AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Manchu Manoj: మోహన్‌బాబు యూనివర్సిటీ దగ్గర ఉద్రిక్తత.. మనోజ్‌ను అడ్డుకున్న సిబ్బంది

మోహన్ బాబు యూనివర్సిటీ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కాలేజీకి మంచు మనోజ్ వస్తాడన్న సమాచారంతో.. మోహన్ బాబు కాలేజీ గేట్లను సెక్యూరిటీ సిబ్బంది పూర్తిగా మూసివేశారు. ప్రస్తుతం మోహన్ బాబు కాలేజీ వద్దకు ఎవరిని అనుమతించడం లేదు.మీడియా రిపోర్టర్లను కూడా అక్కడ నుంచి వెళ్లిపోవాలని భద్రతా సిబ్బంది సూచించారు. మరోవైపు ముందస్తు జాగ్రత్తగా పోలీసులు కాలేజీ వద్దకు చేరుకున్నారు.

Manchu Manoj: మోహన్‌బాబు యూనివర్సిటీ దగ్గర ఉద్రిక్తత.. మనోజ్‌ను అడ్డుకున్న సిబ్బంది
Manchu Manoj
Rajeev Rayala
|

Updated on: Jan 15, 2025 | 5:26 PM

Share

మంచు ఫ్యామిలీ గొడవలు ఇంకా తగ్గినట్టు కనిపించడం లేదు. తాజాగా మంచు మనోజ్ ను మోహన్ బాబు యూనివర్సటీ సిబ్బంది అడ్డుకున్నారు. యూనివర్సిటీలోకి వెళ్లకుండా మంచు మనోజ్ ను అడ్డుకున్నారు సిబ్బంది. దాంతో అక్కడ గందరగోళం నెలకొంది. తిరుపతిలోని  మోహన్‌బాబు యూనివర్సిటీ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. యూనివర్సిటీలోనికి  వెళ్లేందుకు మంచు మనోజ్‌ ప్రయత్నిచారు. అయితే మంచు మనోజ్‌ను సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. తాత, నానమ్మకు నివాళి అర్పించేందుకు వచ్చా.. గొడవ చేసేందుకు నేను ఇక్కడికి రాలేదు అని మనోజ్ చెప్పినా కూడా వారు వినలేదు. కోర్టు ఆదేశాలు ఉన్నాయని అందుకే మనోజ్ ను అనుమతించలేదని సిబ్బంది చెప్తున్నారు. దాంతో అక్కడ గందరగోళ వాతావరణం నెలకొంది. అంతకు ముందు మనోజ్ దంపతులు నారావారిపల్లి లో సీఎం చంద్రబాబు ఇంటికి వెళ్లారు. అక్కడ మంత్రి నారా లోకేష్ తో పాటు కుటుంబ సభ్యులను కలిశారు.

ఇది కూడా చదవండి :ఈ రెండు జెళ్ల సీతను గుర్తుపట్టారా.? ఆమెను ఇప్పుడు చూడగానే లవ్‌లో పడిపోతారు

గతంలో  మోహన్ బాబు పై మనోజ్.. అలాగే మనోజ్ పై మోహన్ బాబు ఒకరి పై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. తన భార్య పిల్లల పై దాడి చేశారని మనోజ్ ఆరోపించారు. ఆ తర్వాత జల్‌పల్లిలోని మంచు టౌన్ కు వెళ్లారు మంచు మనోజ్ దంపతులు. మంచు మనోజ్ వాహనాన్ని గేట్ దగ్గరే బౌన్సర్లు ఆపేశారు. దాంతో మనోజ్ ఆగ్రహంతో ఊగిపోయారు. గేట్లు బద్దలు కొట్టుకుంటూ మనోజ్ లోపలి దూసుకుపోయారు. అడ్డుకున్న సిబ్బంది పై మనోజ్ వాగ్వాదానికి దిగారు.

ఇది కూడా చదవండి : ఇదెక్కడి హైప్ రా మావ..! పవన్ కళ్యాణ్ ఓజీలో ఈ క్రేజీ బ్యూటీతో స్పెషల్ సాంగ్

ఆతర్వాత మోహన్ బాబు మనోజ్ గురించి ఓ వాయిస్ నోట్ ను రిలీజ్ చేశారు. మనోజ్ తాగి పనివాళ్లను కోడుతున్నాడని, భార్యమాటలు విని మందుకు బానిసయ్యాడని, క్రమశిక్షణ తప్పాడని మోహన్ బాబు అన్నారు. తాజాగా జరిగిన పరిణామంతో మంచు ఫ్యామిలీ వివాదం ఇంకా కొనసాగుతూనే ఉందని అర్ధమవుతుంది. దీని పై మోహన్ బాబు ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..