OTT Movie : ఒంటరిగా చూడకండి..! భయంతో గుండె ప్యాంట్‌లోకి జారిపోతుంది

ఓటీటీలో ఇప్పటికే చాలా రకాలా సినిమాలు అందుబాటులో ఉన్నాయి. ఓటీటీలో ఇప్పటికే చాలా సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ట్రెండింగ్ లో ఉన్నాయి. అలాగే ఓటీటీలో ఆకట్టుకుంటున్న సినిమాల్లో హారర్ జోనర్ సినిమాకు చాలానే ఉన్నాయి.

OTT Movie : ఒంటరిగా చూడకండి..! భయంతో గుండె ప్యాంట్‌లోకి జారిపోతుంది
Ott Movie
Follow us
Rajeev Rayala

|

Updated on: Nov 09, 2024 | 12:54 PM

ఓటీటీలో ఇప్పటికే చాలా సినిమాలు సందడి చేస్తున్నాయి. కొత్త సినిమాలు థియేటర్స్ లో రిలీజ్ అవుతుంటే ఓటీటీలో ప్రతి శుక్రవారం పదుల సంఖ్యలో సినిమాలు సందడి చేస్తున్నాయి. ఓటీటీలో ఇప్పటికే చాలా రకాలా సినిమాలు అందుబాటులో ఉన్నాయి. ఓటీటీలో ఇప్పటికే చాలా సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ట్రెండింగ్ లో ఉన్నాయి. అలాగే ఓటీటీలో ఆకట్టుకుంటున్న సినిమాల్లో హారర్ జోనర్ సినిమాకు చాలానే ఉన్నాయి. ప్రేక్షకులు ఇలాంటి సినిమాలు చూడటానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు. భయపడుతూనైనా హారర్ సినిమాలు చూడటానికి ఆసక్తి చూపిస్తుంటారు ఆడియన్స్. ఇక ఇప్పుడు ఓ హారర్ సినిమా ఓటీటీలో తెగ ట్రెండ్ అవుతుంది. ఈ సినిమాను ఒంటరిగా చూడకపోవడమే మంచిది.

ఇది కూడా చదవండి : జర్నీ సినిమాలో నటించిన ఈ అమ్మాయి గుర్తుందా..? ఆమె ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..

ఇప్పుడు ఓటీటీలో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న సినిమాలో హారర్ ఎలిమెంట్స్ చాలానే ఉన్నాయి. ఇక ఈ సినిమాలో ఓ  నలుగురు ఫ్రెండ్స్ కారులో అడవిలో వెళ్తుంటారు. దారిలో అనుకోకుండా వాళ్ళ కారు ఓ చెట్టును ఢీ కొడుతుంది. దాంతో అక్కడే ఉన్నవారికీ ఓ వుడెన్ హౌజ్ కనిపిస్తుంది. అయితే ఆ ఫ్రెండ్స్ అక్కడ కొన్ని బొమ్మలను చూస్తారు. కానీ ఆ కళ్లు, చెవి, నోరు ఇలా కొన్ని పార్ట్స్ ఉండవు. కానీ వాటి ప్లేస్ లో మనుషుల అవయవాలు పెట్టి ఉంటాయి.

ఇది కూడా చదవండి : మావా.. ఎవరో గుర్తుపట్టావా.? అప్పట్లో ఊపేసిన శాంతాబాయి.. ఇప్పుడు ఎలా ఉందంటే

మనిషి అవయవాలతో ఉన్న ఆ బొమ్మలను చూసి ఆ ఫ్రెండ్స్ వణికిపోతారు. ఎటు చూసినా బొమ్మలే కనిపిస్తాయి. అసలు ఆ బొమ్మలు ఏంటి.? అక్కడికి ఆ బొమ్మలు ఎవరు తెచ్చారు.? అయితే ఆ బొమ్మల గురించి వాళ్ళు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. దాంతో వాళ్లకు ఊహ కందని ఎన్నో మిస్టరీలు ఎదురవుతాయి.. అయితే అక్కడ ఆ బొమ్మలను పెట్టి కొంతమంది పూజలు చేస్తుంటారు. అసలు ఎవరు అక్కడ పూజలు చేసేది.? వాళ్ళు కాకుండా అక్కడ ఉన్నది ఎవరు.? ఆ బొమ్మలకు మనుషుల అవయవాలు ఎందుకు అతికించారు. ఈ సినిమాలో ఎన్నో భయానక సన్నివేశాలు ఉంటాయి. ఆ నలుగురని కొందరు ముసుగు వ్యక్తులు అతి కిరాతకంగా వెంటాడి చంపుతుంటారు. అక్కడే ఊహించని ట్విస్ట్ లు ఉంటాయి. అసలు అది అడవి కాదు అని.. వాళ్ళు అక్కడకు ఎలా వచ్చారు అనేది ట్విస్ట్. ఈ సినిమా పేరు ఏ క్లాసిక్ హారర్ స్టోరీ నెట్‌ఫ్లిక్స్‌లో పది భాషల్లో ఓటీటీ రిలీజ్ అయింది.. ఈ సినిమాను ఒంటరిగా చూడకపోవడమే బెటర్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.