Puhspa 2: ఫస్ట్ రోజే రూ.270 కోట్లా !!
అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటిస్తోన్న చిత్రం పుష్ఫ2. సుమారు మూడేళ్ల క్రితం సైలెంట్ గా విడుదలై సంచలనాలు సృష్టించిన పుష్ఫ సినిమాకు సీక్వెల్ ఇది. మొదటి పార్ట్ కు దర్శకత్వం వహించిన సుకుమార్ సీక్వెల్ ను తెరకెక్కించారు. డిసెంబర్ ఈ పాన్ ఇండియా మూవీ గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఇప్పటికే రికార్డు స్థాయిలో పుష్ఫ 2 ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని సమాచారం.
ఇదిలా ఉంటే ఈ క్రేజీ సీక్వెల్ మూవీ మొదటి రోజే బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొడుతుందని అంచనా వేస్తున్నారు. ఈ చిత్రం తొలిరోజు రూ.270 కోట్ల వసూళ్లు రాబట్టుతుందని బాక్సాఫీస్ పండితులు లెక్కలు వేస్తున్నారు. ప్రముఖ ఫిల్మ్ వెబ్‌సైట్ సాక్నిక్ . ‘పుష్ప2 : రూల్’ సినిమా తొలిరోజు ఎంత వసూళ్లు రాబట్టగలదో అంచనా వేసింది. ఈ సినిమా ఇండియాలో 200 కోట్ల రూపాయల వసూళ్లు రాబట్టే అవకాశం ఉందని, విదేశాల నుండి 70 కోట్ల రూపాయలు ఈ సినిమాకి వచ్చే అవకాశం ఉందని తెలిపింది. అలా చేస్తే పుష్ఫ 2 రోజు మొదటి రోజు వసూళ్లు 270 కోట్ల రూపాయల దాటుతాయంటోంది. భారతదేశంలోని ఏ ప్రాంతం నుండి ఎన్ని కోట్ల రూపాయలు వస్తాయనే సమాచారం సాక్నిక్ అంచనా వేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల నుంచి 85 కోట్లు, కర్ణాటక నుంచి 20 కోట్లు, తమిళనాడు రాష్ట్రం నుంచి 12 కోట్లు, కేరళ నుంచి 8 కోట్ల రూపాయలు వస్తాయట. ఇక ఇండియాలోని మిగతా ప్రాంతాల నుంచి 75 కోట్ల వసూళ్లు వస్తాయని అంచనా వేసింది. టోటల్ గా ఇండియాలో ఈ మూవీ 200 కోట్ల రూపాయలు వసూలు చేస్తుందని నివేదించింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Puhspa 2: రిలీజ్ కాకముందే రికార్డులు సృష్టిస్తున్న పుష్ప 2
ఒకే స్టేజ్‌పై రెండు సింహాలు.. అస్సలు మిస్ అవ్వకండి
Janaka Aithe Ganaka: బోల్డ్ కాన్సెప్ట్‌తో కామెడీ బేస్‌గా హిట్ టాక్ తెచ్చుకున్న సుహాస్ సినిమా
ఘోర ప్రమాదం.. ఆరుగురు సజీవ దహనం!
మత్స్యకారులకు ముందే వచ్చిన ఉగాది.. వలలో చిక్కిన భారీ చేప
కోనసీమలో 'మూకుడు రొట్టె'కు పెరిగిన డిమాండ్!
మున్సిపాలిటీ వాటరే కదా అని కార్లు కడుగుతున్నారా? జాగ్రత్త!
సిలిండర్ తీసుకున్నారు సరే..మరి రశీదు ఏది?
నటి శ్రీదేవి ఆస్తుల వివాదం.. కోర్టుకెక్కిన బోనీ కపూర్
ఫ్లయిట్లో పెయిడ్ సీట్ దందా ఇక బంద్

