AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rashmika Mandanna: మూడు భాషలను మడతపెట్టేస్తున్న ముద్దుగుమ్మ.. ఏకంగా ఐదు సినిమాలతో నేషనల్ క్రష్

కన్నడ భాషలో ముందుగా సినిమాలు చేసిన ఈ చిన్నది. ఆ తర్వాత తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు నేషనల్ క్రష్ గా మారిపోయింది. 'యానిమల్' సినిమాలో చాలా బోల్డ్‌గా నటించి ఆకట్టుకుంది.

Rashmika Mandanna: మూడు భాషలను మడతపెట్టేస్తున్న ముద్దుగుమ్మ.. ఏకంగా ఐదు సినిమాలతో నేషనల్ క్రష్
Rashmika
Rajeev Rayala
|

Updated on: Nov 11, 2024 | 1:01 PM

Share

నేషనల్ క్రష్ రష్మిక చాలా బిజీగా మారిపోయింది. పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయిన ఈ చిన్నది. ప్రస్తుతం బిజీగా ఉన్న హీరోయిన్స్ లో రష్మిక ఒకరు. కన్నడ భాషలో ముందుగా సినిమాలు చేసిన ఈ చిన్నది. ఆ తర్వాత తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు నేషనల్ క్రష్ గా మారిపోయింది. ‘యానిమల్’ సినిమాలో చాలా బోల్డ్‌గా నటించి ఆకట్టుకుంది. ప్రస్తుతం టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్‌లో బిజీగా మారిపోయింది ఈ అమ్మడు. మరో 10 నెలల్లో రష్మిక నటించిన 5 సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఆ సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం..!

ఇది కూడా చదవండి :Jr.NTR : ఈ ఎన్టీఆర్ హీరోయిన్ను గుర్తుపట్టారా.? అస్సలు ఊహించలేరు గురూ..

రష్మిక మందన్న 2016లో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. కేవలం 8 ఏళ్లలో ఆమె క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. స్టార్ హీరోలతో నటిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది ఈ అమ్మడు. రష్మిక సినిమాలు బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ అవుతున్నాయి. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటిస్తోన్న ‘పుష్ప 2’ చిత్రంలో రష్మిక హీరోయిన్ గా చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమా డిసెంబర్ 5న విడుదల కానుంది. ఈ సినిమాపై రష్మిక ఆశలు పెట్టుకున్నారు.అలాగే  ‘చావా’ అనే హిందీ సినిమా డిసెంబర్ 6న విడుదలవుతోంది. ఇందులో రష్మిక ఓ పవర్‌ఫుల్ పాత్ర పోషిస్తున్నారు. ఛత్రపతి శివాజీ కొడుకు శంభాజీ భార్య పాత్రలో రష్మిక కనిపించనుంది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : Life of Pi : లైఫ్ ఆఫ్ పై సినిమాలో చేసిన ఈ చిన్నది గుర్తుందా.? ఇప్పుడు ఆమెను చూస్తే దిమ్మ తిరగాల్సిందే

అలాగే ‘ది గర్ల్‌ఫ్రెండ్‌’ అనే సినిమాలో నటిస్తోంది ఈ భామ. రాహుల్ రవీంద్రన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సినిమా కథ పూర్తిగా రష్మిక చుట్టూనే తిరుగుతుంది. వచ్చే వేసవిలో ఈ సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది. వీటితో పాటు రష్మిక మందన్న ‘సిఖందర్’లో సల్మాన్ ఖాన్‌తో జతకట్టింది. ఈ చిత్రానికి ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం 2025 ఈద్‌కు విడుదల కానుంది. ఇది కాకుండా స్టార్ హీరోలు ధనుష్, నాగార్జున నటించిన ‘కుబేర’ సినిమాలో కూడా నటిస్తుంది. ఈ సినిమా కూడా వచ్చే ఏడాది విడుదల కానుంది. కాగా రష్మిక ‘రెయిన్‌బో’ అనే చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన ఒక దశ షూటింగ్ పూర్తయింది. ఇలా రష్మిక నటించిన సినిమాలు బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ అవుతున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వెళ్లింది ఆరుగురు.. వచ్చింది మాత్రం ఐదుగురే.. నడి సముద్రంలో..
వెళ్లింది ఆరుగురు.. వచ్చింది మాత్రం ఐదుగురే.. నడి సముద్రంలో..
రూ. 10 వేలు పెట్టుబడితో ఏకంగా రూ. 1 కోటి రాబడి..
రూ. 10 వేలు పెట్టుబడితో ఏకంగా రూ. 1 కోటి రాబడి..
జాలీ జాలీగా ఎంజాయ్ చేయాలా.. జనవరిలో ఈ ప్రదేశాలు చుట్టేయ్యండి మరి!
జాలీ జాలీగా ఎంజాయ్ చేయాలా.. జనవరిలో ఈ ప్రదేశాలు చుట్టేయ్యండి మరి!
నాకు అండగా మాట్లాడింది ఆ ఇద్దరు హీరోయిన్లే.. సుమన్
నాకు అండగా మాట్లాడింది ఆ ఇద్దరు హీరోయిన్లే.. సుమన్
లవంగం నీరు తాగితే మీ శరీరానికి అద్భుత ప్రయోజనాలు!
లవంగం నీరు తాగితే మీ శరీరానికి అద్భుత ప్రయోజనాలు!
వీరికి విజయం సులభంగా రాదు..30 ఏళ్ల తర్వాత సక్సెస్ అయ్యే వారు వీరే
వీరికి విజయం సులభంగా రాదు..30 ఏళ్ల తర్వాత సక్సెస్ అయ్యే వారు వీరే
చికెన్, మటన్ పాయ కాదండోయ్.. చేపల పాయ సూప్ ఇంట్లోనే ఇలా చేసెయ్యండి
చికెన్, మటన్ పాయ కాదండోయ్.. చేపల పాయ సూప్ ఇంట్లోనే ఇలా చేసెయ్యండి
విజయ్ హజారే ట్రోఫీలో కుర్రాళ్ల వీరబాదుడు..టాప్5 రన్ మెషీన్లు వీరే
విజయ్ హజారే ట్రోఫీలో కుర్రాళ్ల వీరబాదుడు..టాప్5 రన్ మెషీన్లు వీరే
గ్రీక్ యోగర్ట్ వర్సెస్ వే ప్రోటీన్.. తమన్నా ట్రైనర్ చెప్పేదిదే?
గ్రీక్ యోగర్ట్ వర్సెస్ వే ప్రోటీన్.. తమన్నా ట్రైనర్ చెప్పేదిదే?
వామ్మో.. రికార్డ్‌ స్థాయికి బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే?
వామ్మో.. రికార్డ్‌ స్థాయికి బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే?