Janaka Aithe Ganaka: బోల్డ్ కాన్సెప్ట్‌తో కామెడీ బేస్‌గా హిట్ టాక్ తెచ్చుకున్న సుహాస్ సినిమా
టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో సుహాస్ నటించిన లేటెస్ట్ సినిమా జనక అయితే గనక. టైటిల్ తోనే ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన ఈ మూవీ దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి సినీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు ఓటీటీ ఆడియన్స్ ను కడుపుబ్బా నవ్వించేందుకు డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ మీదకు వచ్చేసింది. సందీప్ రెడ్డి బండ్ల తెరకెక్కించిన ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లో సంగీర్తన విపిన్ కథానాయిక.
దిల్ రాజు బ్యానర్ పై హర్షిత్ రెడ్డి, హన్షిత ఈ సినిమాను నిర్మించారు. టైటిల్, టీజర్, ట్రైలర్ తో రిలీజ్ కు ముందే ఈ సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యింది. ప్రమోషన్లు కూడా గట్టిగానే నిర్వహించారు. అందుకు తగ్గట్టుగానే దసరా కానుకగా అక్టోబర్ 12న విడుదలైన జనక అయితే గనక మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. కాన్సెప్ట్ బోల్డ్ గా ఉన్నా ఎలాంటి అసభ్యతకు తావులేకుండా ఈ సినిమాను తెరకెక్కించారని రివ్యూలు వచ్చాయి. ఇంటిల్లిపాది చూడాల్సిన సినిమా అంటూ ప్రశంసలు వచ్చాయి. ఇక ఎప్పటిలాగే సుహాస్ తన యాక్టింగ్ తో అదరగొట్టేశాడని కాంప్లిమెంట్స్ వినిపించాయి. ఇలా థియేటర్లలో ఆడియన్స్ ను కడుపుబ్బా నవ్వించిన జనక అయితే గనక ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహా ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. నవంబర్ 8 నుంచి సుహాస్ సినిమాను స్ట్రీమింగ్ కు తీసుకొస్తున్నట్లు ఇది వరకే అధికారికంగా ప్రకటించింది. అందుకు తగ్గట్టుగానే శుక్రవారం అర్ధరాత్రి నుంచే జనగ అయితే గనక మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. ‘మిడిల్ క్లాస్ గోల్డెన్ టిప్స్ కావాలా? అయితే ఆహాలో జనక అయితే గనక చూసేయండి’ అంటూ ఈ అప్డేట్ ను షేర్ చేసింది ఆహా.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కోనసీమకు-కెనడాకి వియ్యం కుదిరింది !! తెలుగు సంప్రదాయం ప్రకారం పెళ్లి
బిస్కెట్ల సాయంతో ఉగ్రవాదిని లేపేశారు
Regina Cassandra: బాలీవుడ్‌లో మీటింగ్స్ అంటే ఏంటి ?? రెజీనా కామెంట్స్ వైరల్
ఆ ప్రశ్న అడిగినందుకు.. విలేకరి ఫోన్ విసిరేసిన స్టార్ కమెడియన్
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

