Samantha: ‘కొన్నాళ్ల క్రితం ఆలోచనలతో పోరాటం.. కానీ ఇప్పుడు..’ సమంత ఆసక్తికర పోస్ట్..
విదేశాలకు వెళ్లడానికి కంటే ముందు సామ్.. ఇప్పుడు యోగా కేంద్రాన్ని సందర్శించింది. తమిళనాడులోని కోయంబత్తూరులో ఉన్న ఈషా యోగా కేంద్రాన్ని సందర్శిస్తోంది. కొద్ది రోజులుగా ఆమె అక్కడే ఉంటూ ప్రకృతి ఒడిలో విశ్రాంతి తీసుకుంటుంది. ఈషా యోగా కేంద్రంలో పూర్తిగా ఆధ్యాత్మకి చింతనలో మునిగిపోయారు సామ్. అక్కడ ధ్యానంలో పాల్గొన్న ఫోటోస్ తన ఇన్ స్టాలో షేర్ చేస్తూ ఆసక్తికర పోస్ట్ చేసింది సమంత.

హీరోయిన్ సమంత ఇప్పుడు తన ఆరోగ్యంపై పూర్తిగా దృష్టి పెట్టింది. ఇటీవలే ఖుషి, సిటాడెల్ షూటింగ్స్ కంప్లీట్ చేసేసింది. త్వరలోనే మయోసైటిస్ సమస్యకు చికిత్స తీసుకునేందుకు విదేశాలకు వెళ్లనుంది. ఇందుకోసం ఆమె కొన్నాళ్లపాటు సినిమాలకు దూరం కానుంది. ఇప్పటికే తీసుకున్న రెమ్యూనరేషన్స్ సైతం తిరిగి ఇచ్చేసిందని సమాచారం. విదేశాలకు వెళ్లడానికి కంటే ముందు సామ్.. ఇప్పుడు యోగా కేంద్రాన్ని సందర్శించింది. తమిళనాడులోని కోయంబత్తూరులో సద్గురుకు చెందిన ఈషా ఫౌండేషన్‌ను సందర్శించింది. కొద్ది రోజులుగా ఆమె అక్కడే ఉంటూ ప్రకృతి ఒడిలో విశ్రాంతి తీసుకుంటోంది. ఈషా యోగా కేంద్రంలో పూర్తిగా ఆధ్యాత్మకి చింతనలో మునిగిపోయారు సామ్. తన ఆరోగ్య సమస్యలను ప్రకృతి వైద్యం ద్వారా నయం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు సామ్. అక్కడ ధ్యానంలో పాల్గొన్న ఫోటోస్ తన ఇన్ స్టాలో షేర్ చేస్తూ ఆసక్తికర పోస్ట్ చేసింది సమంత.
“కొన్నాళ్ల క్రితం.. ఎలాంటి ఆలోచనలు.. కదలికలు, మెలికలు తిరగకుండా నిశ్చలంగా ఒకచోట కూర్చోవడం దాదాపు అసాధ్యమనిపించింది. కానీ ఈరోజు ధాన్యం అనేది ప్రశాంతత, శక్తి, స్పష్టతకు అత్యంత శక్తివంతమైన మూలమని తెలిసింది. ఇంత సింపుల్ గా ఉండే ధ్యానం..ఇంత పవర్ ఫుల్ గా ఉంటుందని ఎవరు అనుకోరు.” అంటూ రాసుకొచ్చింది. ఇక సామ్ షేర్ చేసిన ఫోటోలలో సామాన్యులతోపాటు సమంత కూడా కూర్చొని ధ్యానం చేస్తూ కనిపించింది.




ఇదిలా ఉంటే.. ఇటీవలే తమిళనాడులోని గోల్డెన్ టెంపుల్ను రోడ్డు మార్గంలో వెళ్లి దర్శించుకున్నారు సామ్. అనంతరం అక్కడే ప్రత్యేక పూజలు చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోస్ నెట్టింట వైరలయ్యాయి. ఇక త్వరలోనే సామ్ నటించిన ఖుషి చిత్రం అడియన్స్ ముందుకు రానుంది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.