AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mr.Pregnant Movie: మిస్టర్ ప్రెగ్నెంట్ సినిమాకు మద్దతుగా ఉప్పెన డైరెక్టర్.. కథ వేరుంటది సాంగ్ రిలీజ్ చేసిన బుచ్చిబాబు..

‘బిగ్ బాస్’ ఫేమ్ యంగ్ హీరో సయ్యద్ సోహైల్ రియాన్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘మిస్టర్ ప్రెగ్నెంట్’.

Mr.Pregnant Movie: మిస్టర్ ప్రెగ్నెంట్ సినిమాకు మద్దతుగా ఉప్పెన డైరెక్టర్.. కథ వేరుంటది సాంగ్ రిలీజ్ చేసిన బుచ్చిబాబు..
Sohail
Rajitha Chanti
|

Updated on: Jan 15, 2022 | 9:55 AM

Share

‘బిగ్ బాస్’ ఫేమ్ యంగ్ హీరో సయ్యద్ సోహైల్ రియాన్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘మిస్టర్ ప్రెగ్నెంట్’. రూపా కొడవాయుర్ హీరోయిన్‌గా నటిస్తోంది. మైక్ మూవీస్ బ్యానర్‌లో అన్నపరెడ్డి అప్పిరెడ్డి, రవిరెడ్డి సజ్జల నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని కొత్త దర్శకుడు శ్రీనివాస్ వింజనంపాటి రూపొందిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ మూవీ త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈలోగా లిరికల్ సాంగ్స్ ను ఒక్కొక్కటిగా విడుదల చేస్తున్నారు.

తాజాగా ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ చిత్రంలోని ‘కథ వేరుంటది’ పాటను సంక్రాంతి పండగ సందర్భంగా ప్రముఖ దర్శకుడు బుచ్చిబాబు శుక్రవారం ఉదయం 9 గంటలకు విడుదల చేశారు. కథ వేరుంటది పాట చాలా బాగుందన్న బుచ్చిబాబు ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ టీమ్ కు బెస్ట్ విశెష్ తెలిపారు. కథ వేరుంటది పాట ఎలా ఉందో చూస్తే..ఓ సక్కనోడా నాకు తగ్గ జోడి నిన్నుచూసి పుట్టుకొచ్చె గుండెలో దడ.. ఓ అల్లరోడా, బుగ్గ గిల్లి సూడ.. సందమామ రాతిరేల దిష్టి కొట్టడా..మాసు లుక్కులోడా నువు ఊ అంటే చాలు కథ వేరుంటది…సొట్ట సెంపలోడా నువు సై అంటే సాలు కథ వేరుంటది ..అంటూ హీరోపై హీరోయిన్ అడ్మిరేషన్ చూపిస్తూ సాగుతుందీ పాట. శ్రావణ్ భరద్వాజ్ సంగీతాన్నందించిన కథ వేరుంటది పాటకు కిట్టు విస్సాప్రగడ సాహిత్యాన్ని అందించగా…నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తపా పాటతో సోషల్ మీడియాను ఊపేసిన గాయని మోహన భోగరాజు పాడారు. హీరో సోహైల్ ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ చిత్రంలో ప్రెగ్నెంట్‌గా కనిపించనున్నాడు. అందరికీ నచ్చేలా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. దర్శకుడు శ్రీనివాస్ వింజనంపాటి. తుది హంగులు అద్దుకుంటున్న ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ మూవీని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో సయ్యద్ సొహైల్ రియాన్, రూపా కొడువయుర్, సుహాసినీ మణిరత్నం, రాజా రవీంద్ర, బ్రహ్మాజీ, అలీ, హర్ష తదితరులు నటిస్తున్నారు.

Also Read: Samantha: స‌మంత‌కు మ‌రో క్రేజీ ఆఫ‌ర్‌.. సామ్ కోసం రంగంలోకి దిగుతోన్న మాట‌ల మాంత్రికుడు.?

Vijay Devarakonda: త‌న మ‌ద్ద‌తు చిరుకే అంటోన్న విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. ట్రెండింగ్‌లో చిరు ట్వీట్‌..

Hari Hara Veera Mallu: ప‌వ‌న్, క్రిష్ సినిమా క‌థపై హింట్ ఇచ్చిన నిధి.. ఆస‌క్తి రేపుతోన్న స్టోరీ లైన్‌..

Follow Us
చినుకమ్మా రా.. అంటూ చిన్నారుల నృత్యం.. కప్పల కావడితో వరుణ దేవుడి
చినుకమ్మా రా.. అంటూ చిన్నారుల నృత్యం.. కప్పల కావడితో వరుణ దేవుడి
అరె..ఎవరీ మనిషి.. అచ్చం మన హీరో రవితేజలా ఉన్నాడు.. వీడియో వైరల్
అరె..ఎవరీ మనిషి.. అచ్చం మన హీరో రవితేజలా ఉన్నాడు.. వీడియో వైరల్
బైక్ ఆగింది..పని ఆగలేదు..రెడ్ సిగ్నల్ వద్ద ల్యాప్‌టాప్‌తో ఉద్యోగి
బైక్ ఆగింది..పని ఆగలేదు..రెడ్ సిగ్నల్ వద్ద ల్యాప్‌టాప్‌తో ఉద్యోగి
ఢిల్లీలో సీఎం చంద్రబాబు బిజీబిజీ..!
ఢిల్లీలో సీఎం చంద్రబాబు బిజీబిజీ..!
రూ.2 లక్షల ఎఫ్‌డీపై ఏ బ్యాంకు అత్యధిక వడ్డీ రేటును అందిస్తుంది?
రూ.2 లక్షల ఎఫ్‌డీపై ఏ బ్యాంకు అత్యధిక వడ్డీ రేటును అందిస్తుంది?
చాణక్యుడి హెచ్చరిక.. ఈ విషయాలు బయటకు చెప్పొద్దు!
చాణక్యుడి హెచ్చరిక.. ఈ విషయాలు బయటకు చెప్పొద్దు!
పెద్ది లుక్స్‌లో గత్తరలేపుతున్న జ్యోత్స్న పాప..
పెద్ది లుక్స్‌లో గత్తరలేపుతున్న జ్యోత్స్న పాప..
పెళ్లి మండపంలో కట్నం డబ్బులు ముట్టజెప్పిన మామగారు,వరుడిచ్చిన షాక్
పెళ్లి మండపంలో కట్నం డబ్బులు ముట్టజెప్పిన మామగారు,వరుడిచ్చిన షాక్
వర్షాకాలంలో ఈ మొక్కలు నాటితే గ్రహాల అనుగ్రహం.. జ్యోతిష్యం ప్రకారం
వర్షాకాలంలో ఈ మొక్కలు నాటితే గ్రహాల అనుగ్రహం.. జ్యోతిష్యం ప్రకారం
ఓటీటీలో 'ధురంధర్' లాంటి స్పై యాక్షన్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
ఓటీటీలో 'ధురంధర్' లాంటి స్పై యాక్షన్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది