Ram Asur: ఓటీటీలోకి అడుగుపెట్టిన రామ్ అసుర్.. ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోందంటే..
రొటీన్ కు భిన్నమైన కాన్సెప్ట్ లు, కేక పుట్టించే కథనాలు, ఒళ్లుగగుర్పొడిచే సన్నివేశాలూ చూడాలంటే కేవలం హాలీవుడ్ సినిమాలు తప్ప మనకు వేరే దారిలేదా అని ఫీలయ్యేవాళ్లు
రొటీన్ కు భిన్నమైన కాన్సెప్ట్ లు, కేక పుట్టించే కథనాలు, ఒళ్లుగగుర్పొడిచే సన్నివేశాలూ చూడాలంటే కేవలం హాలీవుడ్ సినిమాలు తప్ప మనకు వేరే దారిలేదా అని ఫీలయ్యేవాళ్లు చాలామందే ఉంటారు. అయితే, క్రమంగా తెలుగులోనూ మంచి కాన్సెప్ట్ లతో తెరకెక్కుతున్న సినిమాలు ఈ మధ్య మన ముందు వస్తూనే ఉన్నాయి. ప్రేక్షకుల టేస్ట్ కు తగ్గట్లు ఫిల్మ్ మేకర్లు కూడా… అవుట్ ఆఫ్ ది బాక్స్ ఐడియాస్ తో చెలరేగిపోతున్నారు. ఈ క్రమంలో విభిన్నమైన కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఆకట్టుకుంది రామ్ అసుర్. గతేడాది నవంబర్ లో విడుదలైన ఈ చిత్రం ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. సంక్రాంతికి ఓటీటీల్లో విడుదలైన సినిమాల్లో మంచి రేటింగ్స్ సంపాదించుకుని దూసుకుపోతోంది.
కృత్రిమ వజ్రం తయారీపై తెరెకెక్కిన ఈ చిత్రం థియేటర్ రిలీజ్ కు మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకూ ఇలాంటి కాన్సెప్ట్ రాకపోవడంతో ప్రేక్షకుల్లో సినిమాలపై మంచి అంచనాలే నెలకొని ఉన్నాయి. అభినవ్ సర్దార్ స్వీయనిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రానికి వెంకటేశ్ త్రిపర్ణ దర్శకత్వం వహించారు. భీమ్ సిసిరోలియో స్వరాలు ఆబాలగోపాలాన్నీ ఆకట్టుకున్నాయి. ఏం చేశావో ఏమో మాయ పాట యూత్ కాలర్ ట్యూన్ గా మారిపోయింది. పీరియాడిక్ లవ్ స్టోరీతో పాటూ, కాంటెంపరరీ ప్రేమకథతో కూడిన రామ్ అసుర్ సినిమాలో ట్విస్ట్ లు, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కు కొదవలేదని తెలుస్తూనే ఉంది. అభినవ్ సర్దార్, చాందనీ, రామ్ కార్తీక్, షెర్రీ అగర్వాల్ లీడ్ రోల్స్ లో కనిపించగా… ప్రేమ, భావోద్వేగం, యాక్షన్, ఎంటర్టైన్మెంట్ మళితమైన రామ్ అసుర్… ఈ వీకెండ్ కు మంచి టైమ్ పాస్ అన్నమాటే…
Also Read: Bunny Vox: ట్రెడిషినల్ లుక్ లో అదరగొడుతున్న బన్నీవాక్స్
Krithi Shetty: క్యూట్ లుక్స్ తో ఫ్యాన్స్ ని ఫిదా చేస్తున్న కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోస్