Malladi Chandrasekhara Sastry: పౌరాణిక వాచ‌స్ప‌తి మల్లాది చంద్రశేఖర శాస్త్రి శివైక్యం..

Malladi Chandrasekhara Sastry passed away: ప్రముఖ పండితుడు, పురాణ ప్రవచకులు పౌరాణిక వాచ‌స్ప‌తి మల్లాది చంద్రశేఖర శాస్త్రి

Malladi Chandrasekhara Sastry: పౌరాణిక వాచ‌స్ప‌తి మల్లాది చంద్రశేఖర శాస్త్రి శివైక్యం..
Malladi Chandrasekhara Sast
Follow us

|

Updated on: Jan 14, 2022 | 9:17 PM

Malladi Chandrasekhara Sastry passed away: ప్రముఖ పండితుడు, పురాణ ప్రవచకులు పౌరాణిక వాచ‌స్ప‌తి మల్లాది చంద్రశేఖర శాస్త్రి (96) తుదిశ్వాస విడిచారు. వృద్ధాప్య సమస్యలతో మల్లాది చంద్రశేఖర శాస్త్రి హైదరాబాద్‌లోని స్వగృహంలో కన్నుమూసినట్లు ఆయన కుటుంబ సభ్యులు శుక్రవారం తెలిపారు. పౌరాణిక వాచ‌స్ప‌తి చంద్రశేఖర శాస్త్రి ఉగాది పండుగ సమయంలో పంచాగం శ్రవణం చేసేవారు. ఆయన స్వరంలోని మాధుర్యం, రామాయణ, భారత, భాగవతాలపై ఆయనకున్న పట్టు కారణంగా పురాణ ప్రవచన ప్రముఖులలో ఆయన ప్రత్యేకమైన పేరు గడించారు. తన 15వ ఏట నుంచి ప్రవచన యజ్ఞం ప్రారంభించారు. 87 ఏళ్ల నుంచి ఇప్పటి వరకు ఉపన్యాసం, హరికథ, నాటకం, పురాణం కలిపి శ్రోతలను ఆకట్టుకునే విధంగా పురాణ ప్రవచనం చేయడంలో మల్లాది చంద్రశేఖర శాస్త్రి సుప్రసిద్ధులు. దక్షిణమూర్తి దంపతులకు 1925 ఆగస్టు 28న దక్షిణమూర్తి దంపతులకు క్రోసూరు హసనబడా గ్రామంలో ఆయన జన్మించారు.

పురాణ ప్ర‌వ‌చ‌నాల‌లో ఆయ‌నకు ఆయ‌నే సాటి. భ‌ద్రాచ‌లం శ్రీ సీతారామ క‌ల్యాణ వేడుక‌ల ప్ర‌త్య‌క్ష వ్యాఖ్యానాల‌లో ఆయ‌న ఉష‌శ్రీ‌గారితో క‌లిసి పాల్గొన్నారు. మల్లాది చంద్రశేఖర శాస్త్రి భారతము ధర్మసుక్ష్మ దర్శనము, క్రుష్ణలహరి (సేచ్చాంధ్రానువాదము), రామాయణ రహస్య దర్శిని గ్రంథాల‌ను ర‌చించారు. వేదాలు, శ్రౌతస్మార్త, వ్యాకరణతర్క వేదస్త సాహిత్యాల‌ను సైతం మల్లాది శాస్త్రి పఠించారు.

మల్లాది చంద్రశేఖర శాస్త్రి అస్తమయం బాధాకరం.. మల్లాది చంద్రశేఖర శాస్త్రి అస్తమయం బాధాకరమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ విచారం వ్యక్తంచేశారు. ప్రముఖ పండితులు, ప్రవచనకర్త శ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి అస్తమించారు అనే విషయం బాధ కలిగించింది. ఉగాది రోజున పంచాంగ శ్రవణ కార్యక్రమంలో శాస్త్రి చెప్పే విశేషాలు ప్రతి తెలుగు వ్యక్తికీ చిరపరిచితమే. పురాణ, ఇతిహాస, వేద విశేషాలు ప్రతి ఒక్కరికీ అర్థమయ్యేలా… అధ్యాత్మిక చింతన పెంచేలా శ్రీ చంద్రశేఖర శాస్త్రి ఉపన్యాసాలు సాగేవి. ధర్మ సందేహాలు, ధర్మ సూక్ష్మాలు కార్యక్రమాల ద్వారా హిందూ ధర్మంపై అవగాహన పెంచారు. శ్రీ చంద్రశేఖర శాస్త్రి ఆత్మకు శాంతి చేకూరాలని, సద్గతులు ప్రాప్తించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబానికి నా తరఫున, జనసేన పక్షాన ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నానంటూ పవన్ కల్యాణ్ ప్రకటన విడుదల చేశారు.

Also Read:

Viral Video: తగ్గేదెలే.. అంటున్న శునకం.. వీడియో చూసి నోరేళ్లబెడుతున్న నెటిజనం..

Viral Photo: ఈ ఫోటోలో చిరుతను దాగుంది.. కనిపెడితే మీ కళ్లలో పదునున్నట్లే.!

భగవంతుడా...! క్షణాల వ్యవధిలో అతడి జీవితం సమాప్తమైంది..
భగవంతుడా...! క్షణాల వ్యవధిలో అతడి జీవితం సమాప్తమైంది..
శబ్ధం వస్తే రోడ్డుమీద ఎవరైనా పడిపోయారేమో అనుకున్నారు.. కట్ చేస్తే
శబ్ధం వస్తే రోడ్డుమీద ఎవరైనా పడిపోయారేమో అనుకున్నారు.. కట్ చేస్తే
ఒకే బైక్‌పై నలుగురు ప్రయాణం.. ఇంతలోనే అనుకోని ఘటన
ఒకే బైక్‌పై నలుగురు ప్రయాణం.. ఇంతలోనే అనుకోని ఘటన
JEE Main 2024 ఫలితాల్లో తెలుగోళ్ల సత్తా.. 22 మందికి 100% మార్కులు
JEE Main 2024 ఫలితాల్లో తెలుగోళ్ల సత్తా.. 22 మందికి 100% మార్కులు
ఒక గంట మ్యూజిక్ ఈవెంట్‏కు కోట్లు వసూలు చేసే ఏకైక సింగర్..
ఒక గంట మ్యూజిక్ ఈవెంట్‏కు కోట్లు వసూలు చేసే ఏకైక సింగర్..
ఘోర ప్రమాదం.. ఆగివున్న లారీని ఢీకొన్న కారు, ఆరుగురు మృతి
ఘోర ప్రమాదం.. ఆగివున్న లారీని ఢీకొన్న కారు, ఆరుగురు మృతి
రూ. 10 వేలలో ఊహకందని ఫీచర్లు.. 100 ఎంపీ కెమెరాతో పాటు..
రూ. 10 వేలలో ఊహకందని ఫీచర్లు.. 100 ఎంపీ కెమెరాతో పాటు..
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
మరో మల్టీప్లెక్స్‌ ప్రారంభించనున్న మహేష్‌.. ఈసారి ఎక్కడో తెలుసా.?
మరో మల్టీప్లెక్స్‌ ప్రారంభించనున్న మహేష్‌.. ఈసారి ఎక్కడో తెలుసా.?
ఖమ్మం టికెట్‌ కేటాయింపుతో కాంగ్రెస్‌ వ్యూహమేంటి..?
ఖమ్మం టికెట్‌ కేటాయింపుతో కాంగ్రెస్‌ వ్యూహమేంటి..?