Tollywood : చదివింది ఇంటర్.. హీరోయిన్‌గా ఇరగదీసింది.. కట్ చేస్తే ఇప్పుడు ఇలా..

హీరోయిన్స్ ఫోటోలకు నెట్టింట యమా క్రేజ్ ఉంటుంది. తమ అభిమాన హీరోయిన్స్ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంటూ ఎంజాయ్ చేస్తుంటారు ఫ్యాన్స్. తమ ఆరాధ్య దైవంగా భావించే హీరోయిన్స్ చిన్ననాటి ఫోటోల దగ్గర నుంచి లేటెస్ట్ పిక్స్ వరకు అన్ని నెట్టింట వదులుతుంటారు ఫ్యాన్స్. ఈ క్రమంలోనే ఓ హాట్ బ్యూటీ ఫోటో నెట్టింట తారసపడింది. ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?

Tollywood : చదివింది ఇంటర్.. హీరోయిన్‌గా ఇరగదీసింది.. కట్ చేస్తే ఇప్పుడు ఇలా..
Tollywood Actress
Follow us
Rajeev Rayala

|

Updated on: Jan 15, 2025 | 6:56 PM

చాలా మంది హీరోయిన్స్ చిన్న వయసులోనే సినిమాల్లోకి అడుగుపెడుతున్నారు. కొంతమంది హీరోయిన్స్ గా సక్సెస్ ఫుల్ గా రాణిస్తున్నారు. మరికొంతమంది స్టార్ డమ్ కోసం ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నారు. అలాంటి వారిలో పైన కనిపిస్తున్న భామ ఒకరు. వరుసగా సినిమాలు చేస్తున్న హిట్స్ మాత్రం అందుకోలేకపోతుంది. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో సినిమాలు చేసింది. ఫ్లాప్స్ తో పాటు భారీ హిట్స్ కూడా అందుకుంది. కానీ అనుకున్నంత గుర్తింపు సాధించలేకపోయింది. ఇంటర్ తో చదువు ఆపేసి సినిమాల్లోకి ఎంటర్ అయ్యింది. తెలుగులో తొలి సినిమాలో తన అందంతో మంచి మార్కులు కొట్టేసింది. హీరోయిన్ గా వరుసగా సినిమాలు చేసింది. కానీ అదృష్టం కలిసి రాక సెకండ్ హీరోయిన్ గా మారిపోయింది. ఇంతకూ ఆ ముద్దుగుమ్మ ఎవరో కనిపెట్టారా. ?

ఇది కూడా చదవండి :ఈ రెండు జెళ్ల సీతను గుర్తుపట్టారా.? ఆమెను ఇప్పుడు చూడగానే లవ్‌లో పడిపోతారు

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ కొన్ని సినిమాలకే పరిమితం అవుతున్నారు. చేసింది తక్కువ సినిమాలే అయినా విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంటున్నారు. కానీ ఆతర్వాత కనిపించకుండా పోతున్నారు ఈ ముద్దుగుమ్మలు. మరికొంతమంది టాలీవుడ్ లో సినిమాలు చేసి ఆతర్వాత బాలీవుడ్ కు చెక్కేస్తున్నారు. అలాంటి వారిలో ఈ హీరోయిన్ ఒకరు ఆమె మరెవరో కాదు హాట్ బ్యూటీ అదాశర్మ. హార్ట్ ఎటాక్ సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది ఈ బ్యూటీ. మొదటి సినిమాలోనే తన క్యూట్ పర్ఫామెన్స్ తో కవ్వించింది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : ఇదెక్కడి హైప్ రా మావ..! పవన్ కళ్యాణ్ ఓజీలో ఈ క్రేజీ బ్యూటీతో స్పెషల్ సాంగ్

ఆతర్వాత వరుసగా తెలుగులో సినిమాలు చేసింది. ఆతర్వాత సెకండ్ హీరోయిన్ గా కొన్ని సినిమాలు చేసింది. ఆతర్వాత బాలీవుడ్ కు చెక్కేసింది. అక్కడ లేడీ ఓరియేంటేడ్ సినిమాలతో పాపులర్ అయ్యింది ఈ భామ. అదా శర్మ నటించిన కేరళ స్టోరీ సినిమా భారీ హిట్ గా నిలిచింది. అలాగే అక్కడ పలు సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా మారిపోయింది ఈ వయ్యారి భామ. సోషల్ మీడియాలో క్రేజీ ఫోటోలు వదులుతుంది. ఓ వైపు అందాలు ఆరబోస్తూనే మరో వైపు క్రేజీ పిక్స్ షేర్ చేస్తుంది ఈ అమ్మడు.

View this post on Instagram

A post shared by Adah Sharma (@adah_ki_adah)

మరిన్ని సినిమా వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి