Tamannaah Bhatia : రెండేళ్ల తర్వాత ఖచ్చితంగా దాని గురించి ఆలోచిస్తా.. ఆసక్తికర కామెంట్స్ చేసిన మిల్కీబ్యూటీ..
శేఖర్ కమ్ముల దర్శకత్వలో వచ్చిన హ్యాపీడేస్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది అందాల భామ తమన్నా. ఆతర్వాత సోలో హీరోయిన్ గా చేస్తూ దూసుకుపోయింది.
Tamannaah Bhatia : శేఖర్ కమ్ముల దర్శకత్వలో వచ్చిన హ్యాపీడేస్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది అందాల భామ తమన్నా. ఆతర్వాత సోలో హీరోయిన్ గా చేస్తూ దూసుకుపోయింది. అనతికాలంలోనే స్టార్ హీరోయిన్ క్రేజ్ ను సొతం చేసుకుంది ఈ మిల్కీ బ్యూటీ. దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించి ఆకట్టుకుంది ఈ అందాల భామ. ఇక ఈ అమ్మడు ఇప్పుడు కాస్త సోల్ అయ్యిందనే చెప్పాలి. ఒకప్పుడు తెలుగులో వరుస సినిమాలతో రాణించిన తమన్నా.. ఆతర్వాత తమిళ్ లోనూ సినిమాలు చేసింది. అలాగే బాలీవుడ్ లోను తన అదృష్టాన్ని పరీక్షించుకుంది ఈ బ్యూటీ. ఈ మధ్య కాలంలో స్పెషల్ సాంగ్స్ లో మెప్పిస్తుంది తమన్నా. బెల్లంకొండ శ్రీనివాస్ నడిచిన అల్లుడు శీను సినిమాలో స్పెషల్ సాంగ్ లో నర్తించి మెప్పించింది. ఆతర్వాత తారక్ నటించిన జై లవకుశ, మహేష్ నటించిన సరిలేరు నీకెవ్వరు, రీసెంట్ గా వరుణ్ తేజ్ గని సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసింది తమన్నా.
ఇదిలా ఉంటే ఈ అమ్మడు పెళ్లి టాపిక్ ఇప్పుడు వైరల్ అవుతుంది. ఇప్పటికే హీరోయిన్స్ అంతా ప్రేమ , పెళ్లి అంటూ తిరుగుతుంటే తమన్నా మాత్రం ఎప్పుడు సినిమాల గురించే ఆలోచిస్తుంది. తాజాగా ఈ అమ్మడిని పెళ్ళెప్పుడు అని అడిగితే ఆసక్తికర సమాధానం చెప్పుకొచ్చింది. ఇప్పటికైతే తాను పెళ్లి గురించి ఆలోచించటం లేదని.. మరో రెండేళ్ల వరకు మాత్రం పెళ్లి ఆలోచనలు లేవని స్పష్టంచేసింది. రెండేళ్ల తర్వాత కచ్ఛితంగా పెళ్లి గురించి ఆలోచన చేస్తానని తెల్చి చెప్పేసింది తమన్నా. ఇక ఈ అమ్మడు ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ.1.5 కోట్ల నుంచి రూ.2 కోట్ల వరకు రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తుందట. అమ్మడి సినిమాల విషయానికొస్తే తాజాగా కన్నడలో ఒక పాన్ ఇండియా మూవీకి.. తెలుగులో ఎఫ్3.. అలాగే మెగాస్టార్ చిరంజీవితో భోళాశంకర్ లో జత కట్టేందుకు ఓకే చేసింది.
మరిన్ని ఇక్కడ చదవండి :