UP Election 2022: బీజేపీ తొలి జాబితా విడుదల.. సీఎం యోగి పోటీ అక్కడి నుంచే..

Yogi Adityanath to contest from Gorakhpur: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గోరఖ్‌పూర్ నుంచి పోటీలో నిలపాలని భారతీయ జనతా పార్టీ

UP Election 2022: బీజేపీ తొలి జాబితా విడుదల.. సీఎం యోగి పోటీ అక్కడి నుంచే..
Yogi Adityanath

Yogi Adityanath to contest from Gorakhpur: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గోరఖ్‌పూర్ నుంచి పోటీలో నిలపాలని భారతీయ జనతా పార్టీ (BJP) నిర్ణయించింది. మరికొన్ని రోజుల్లో జరగనున్న ఉత్తరప్రదేశ్ (UP Election 2022) అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ తన తొలి జాబితాను శనివారం విడుదల చేసింది. ఈ జాబితాను కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ విడుదల చేశారు. న్యూఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో తొలి జాబితాను ఇద్దరు నేతలు విడుదల చేశారు. మరో బీజేపీ నేత, డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య సిరతు నుంచి పోటీలో నిలవనున్నారు. రాజకీయంగా కీలకమైన ఈ రాష్ట్రంలో బీజేపీ మళ్లీ ఆదిత్యనాథ్‌ (Yogi Adityanath) ను ముఖ్యమంత్రిగా అభర్థిగా ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.

ఇదిలాఉంటే.. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రాష్ట్రంలో ఎన్నికల తేదీల ప్రకటనను స్వాగతించారు. “అత్యధిక మెజారిటీ” తో బిజెపి తిరిగి అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు. ఎన్నికల సంఘం ఉత్తరప్రదేశ్‌లో ఫిబ్రవరి 10 నుంచి ఏడు దశల ఓటింగ్‌ను ప్రకటించింది. ఓట్ల లెక్కింపు ఇతర నాలుగు రాష్ట్రాలతో పాటు మార్చిలో జరగనుంది.

ఈ మేరకు ఆదిత్యనాథ్ ట్విట్ చేశారు. “మేము ప్రజాస్వామ్య పండుగను స్వాగతిస్తున్నాము. ప్రజల ఆశీర్వాదంతో డబుల్ ఇంజిన్ ప్రభుత్వ విజయాల ఆధారంగా.. బీజేపీ అఖండ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది” అని ఆదిత్యనాథ్ ట్వీట్ చేశారు.

రాష్ట్రంలో ఫిబ్రవరి 10, ఫిబ్రవరి 14, ఫిబ్రవరి 20, ఫిబ్రవరి 23, ఫిబ్రవరి 27, మార్చి 3, మార్చి 7న ఎన్నికలు జరగనున్నాయి. పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా మరియు మణిపూర్‌లతో పాటు ఉత్తరప్రదేశ్‌లో ఓట్ల లెక్కింపు మార్చి 10న జరగనుంది.

Also Read:

Car Loan: కొత్త కారు కొనుగోలు చేస్తున్నారా..? అదిరిపోయే ఆఫర్‌.. చౌక వడ్డీతో బ్యాంకు రుణాలు..!

National Army Day: దేశం కోసం సైనికులు చేసిన త్యాగాలను మాటల్లో చెప్పలేం.. భారత సైన్యానికి శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి, ప్రధాని..

Published On - 3:09 pm, Sat, 15 January 22

Click on your DTH Provider to Add TV9 Telugu