AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ హీరోయిన్ పెళ్లి నేనే చేశా.. వాళ్లు నన్ను పట్టించుకోవడం లేదు..! కన్నీళ్లు పెట్టుకున్న వనిత విజయ్ కుమార్

వనిత విజయ్ కుమార్ ఈ అమ్మడి గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. నటిగా కంటే వివాదాలతోనే ఈ అమ్మడు ఎక్కువ పాపులర్ అయ్యింది. దేవి సినిమాతో వనిత విజయ్ కుమార్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. వనిత విజయ్ కుమార్ 1995లో తమిళంలో విడుదలైన చంద్రలేఖ సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగు పెట్టి తమిళంతో పాటు తెలుగు, మలయాళం సినిమాల్లో నటించింది.

ఆ హీరోయిన్ పెళ్లి నేనే చేశా.. వాళ్లు నన్ను పట్టించుకోవడం లేదు..! కన్నీళ్లు పెట్టుకున్న వనిత విజయ్ కుమార్
Vanitha Vijayakumar
Rajeev Rayala
|

Updated on: Jan 09, 2026 | 6:21 PM

Share

నటి వనిత విజయ్ కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించి మెప్పించింది వనిత విజయ్ కుమార్. దేవి సినిమాలో తన నటనతో ఆకట్టుకుంది వనిత విజయ్ కుమార్. ఆతర్వాత తెలుగులో పలు సినిమాలు చేసిన వనిత ఆతర్వాత తమిళ్‌లో నటించి మెప్పించింది. గతంలో వనిత విజయ్ కుమార్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ షాకింగ్ విషయాలను పంచుకుంది. తన జీవితంలో ఎదుర్కొన్న ఒడిదుడుకులు, కుటుంబ మద్దతు లేకపోవడం వంటివాటి గురించి కూడా మాట్లాడారు వనిత. మూడు వివాహాలు, విడాకులు, ఇద్దరు పిల్లలతో తన ప్రయాణాన్ని, మీడియా నుండి ఎదుర్కొన్న పరిస్థితులను తెలిపారు. కుటుంబ మద్దతు ఉండి ఉంటే తన జీవితంలో అనేక సమస్యలు, వివాదాలు తలెత్తి ఉండేవి కావని ఆమె అన్నారు.

అతన్ని పిచ్చి పిచ్చిగా ప్రేమించా.. కానీ బ్రేకప్ అయ్యింది.. దివి ఎమోషనల్ కామెంట్స్

వనిత విజయ్ కుమార్ మాట్లాడుతూ.. తన తండ్రి లేదా కుటుంబ సభ్యులు తనకు మద్దతుగా నిలిచి ఉంటే, తన నిర్ణయాలను ఆమోదించి ఉంటే, ఇండస్ట్రీ నుండి కూడా ఎవరూ జోక్యం చేసుకునేవారు కాదని ఆమె అన్నారు. కుటుంబం తనను దూరంగా ఉంచడానికి ప్రధాన కారణం తన మొదటి వివాహం, విడాకులు అని వనిత అన్నారు. ఆ విడాకులు పబ్లిసిటీ అవుతాయని, తమ కుటుంబానికి చెడ్డ పేరు వస్తుందని భావించి కుటుంబ సభ్యులు తనను పూర్తిగా దూరం పెట్టారని తెలిపారు. తన సోదరుడు అరుణ్ విజయ్ వివాహానికి కూడా తనను ఒప్పుకోలేదని, కుటుంబ సభ్యులు చేసిన ఎన్నో తప్పులలో ఇదొకటని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

13 ఏళ్లకే పెళ్లైంది.. ఇండస్ట్రీలో చాలా మంది నన్ను అలా చేయమని అడిగారు..

అలాగే తన సోదరి శ్రీదేవి వివాహాన్ని తానే దగ్గరుండి జరిపించానని వనిత అన్నారు. కుటుంబ సభ్యులు మొదట వ్యతిరేకించినా, తానే స్వయంగా నిలబడి, జాతకాలు చూసి, రాహుల్ అనే అబ్బాయితో పెళ్లి కుదిర్చానని తెలిపారు. నేడు శ్రీదేవి సంతోషంగా, మంచి భర్తతో, ముద్దులొలికే కుమార్తెతో ఉందని వనిత ఆనందం వ్యక్తం చేశారు. శ్రీదేవి మొదటి వివాహ వార్షికోత్సవం రోజున తనకు కృతజ్ఞతలు చెప్పినా, తర్వాత అంతా మర్చిపోయారని ఆమె గుర్తు చేసుకున్నారు. కుటుంబం ఎందుకు ఇలా చేసిందో అర్థం కాలేదని, అయితే తాను వారందరికీ ఎల్లప్పుడూ మంచి కోరుకుంటానని అన్నారు. కుటుంబ మద్దతు ఉండి ఉంటే, తాను కూడా సినిమాల్లో రాణించే దాన్ని అని తెలిపారు.. తన తల్లి చనిపోయిన తర్వాత, పెద్ద కుమార్తెగా అమ్మ స్థానంలో నిలబడి చెల్లెళ్లకు, సోదరుడికి మద్దతు ఇచ్చినా, తన వ్యక్తిగత కష్టాల్లో కుటుంబం నుంచి ఎప్పుడూ మద్దతు లభించలేదని ఆమె అన్నారు.. ఎన్నోసార్లు ప్రయత్నించినా, కుటుంబ సభ్యులు తనను బ్లాక్ చేశారని ఆమె తెలిపారు.

ఇవి కూడా చదవండి

వయసు 20 ఏళ్లు.. ప్రభాస్, దళపతి విజయ్‌లను కూడా వెనక్కి నెట్టింది.. ఈ అమ్మడు ఎవరంటే

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి.