- Telugu News Photo Gallery Cinema photos Break For Hindi Bigg Boss show Due to Salman Khan receiving New threatening calls, Details Here
Salman Khan: ఎంత కష్టమొచ్చింది.! సల్మాన్ ఖాన్ ప్రాజెక్ట్స్ మీద సెక్యూరిటీ ఎఫెక్ట్..
సల్మాన్ ఖాన్‌కు వరుసగా బెదిరింపు కాల్స్ వస్తుండటంతో ఆయన సెక్యూరిటీ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దీంతో ఆయన చేస్తున్న ప్రాజెక్ట్స్ డిస్ట్రబ్ అవుతున్నాయి. తప్పని సరి పరిస్థితుల్లో బిగ్ బాస్ షోకు కూడా బ్రేక్ ఇచ్చారు భాయ్‌జాన్. హిందీ బిగ్ బాస్ మొదలైన దగ్గర నుంచి వరుసగా 18వ సీజన్‌ను హోస్ట్ చేస్తున్నారు సల్మాన్ ఖాన్. అందుకే సల్మాన్ లేని బిగ్ బాస్‌ను బాలీవుడ్ ఆడియన్స్ ఊహించలేరు.
Updated on: Nov 09, 2024 | 7:22 PM

సల్మాన్ ఖాన్‌కు వరుసగా బెదిరింపు కాల్స్ వస్తుండటంతో ఆయన సెక్యూరిటీ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దీంతో ఆయన చేస్తున్న ప్రాజెక్ట్స్ డిస్ట్రబ్ అవుతున్నాయి.

తప్పని సరి పరిస్థితుల్లో బిగ్ బాస్ షోకు కూడా బ్రేక్ ఇచ్చారు భాయ్‌జాన్. హిందీ బిగ్ బాస్ మొదలైన దగ్గర నుంచి వరుసగా 18వ సీజన్‌ను హోస్ట్ చేస్తున్నారు సల్మాన్ ఖాన్.

అందుకే సల్మాన్ లేని బిగ్ బాస్‌ను బాలీవుడ్ ఆడియన్స్ ఊహించలేరు. ప్రతీ వారాంతంలో స్మాల్ స్క్రీన్ మీద సల్మాన్ చేసే సందడికి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు.

ఈ వారం ఎపిసోడ్స్‌లో మాత్రం సల్మాన్ కనిపించటం లేదు. ప్రజెంట్ సికందర్ సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్‌లో ఉన్నారు సల్మాన్.

గతంలో ఇలా షూటింగ్‌లో ఉన్నా... వీకెండ్ రెండు రోజులు ముంబై వెళ్లి బిగ్ బాస్ షూటింగ్‌లో పాల్గొనే వారు భాయ్‌జాన్. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అలా సాధ్యపడటం లేదు.

సెక్యూరిటీ ఇష్యూస్ కారణంగా సల్మాన్ ఎక్కువగా ట్రావెల్ చేయటం కరెక్ట్ కాదన్న ఉద్దేశంతో ఈ వారం బిగ్ బాస్ ఎపిసోడ్స్ చేయకూడదని నిర్ణయించారు.

దీంతో సల్మాన్‌కు బదులు ఏక్తాకపూర్, రోహిత్ శెట్టి వీకెండ్ ఎపిసోడ్స్‌ను హెస్ట్ చేయబోతున్నారు. ఆల్రెడీ ఈ విషయంలో బిగ్ బాస్ టీమ్ అఫీషియల్ క్లారిటీ ఇచ్చింది.





























