ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ.. తెలుగులో సినిమాలు తగ్గించిన కుందనపు బొమ్మ కళ్యాణి..
కళ్యాణి ప్రియదర్శిని తెలుగులో హలో సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. ఈ సినిమాలో అక్కినేని యంగ్ హీరో అఖిల్ హీరోగా నటించాడు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. కానీ కళ్యాణి నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఈ మూవీ తర్వాత వరుసగా ఆఫర్స్ అందుకుంది ఈ అమ్మడు. హలో సినిమా తర్వాత శర్వానంద్ రణరంగం, తేజ్ చిత్రలహరి సినిమాలతో ప్రేక్షకులను మెప్పించింది.