- Telugu News Photo Gallery Cinema photos Tollywood Actress Laya Shares Sankranthi Bommala Koluvu Photos
Actress Laya: టాలీవుడ్ హీరోయిన్ లయ ఇంట సంక్రాంతి బొమ్మల కొలువు.. ఫొటోస్ చూశారా?
తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు ఈ పర్వదినాన్ని ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, సన్నిహితులతో సంతోషంగా గడిపారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి.
Updated on: Jan 17, 2025 | 10:47 AM

సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు తమ కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులతో ఘనంగా ఈ పండగను సెలబ్రేట్ చేసుకున్నారు.

కాగా సంక్రాతి సంబరాల్లో బొమ్మల కొలువులు కూడా భాగమే. తెలుగు వారి తొలి పండుగ సందర్భంగా ఇళ్లలో బొమ్మల కొలువులు ఏర్పాటు చేసి చుట్టు పక్కల వారిని ఆహ్వానించడం ఆనవాయితీగా వస్తోంది.

ఈ క్రమంలో ప్రముఖ నటి లయ ఇంట సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా బొమ్మల కొలువులో భాగంగా పలు దేవతా మూర్తుల బొమ్మలను ప్రతిష్ఠించిందీ అందాల తార.

ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి అందరికీ శుభాకాంక్షలు తెలిపింది లయ. ప్రస్తుతం ఈ బొమ్మల కొలువు ఫొటోలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.

టాలీవుడ్ హీరోయిన్ లయ సెకెండ్ ఇన్నింగ్స్ షురూ చేసింది. ప్రస్తుతం నితిన్ హీరోగా నటిస్తోన్న రాబిన్ హుడ్ సినిమాలో ఆమె ఓ కీలక పాత్ర పోషిస్తోంది.




