- Telugu News Photo Gallery Cinema photos Tollywood audience serious kollywood about not giving theatres for KA movie
తమిళనాడులో పరభాషా చిత్రాలకు థియేటర్లు ఇవ్వరా ??
పొరుగు సినిమాలను, పొరుగు కంటెంట్‌ని... వాళ్ల నేటివ్ పేర్లతో సహా మనం ఆదరిస్తున్నప్పుడు, థియేటర్లను ఖాళీ చేసిచ్చి ఆహ్వానిస్తున్నప్పుడు... మన సినిమాలకు కూడా అక్కడివారు అలాగే స్వాగతం పలకాలి కదా... అసలు అలాగే జరుగుతోందా? ముఖ్యంగా తమిళనాడులో ఆ పరిస్థితి ఉందా?
Updated on: Nov 09, 2024 | 2:15 PM

పొరుగు సినిమాలను, పొరుగు కంటెంట్‌ని... వాళ్ల నేటివ్ పేర్లతో సహా మనం ఆదరిస్తున్నప్పుడు, థియేటర్లను ఖాళీ చేసిచ్చి ఆహ్వానిస్తున్నప్పుడు... మన సినిమాలకు కూడా అక్కడివారు అలాగే స్వాగతం పలకాలి కదా... అసలు అలాగే జరుగుతోందా? ముఖ్యంగా తమిళనాడులో ఆ పరిస్థితి ఉందా?

క సినిమా చూసిన వారందరూ కంటెంట్ కేక అని మెచ్చుకుంటున్నారు. థియేటర్లకి జనాలు క్యూ కడుతున్నారు. మరి ఇలాంటి కంటెంట్ ఉన్న మూవీ ప్యాన్ ఇండియా రేంజ్‌లో రిలీజ్ అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ తీరా థియేటర్లు దొరక్క ఒన్లీ తెలుగు రిలీజ్‌తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

తమిళనాడులో తెరకెక్కిన అమరన్ సినిమాను అదే పేరుతో ఇక్కడికి ఆహ్వానించి థియేటర్లు ఇచ్చాం. దీపావళికి మన సినిమాలు రిలీజులకున్నప్పటికీ, మనం అమరన్‌కి స్క్రీన్స్ అకామడేట్ చేయగలిగాం. అలాంటప్పుడు, మన సినిమాలకు తమిళనాడులో థియేటర్స్ ఎందుకు దొరకడం లేదన్నది సర్వత్రా వినిపిస్తున్న ప్రశ్న.

తమిళనాడులో పొరుగు సినిమాలకు థియేటర్లు ఎందుకు దక్కడం లేదనే ప్రశ్న ఈ మధ్య సూర్యకి కూడా ఎదురైంది. అదర్ స్టేట్స్ బాక్సాఫీస్ మీద తమిళ హీరోలు దండయాత్ర చేస్తున్నప్పుడు... అక్కడ స్క్రీన్స్ లో మిగిలిన వారికి కూడా చోటివ్వాలి కదా అన్నది కంగువ ప్రమోషన్లలో సూర్యకి స్ట్రయిట్‌గా తగిలిన ప్రశ్న.

ఇన్నాళ్లూ కోలీవుడ్ తీరును మౌనంగా భరించిన వారు ఇప్పుడు ఓపెన్ అవుతున్నారు. మరి కోడంబాక్కం సర్కిల్స్ కి ఈ విషయం వినిపిస్తున్నట్టేనా? నియర్ ఫ్యూచర్‌లో అయినా మార్పును ఆశించవచ్చా?




