Hari Hara Veera Mallu: ప‌వ‌న్, క్రిష్ సినిమా క‌థపై హింట్ ఇచ్చిన నిధి.. ఆస‌క్తి రేపుతోన్న స్టోరీ లైన్‌..

Hari Hara Veera Mallu: ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న సినిమా హ‌రిహ‌ర‌వీర‌మ‌ల్లు. చారిత్ర‌క నేప‌థ్యంతో రానున్న ఈ సినిమాపై ఇప్ప‌టికే నుంచి భారీ అంచ‌నాలున్నాయి. హిస్టారిక‌ల్ నేప‌థ్యంతో...

Hari Hara Veera Mallu: ప‌వ‌న్, క్రిష్ సినిమా క‌థపై హింట్ ఇచ్చిన నిధి.. ఆస‌క్తి రేపుతోన్న స్టోరీ లైన్‌..
Follow us
Narender Vaitla

|

Updated on: Jan 15, 2022 | 6:02 AM

Hari Hara Veera Mallu: ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న సినిమా హ‌రిహ‌ర‌వీర‌మ‌ల్లు. చారిత్ర‌క నేప‌థ్యంతో రానున్న ఈ సినిమాపై ఇప్ప‌టికే నుంచి భారీ అంచ‌నాలున్నాయి. హిస్టారిక‌ల్ నేప‌థ్యంతో గౌత‌మి పుత్ర శాత‌క‌ర్ణి చిత్రాన్ని అద్భుతంగా తెర‌కెక్కించిన క్రిష్‌.. ప‌వ‌న్‌ను ఏ రేంజ్‌లో చూపిస్తార‌ని ఆయ‌న ఫ్యాన్స్ ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే అభిమానుల అంచ‌నాల‌ను ఏమాత్రం త‌గ్గ‌కుండా క్రిష్ ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమా హిస్టారిక్ నేప‌థ్యంలో రానుంద‌న్న విష‌యం తెలిసిన‌ప్ప‌టికీ.. క‌థ ఏంట‌న్న‌దానిపై మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కు చిత్ర యూనిట్ ఎలాంటి ప్ర‌క‌ట‌న చేయ‌లేదు.

ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాలో ప‌వ‌న్‌కు జోడిగా న‌టిస్తున్న అందాల తార నిధి అగ‌ర్వాల్ హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు సినిమా క‌థ‌కు సంబంధించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. తాజాగా ఈ అమ్మ‌డు నటించిన చిత్రం హీరో విడుద‌ల‌కు సిద్ధంగా ఉన్న విష‌యం తెలిసిందే. ఈ సినిమా ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా మాట్లాడిన నిధి.. హ‌రిహ‌ర వీరమ‌ల్లు గురించి ఆస‌క్తిక‌ర విష‌యాన్ని తెలిపింది. ఈ సినిమా రెండు కాలాల్లో జ‌రిగే క‌థ నేప‌థ్యంలో ఉండ‌నున్న‌ట్లు తెలిపింది. అప్ప‌టి కాలానికి, ఇప్ప‌టి కాలానికి మ‌ధ్య సంబంధాన్నిలింక్ చేస్తూ క‌థ ఉండ‌నుంద‌ని చెప్పేసింది నిధి.

ఈ అమ్మ‌డు చెప్పిన విష‌యాల ఆధారంగా క‌థను అంచ‌నా వేసేస్తున్నారు. ప‌వ‌న్ గ‌తంలో న‌టించిన తీన్‌మార్‌లా ఈ సినిమా ఉండ‌నుంద‌ని కొంద‌రు భావిస్తున్నారు. అలాగే ఈ సినిమాలో ప‌వ‌న్ రెండు విభిన్న‌వేరియేష‌న్స్‌లో క‌నిపించ‌నున్నార‌నే చ‌ర్చ‌కూడా జ‌రుగుతోంది. మ‌రి సుమారు రూ. 180 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్క‌నున్న ఈ సినిమా ఎలాంటి వండ‌ర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

Also Read: Paytm Shut Down: ఇక నుంచి పేటీఎం యాప్‌ సేవలు నిలిపివేత.. ఎక్కడో తెలుసా..?

Amritha Naidu: కన్నడ చిత్ర పరిశ్రమలో విషాదం.. రోడ్డు ప్రమాదం బారిన పడిన బుల్లితెర నటి.. ఆరేళ్ల కూతురు మృతి..

Modi Government: వాహనదారులకు గుడ్‌న్యూస్‌.. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. ప్రయాణికులకు మరింత భద్రత