Samantha: స‌మంత‌కు మ‌రో క్రేజీ ఆఫ‌ర్‌.. సామ్ కోసం రంగంలోకి దిగుతోన్న మాట‌ల మాంత్రికుడు.?

Samantha: నాగ‌చైత‌న్యతో వివాహ బంధం నుంచి దూర‌మైన త‌ర్వాత స‌మంత సినిమాల్లో వేగాన్ని పెంచిన విష‌యం తెలిసిందే. వ‌రుస సినిమాల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తూ స‌మంత బిజీగా మారుతోంది...

Samantha: స‌మంత‌కు మ‌రో క్రేజీ ఆఫ‌ర్‌.. సామ్ కోసం రంగంలోకి దిగుతోన్న మాట‌ల మాంత్రికుడు.?
Follow us
Narender Vaitla

|

Updated on: Jan 15, 2022 | 6:08 AM

Samantha: నాగ‌చైత‌న్యతో వివాహ బంధం నుంచి దూర‌మైన త‌ర్వాత స‌మంత సినిమాల్లో వేగాన్ని పెంచిన విష‌యం తెలిసిందే. వ‌రుస సినిమాల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తూ స‌మంత బిజీగా మారుతోంది. ఇప్ప‌టికే పుష్ప‌లో స్పెష‌ల్ సాంగ్‌తో ఒక్క‌సారిగా నేష‌న‌ల్ వైడ్‌గా ప్రేక్ష‌కుల‌ను త‌న‌వైపు తిప్పుకున్నారు సామ్‌. ఇప్ప‌టికే శాకుంతలం సినిమాను పూర్తి చేసిన స‌మంత‌.. తాజాగా య‌శోద అనే సినిమాను మొద‌లు పెట్టారు. ఈ రెండు చిత్రాలూ హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలుగా తెర‌కెక్కుతోన్న విష‌యం తెలిసిందే. ఇలా త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపును సంపాదించుకునే దిశ‌గా సామ్ వేగంగా అడుగులు వేస్తోంది.

ఇదిలా ఉంటే తాజా స‌మాచారం ప్ర‌కారం సామ్ మ‌రో క్రేజీ ఆఫ‌ర్‌ను సొంతం చేసుకుంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌కత్వంలో స‌మంత న‌టించ‌నున్నార‌నేది ఆ వార్త సారాంశం. ఈ సినిమాను త్రివిక్ర‌మ్ హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రంగా తెర‌కెక్కించ‌నున్నార‌ని, ఓ న‌వ‌ల ఆధారంగా ఈ సినిమా క‌థ ఉండ‌నుంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే త్రివిక్ర‌మ్ ఇప్ప‌టికిప్పుడు ఈ ప్రాజెక్ట్‌ను టేకాఫ్ చేయ‌డానికి ఓ కార‌ణం ఉంద‌ని చెబుతున్నారు. అదేంటంటే.. త్రివిక్ర‌మ్ చేతిలో ప్ర‌స్తుతం ఏ సినిమా లేదు.

నిజానికి మ‌హేష్‌తో సినిమా చేయాల్సి ఉంది, కానీ స‌ర్కారు వారి పాట విడుద‌ల‌య్యే వ‌ర‌కు మ‌హేష్ డేట్స్ దొరికే అవ‌కాశాలు లేవు. దీంతో ఈ గ్యాప్‌లో స‌మంత‌తో ఒక సినిమా చేయాల‌ని త్రివిక్ర‌మ్ భావిస్తున్నార‌ని టాక్‌. మ‌రి ఈ వార్త‌ల్లో ఎంత వ‌ర‌కు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చే వ‌ర‌కు వేచి చూడాల్సిందే.

Also Read: Indian Railway: రైలు గార్డ్‌ అని పిలవకండి.. ట్రైన్‌ మేనేజర్‌ అని పిలవండి.. కీలక మార్పులు చేసిన రైల్వే శాఖ..!

Malladi Chandrasekhara Sastry: పౌరాణిక వాచ‌స్ప‌తి మల్లాది చంద్రశేఖర శాస్త్రి శివైక్యం..

Modi Government: వాహనదారులకు గుడ్‌న్యూస్‌.. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. ప్రయాణికులకు మరింత భద్రత

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ