారు. తాజాగా ఓ హీరోయిన్ ముందుగానే తన పై నెగిటివ్ కామెంట్స్ చేయకుండా నెటిజన్స్ నోరు మూయించింది. ఇంతకూ ఆ అమ్మడు ఎవరో తెలుసా.?

ఇది కూడా చదవండి : Prabhas: ఆ రోజు నాకు ఫస్ట్ టైమ్ కళ్ళల్లో నీళ్ళొచ్చాయి.. ఎమోష్నలైన ప్రభాస్

అందాల భామలు రెగ్యులర్ గా ఫోటోలు, వీడియోలతో అభిమానులను ఆకట్టుకుంటున్నారు. గ్లామరస్ ఫోటోలు పంచుకుంటూ ఈ సమ్మర్ లో మరింత హీట్ పెంచేస్తున్నారు. కాగా తాజాగా వర్ష బొల్లమ్మ కూడా అదిరిపోయే ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది. అయితే ఈ ఫొటోల్లో వర్ష చాలా గ్లామరస్ గా కనిపించింది. పొట్టి డ్రస్ లో కుర్రాళ్లను కవ్వించింది. అయితే ఈ ఫోటోలకు నెటిజన్స్ ప్యాంట్ వేసుకోవడం మర్చిపోయావా.? అని కామెంట్స్ చేస్తారని ముందే కనిపెట్టి ఇలా రాసుకొచ్చింది వర్ష.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : వయసులో నాకన్నా చిన్నోడే.. కానీ మగతనం ఎక్కువ.. నటి షాకింగ్ కామెంట్స్

“అదిదా సర్‌ప్రైజ్.. ప్యాంట్ ఎక్క‌డా అంటూ స్టుపిడ్ కామెంట్స్ చేయోద్దు. పంత్ ఇప్పుడు ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ జ‌ట్టులో ఉన్నాడు” అంటూ రాసుకొచ్చింది.ఇక ఇప్పుడు ఏ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. స్టుపిడ్ కామెంట్స్ చేయోద్దు అని వర్ష చెప్పినా కూడా కొందరు ఈ చిన్నదాని ఫోటోల పై క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. అలాగే ఈ ఫొటోల్లో వర్షతో పాటు ఓ ఆవు కూడా కనిపించింది. దాంతో గో మాత ముందు ఇలా చిన్న చిన్న డ్రస్లు వేసుకొని ఫోటోలు దిగితావా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇది కూడా చదవండి :తమన్నాను చూసి కుళ్ళుకుంటున్న హాట్ బ్యూటీ.. అలాంటి పోస్ట్ షేర్ చేయడంతో ఫ్యాన్స్ సీరియస్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.