- Telugu News Photo Gallery Cinema photos Actor Lakshya Entry With Kill Movie, and His Next Movies Updates, details Here
Actor Lakshya: రూట్ మార్చిన యంగ్ హీరో.. రూత్‌లెస్ కిల్లర్ నుండి లవర్ బాయ్ గా.!
కిల్ సినిమాతో వెండితెర అరంగేట్రం చేసిన నటుడు లక్ష్య. ఈ సినిమాలో కమాండోగా రూత్‌లెస్ కిల్లర్‌గా నటించి మెప్పించిన ఈ యంగ్ హీరో, తన సెకండ్ సినిమాను పూర్తి కాంట్రస్ట్‌గా సెలెక్ట్ చేసుకున్నారు. తాజాగా లక్ష్యం సెకండ్ మూవీకి సంబంధించి అఫీషియల్ ఎనౌన్స్‌మెంట్ వచ్చింది. రీసెంట్ టైమ్స్‌లో బాలీవుడ్ స్క్రీన్‌ను షేక్ చేసిన సినిమాల్లో కిల్ కూడా ఒకటి.
Updated on: Nov 09, 2024 | 6:55 PM

కిల్ సినిమాతో వెండితెర అరంగేట్రం చేసిన నటుడు లక్ష్య. ఈ సినిమాలో కమాండోగా రూత్‌లెస్ కిల్లర్‌గా నటించి మెప్పించిన ఈ యంగ్ హీరో, తన సెకండ్ సినిమాను పూర్తి కాంట్రస్ట్‌గా సెలెక్ట్ చేసుకున్నారు.

తాజాగా లక్ష్యం సెకండ్ మూవీకి సంబంధించి అఫీషియల్ ఎనౌన్స్‌మెంట్ వచ్చింది. రీసెంట్ టైమ్స్‌లో బాలీవుడ్ స్క్రీన్‌ను షేక్ చేసిన సినిమాల్లో కిల్ కూడా ఒకటి.

ఇండియన్ సినిమా ఇంత వరకు ఎప్పుడూ ఎక్స్‌పీరియన్స్ చేయనంత రక్తపాతాన్ని ఈ సినిమాలో చూపించారు మేకర్స్. తొలి సినిమాలోనే ఇలాంటి వయలెంట్ క్యారెక్టర్‌ను సెలెక్ట్ చేసుకున్న హీరో లక్ష్య యాక్షన్ హీరోగా ప్రూవ్ చేసుకున్నారు.

కిల్ సినిమాతో వచ్చిన ఇమేజ్‌ను వెంటనే మార్చేసుకునే పనిలో ఉన్నారు లక్ష్య. తొలి సినిమాలో యాక్షన్ స్టార్‌గా, రూత్‌లెస్ కిల్లర్‌గా కనిపించిన ఈ యువ నటుడు, రెండో సినిమాను పూర్తి కాంట్రాస్ట్‌గా ప్లాన్ చేస్తున్నారు.

ఎమోషనల్ లవ్ స్టోరీతో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. వివేక్ సోని దర్శకత్వంలో చాంద్ మేరా దిల్ అనే సినిమాలో నటిస్తున్నారు లక్ష్య. తాజాగా ఈ సినిమాను అఫీషియల్‌గా ఎనౌన్స్ చేసిన మేకర్స్.

ఇంతవరకు బాలీవుడ్ స్క్రీన్ మీద రాని ఎమోషనల్ లవ్ స్టోరీని మీ ముందుకు తీసుకురావడానికి మా ఇద్దరు చందమామలు సిద్దమయ్యారు అంటూ కామెంట్ చేశారు.

లక్ష్యకు జోడీగా అనన్య పాండే నటిస్తున్న ఈ సినిమాను ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కరణ్ జోహార్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ప్రొడక్షన్ స్టేజ్‌లో ఉన్న ఈ మూవీ వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.




