Mahesh babu: సూపర్ స్టార్ అభిమానులకు గుడ్ న్యూస్.. కరోనా నుంచి కోలుకున్న మహేష్!
మహేశ్ బాబు అభిమానులకు శుభవార్త.. కొద్ది రోజుల క్రితం కరోనా బారిన పడిన ఆయన ఇప్పుడు కోలుకున్నారు. తాజాగా నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల్లో ప్రిన్స్ కు కరోనా
మహేశ్ బాబు అభిమానులకు శుభవార్త.. కొద్ది రోజుల క్రితం కరోనా బారిన పడిన ఆయన ఇప్పుడు కోలుకున్నారు. తాజాగా నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల్లో ప్రిన్స్ కు కరోనా నెగిటివ్ గా వచ్చినట్లు సమాచారం. అయితే దీనిపై అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉంది. కాగా జనవరి 6వ తేదీన మహేష్ బాబు కరోనా బారిన పడ్డారు. స్వల్ప లక్షణాలు ఉండటం తో కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకున్న ఆయనకు పాజిటివ్ గా తేలింది. అప్పటినుంచి దాదాపు ఎనిమిది రోజులకు పైగా హోమ్ ఐసోలేషన్ లోనే ఉన్నారు ప్రిన్స్. వైద్యుల పర్యవేక్షణలో, వారి సలహాలు, సూచనలు పాటిస్తూ చికిత్స తీసుకుంటున్నారు.
కాగా దురదృష్టవశాత్తూ మహేష్ కరోనా బారిన పడిన సమయంలోనే ఆయన సోదరుడు రమేష్ బాబు మృతి చెందారు. దీంతో అన్నయ్య కడసారి చూపునకు కూడా నోచుకోలేకపోయాడు. మహేష్ బాబు స్థానంలో ఆయన భార్య నమ్రత శిరోద్కర్ రమేష్ బాబు అంత్యక్రియలకు హాజరయ్యారు.
Also Read: Viral Story: ఈ పాల వ్యాపారి 800 మందికి తండ్రి.. డీఎన్‌ఏ టెస్ట్‌తో తేలిన రహస్యం..