Samantha: జిమ్‌లో దుమ్ము రేపిన సమంత.. ఈ ఏడాది తగ్గేదే లే అంటున్న ముద్దుగుమ్మ
అందాల భామ సమంత ఏడాది పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చిన విషయం తెలిసిందే.. ఏ మాయ చేశావే సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన సమంత తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా మారి ప్రేక్షకులను మెప్పించింది. ఆ తర్వాత తెలుగులో వరుసగా సినిమాలు చేసింది. దాదాపు అందరు స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా చేసింది సమంత.
అందాల భామ సమంత ఇప్పుడు వరుస సినిమాలతో బిజీ అవ్వాలని రెడీ అవుతుంది. పాన్ ఇండియన్ హీరోయిన్స్ గా దూసుకుపోతుంటే.. తాను కూడా రేస్ కు రెడీ అంటూ సిద్దమవుతుంది సామ్. మాయోసైటిస్ కారణంగా ఏడాది పాటు సినిమాలకు దూరమైన ఈ చిన్నది ఇప్పుడు పూర్తిగా కోలుకుంది. సమంతకు తెలుగు, తమిళ్‌లో చాలా మంది అభిమానులు ఉన్నారు. ఈ ముద్దుగుమ్మ చివరిగా శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషి సినిమాలో నటించింది. ఈ చిత్రంలో నటుడు విజయ్ దేవరకొండకు జోడీగా నటించింది ఈ అమ్మడు.. ఈ చిత్రం తెలుగులోనే కాకుండా తమిళం, మలయాళం, కన్నడ వంటి భాషల్లో కూడా విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ సినిమా తర్వాత నటి సమంత అనారోగ్య సమస్యలతో సినిమాల్లో సినిమాలకు దూరం అయ్యింది.
గత సంవత్సరం 2024లో సమంత ఒక్క సినిమాలో మాత్రమే కనిపించింది. సమంత ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా జనాలు, అభిమానులు కూడా సమంతకు మద్దతు తెలిపారు. తాజాగా నటి సమంత విడుదల చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోలో నటి సమంత జిమ్‌లో వర్కవుట్ చేస్తూ కనిపించింది. ఈ ఇంగ్లిష్ న్యూ ఇయర్ పూర్తయ్యింది. ఇక ఇప్పుడు ఈ ఏడాది వర్కవుట్స్ చేయడానికి నిర్ణయించుకున్నట్టు కూడా వీడియోలో తెలిపింది సామ్. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.
నటి సమంతకు మద్దతుగా అభిమానులు ఈ పోస్ట్ కు కామెంట్స్ చేస్తున్నారు. నటి సమంత నటించిన హనీ పన్నీ 2024లో మాత్రమే విడుదలైంది. ఇందులో వరుణ్ ధావన్‌తో కలిసి నటించింది. విడాకుల తర్వాత తను నటించే సినిమాలకు మంచి కథలను ఎంపిక చేసుకుంటూ వస్తుంది సామ్. ఇప్పుడు ఈ చిన్నది వ్యాపారంలోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం సమంత తెలుగు, తమిళ్ భాషల్లో సినిమాలు అనౌన్స్ చేసింది. త్వరలోనే ఆయా సినిమాల షూటింగ్స్ లో సామ్ జాయిన్ అవ్వనుంది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి