Darshan: ‘ హీరో దర్శన్ ఎప్పటికీ నా కొడుకే.. అతను నిర్దోషిగా బయటకు రావాలి’: సీనియర్ నటి సుమలత
రేణుకా స్వామి హత్యకేసులో ప్రముఖ కన్నడ నటుడు దర్శన్‌కు ఇటీవలే మధ్యంతర బెయిల్ మంజూరైంది. ఇటీవలే అతను వెన్నునొప్పికి చికిత్స పొందేందుకు బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. ఈ సందర్భంగా సీనియర్ నటి, మాజీ ఎంపీ సుమలత అంబరీష్ దర్శన్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

రేణుకా స్వామి హత్య కేసులో కన్నడ హీరో దర్శన్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు కావడంపై నటి సుమలత అంబరీష్ స్పందించారు. తాను ఇప్పటివరకు దర్శన్‌ను కలవలేదని, అయితే అతని భార్య విజయలక్ష్మితో టచ్‌లో ఉన్నట్లు సమలత తెలిపారు. ఈ సందర్భంగా దర్శన్ తో తనకున్న అనుబంధాన్ని మరోసారి గుర్తు చేసుకున్నారామె. ‘నటుడు దర్శన్ కు నాకు ఎప్పటికీ కొడుకుతో సమానం. అతను ఏం చేసినా ఆ ఫీలింగ్ మారదు. దర్శన్‌కు నేను ఎప్పుడూ అండగా ఉంటాను. ప్రస్తుతం అతను వెన్ను నొప్పికి చికిత్స పొందుతున్నాడు. దర్శన్ కు నడుము నొప్పి ఎక్కువగా ఉంది. అయితే సర్జరీ అంటే ఇష్టం లేదని విన్నాను. ఎందుకంటే, సర్జరీ చేస్తే రికవరీ టైమ్ ఎక్కువగా ఉంటుంది. ఇక అతని సినిమాల షూటింగ్ సగంలోనే ఉన్నాయి. దీంతో సినీ పరిశ్రమ నష్టాలను చవిచూస్తున్న పరిస్థితి. దర్శన్ కు మేం నైతిక మద్దతు ఇస్తున్నాం. అతను బాగుంటాడని ఆశిస్తున్నాం. నేను దర్శన్ భార్య విజయలక్ష్మితో టచ్‌లో ఉన్నాను. అతనికి విశ్రాంతి అవసరం. ముందుగా అతనిని కోలుకోనివ్వండి. న్యాయపరమైన సవాళ్లన ఎదుర్కొని బయటకు రావాలని మేం కోరుకుంటున్నాము. మా సంబంధం అలాగే ఉంటుంది. నేను బతికున్నంత కాలం దర్శన్ నా కొడుకు . నిజం బయటకు రావాలి. అతనికి అంతా మంచే జరగాలి. నిర్దోషి గా నిరూపించుకుని బయటకు రావాలన్నదే నా కోరిక’ అని సుమలతా అంబరీష్ చెప్పుకొచ్చారు.
ప్రస్తుతం సుమలతా అంబరీష్ కామెంట్స్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. వీటిపై సినీ అభిమానులు, నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. కాగా రేణుకాస్వామి హత్యకేసు ప్రధాన నిందితుల్లో ఒకరైన దర్శన్‌కు మధ్యంతర బెయిల్ లభించింది. అనారోగ్య సమస్యలతో బాధపడుతన్న నటుడికి ఆరు వారాల పాటు బెయిల్ మంజూరవ్వడంతో ఇటీవలే అతనిని జైలు నుంచి విడుదల చేశారు. అయితే మధ్యంతర బెయిల్‌పై పోలీసులు మరోసారి కోర్టు మెట్లు ఎక్కేందుకు సిద్ధమైనట్లు సమాచారం. కాగా వెన్నునొప్పి చికిత్సల కోసం ఆరు వారాల పాటు బెయిల్ ఇచ్చింది. అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో ఆయన జూన్ 11న అరెస్టయిన సంగతి తెలిసిందే.
నటుడు దర్శన్ తో సుమలత..
View this post on Instagram
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








