- Telugu News Photo Gallery Cinema photos Official Shooting Update on Ranbir Kapoor and Sai Pallavi Ramayana, Details Here
Ramayana: మొదటి పార్ట్ 2026 దివాళికి.. రెండో భాగం 2027 దివాళికి.! రామాయణ అప్డేట్..
రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి జంటగా నితిష్ తివారి తెరకెక్కిస్తున్న సినిమా రామాయణ. ఇందులో కేజియఫ్ ఫేమ్ యశ్ రావణుడిగా నటిస్తున్నారు. ఈ చిత్రంపై అధికారిక ప్రకటన వచ్చింది. సినిమా రెండు భాగాలుగా రాబోతుందని.. మొదటి పార్ట్ 2026 దివాళికి.. రెండో భాగం 2027 దివాళికి విడుదల కానుందని డిక్లేర్ చేశారు మేకర్స్. రామాయణ్ రిలీజ్ గురించి అఫీషియల్ ప్రకటన వచ్చీ రాగానే అందరికీ డార్లింగ్ ప్రభాస్ నటించిన ఆదిపురుష్ గుర్తుకొస్తోంది.
Updated on: Nov 09, 2024 | 6:55 PM

రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి జంటగా నితిష్ తివారి తెరకెక్కిస్తున్న సినిమా రామాయణ. ఇందులో కేజియఫ్ ఫేమ్ యశ్ రావణుడిగా నటిస్తున్నారు.

ఈ చిత్రంపై అధికారిక ప్రకటన వచ్చింది. సినిమా రెండు భాగాలుగా రాబోతుందని.. మొదటి పార్ట్ 2026 దివాళికి.. రెండో భాగం 2027 దివాళికి విడుదల కానుందని డిక్లేర్ చేశారు మేకర్స్.

రామాయణ్ రిలీజ్ గురించి అఫీషియల్ ప్రకటన వచ్చీ రాగానే అందరికీ డార్లింగ్ ప్రభాస్ నటించిన ఆదిపురుష్ గుర్తుకొస్తోంది. ఆ సినిమాలా కాకుండా కాసింత సమయం తీసుకుని అయినా సరే, చక్కగా తీర్చిదిద్దండి అంటూ నితీష్ తివారికి రిక్వెస్టులు అందుతున్నాయి.

సాయపల్లవి లాంటి ఆర్టిస్టు సీతమ్మతల్లిగా చేస్తున్నప్పుడు.. అవకాశాన్ని చక్కగా వినియోగించుకోవాలన్నది ఆడియన్స్ నుంచి మేకర్స్ కి అందుతున్న విన్నపం.

బ్రహ్మాస్త్రలో కాసింత ఫాంటసీ మిక్స్ అయి ఉంది.. అందులో గట్టిగానే ప్రూవ్ చేసుకున్నారు రణ్‌బీర్ కపూర్. రీసెంట్‌గా యానిమల్ చేసిన ఆయన మర్యాదపురుషోత్తముడిగా రామాయణ్‌లో ఎలా మెప్పిస్తారో చూడాలన్నది జనాల్లో పెరుగుతున్న ఆసక్తి.

ఇటు కేజీయఫ్ స్టార్ యష్.. రావణాసురుడిగా దుమ్ములేపుతారనే ధీమా కనిపిస్తోంది ఫ్యాన్స్ లో. రామాయణాన్ని జనాల మనసులకు దగ్గరగా తీస్తేనే తాను భాగమవుతానని కండిషన్ పెట్టి మరీ సినిమాలో ఇన్వాల్వ్ అయ్యారు యష్.

రెండు పార్టులుగా వచ్చే రామాయణతో తన ఫ్యాన్స్ కచ్చితంగా పండగ చేసుకుంటారనే భరోసా కనిపిస్తోంది కేజీయఫ్ స్టార్‌లో.




