Viral video: ఎమ్మెల్యే టికెట్ రాలేదని వెక్కి వెక్కి ఏడ్చిన బీఎస్పీ నాయకుడు.. ఆత్మాహుతి చేసుకుంటానంటూ..
ఉత్తర ప్రదేశ్‌తో సహా 5 రాష్ట్రాల అసెంబ్లీలకు త్వరలో జరగనున్న ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ ఎన్నికలపై చర్చ నడుస్తోంది. ముఖ్యంగా
ఉత్తర ప్రదేశ్‌తో సహా 5 రాష్ట్రాల అసెంబ్లీలకు త్వరలో జరగనున్న ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ ఎన్నికలపై చర్చ నడుస్తోంది. ముఖ్యంగా దేశంలోనే అత్యధిక అసెంబ్లీ స్థానాలున్న ఉత్తర ప్రదేశ్ లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు ఈ సారి చాలా ఆసక్తికరంగా మారాయి. ఎన్నికల్లో విజయం సాధించేందుకు అన్ని పార్టీలు తీవ్ర కసరత్తులు చేస్తున్నాయి. కాగా మొత్తం 403 అసెంబ్లీ స్థానాలున్న ఉత్తర ప్రదేశ్ శాసన సభ ఎన్నికలు ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకు మొత్తం ఏడు దశల్లో జరగనున్నాయి. ఈమేరకు యూపీ మొదటి దశ అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ కూడా విడుదలైంది. ఇందులో భాగంగా జనవరి 14 నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. ఈ నెల 21 వరకు నామినేషన్లు ఉంటాయి. మొదటి దశలో 58 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది.
టికెట్ కోసం భారీగా డబ్బు ముట్టజెప్పాను..
ఈక్రమంలో పోలింగ్ తేదీలు ఖరారుకావడంతో పార్టీ టిక్కెట్ల విషయంలోనూ రగడ మొదలైంది. కాగా ముజఫర్‌నగర్‌లోని చార్తావాల్ స్థానం నుంచి అసెంబ్లీ టికెట్ ఆశించాడు బీఎస్పీ(బహుజన సమాజ్ పార్టీ) నాయకుడు అర్షద్ రాణా. అయితే బీఎస్పీ అధినేత్రి మాయావతి మాత్రం చార్తావాల్ అసెంబ్లీ స్థానం నుంచి సల్మాన్ సయీద్‌ను పార్టీ పోటీకి దింపినట్లు ట్వీట్ చేసింది. దీంతో ఎమ్మెల్యే టికెట్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్న రాణా ఖంగుతిన్నాడు. ఈ సందర్భంగా టికెట్ల కేటాయింపులో తనకు తీవ్ర అన్యాయం జరిగిందంటూ సోషల్ మీడియా వేదికగా వాపోయాడు. బీఎస్పీ నేత షంషుద్దీన్ రైన్ టికెట్ పేరుతో తమ నుంచి రూ.67 లక్షలు తీసుకున్నారని వెక్కి వెక్కి ఏడ్చాడు.
నాకు తీవ్ర అన్యాయం జరిగింది..
చార్తావాల్ అసెంబ్లీ నియోజకవర్గంలోని దధేడు గ్రామానికి చెందిన అర్షద్ రాణా చాలా కాలంగా బీఎస్పీలో యాక్టివ్‌గా పనిచేస్తున్నారు. ఆయన సతీమణి కూడా జిల్లా పంచాయతీ సభ్యుని పదవికి బీఎస్పీ తరపున పోటీ చేశారు. ఈ క్రమంలోనే బీఎస్పీ నుంచి చార్తావాల్ స్థానం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు రెడీ అయ్యారు. అయితే అధినేత్రి కరుణించకపోవడంతో కన్నీటిపర్యంతమయ్యారు. తనకు అన్యాయం జరిగిందని పోలీసుల ముదు వాపోయాడు. తనకు న్యాయం చేయకపోతే ఆత్మాహుతి చేసుకుంటానని హెచ్చరించారు.
#WATCH | Uttar Pradesh: BSP worker Arshad Rana bitterly cries claiming that he was promised a ticket in UP election only to be denied ticket at the last moment despite putting up hoardings for the upcoming polls pic.twitter.com/DMe8mDHk2J
— ANI UP/Uttarakhand (@ANINewsUP) January 14, 2022
Also read:Ram Asur: ఓటీటీలోకి అడుగుపెట్టిన రామ్ అసుర్.. ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోందంటే..