Ghani Movie: వరుణ్ తేజ్ గని నుంచి స్పెషల్ సాంగ్ రిలీజ్.. మరోసారి అదరగొట్టిన మిల్కీబ్యూటీ..

మెగా హీరో వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ కిరణ్ కొర్రపాటి తెరకెక్కిస్తున్న లేటేస్ట్ చిత్రం గని. బాక్సింగ్ నేపథ్యంలో రూపొందుతున్న

Ghani Movie: వరుణ్ తేజ్ గని నుంచి స్పెషల్ సాంగ్ రిలీజ్.. మరోసారి అదరగొట్టిన మిల్కీబ్యూటీ..
Thamannah
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 15, 2022 | 12:23 PM

మెగా హీరో వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ కిరణ్ కొర్రపాటి తెరకెక్కిస్తున్న లేటేస్ట్ చిత్రం గని. బాక్సింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ సాయి ముంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన విడుదలైన ఫస్ట్‌లుక్‌తో పాటు సినిమాలోని పాత్రలను పరియం చేస్తూ విడుదల చేస్తోన్న పోస్టర్‌లు ‘గని’పై ఆసక్తిని కలిగించాయి. దీంతో ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. గని సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు మెగా అభిమానులు. ఇదిలా ఉంటే.. సంక్రాంతి కానుకగా ఈ సినిమాలోనే స్పెషల్ సాంగ్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్.

రింకా రె రింగా రింగ రింగా రింగా అంటూ బాక్సింగ్ రింగ్‏లో సాగే ఈ పాట ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ పాటలో మరోసారి తనదైన స్టెప్పులతో అదరగొట్టింది మిల్కీబ్యూటీ తమన్నా. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించిన ఈ పాటను తమన్ తనదైన స్టైల్లో బాణీలను అందించగా.. హారిక నారాయన్ ఆలపించారు. ఈ మూవీకి తమన్నా పై చిత్రీకరించిన ఈ సాంగ్ స్పెషల్ అట్రాక్షన్ కానున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ చిత్రాన్ని మార్చి 18న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే చిత్రయూనిట్ ప్రకటించింది. ఈ సినిమాలో న‌వీన్ చంద్ర, జ‌గ‌ప‌తిబాబు, సునీల్ శెట్టి, ఉపేంద్ర కీల‌క పాత్రల్లో న‌టిస్తున్నారు. న‌దియా మ‌రో ముఖ్యపాత్ర పోషిస్తున్నారు.

Also Read: Samantha: స‌మంత‌కు మ‌రో క్రేజీ ఆఫ‌ర్‌.. సామ్ కోసం రంగంలోకి దిగుతోన్న మాట‌ల మాంత్రికుడు.?

Vijay Devarakonda: త‌న మ‌ద్ద‌తు చిరుకే అంటోన్న విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. ట్రెండింగ్‌లో చిరు ట్వీట్‌..

Hari Hara Veera Mallu: ప‌వ‌న్, క్రిష్ సినిమా క‌థపై హింట్ ఇచ్చిన నిధి.. ఆస‌క్తి రేపుతోన్న స్టోరీ లైన్‌..

Mr.Pregnant Movie: మిస్టర్ ప్రెగ్నెంట్ సినిమాకు మద్దతుగా ఉప్పెన డైరెక్టర్.. కథ వేరుంటది సాంగ్ రిలీజ్ చేసిన బుచ్చిబాబు..