బిస్కెట్ల సాయంతో ఉగ్రవాదిని లేపేశారు
సుధీర్ఘ చర్చలు, మంతనాల వేళ మధ్యమధ్యలో ఛాయ్‌తోపాటు బిస్కెట్లు తినడం పరిపాటి. మిత్రదేశాల మధ్య ద్వైపాక్షిక చర్చల వేళ పనికొచ్చే బిస్కెట్లు శత్రువుతో పోరాడే వేళ అక్కరకు రావడం విశేషం. పాకిస్తాన్ విద్వేషాగ్నిని ఎగదోస్తుంటే దానిని కశ్మీర్‌లో విస్తరింపజేస్తున్న ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు బలగాలు బిస్కెట్లను వాడుకుని విజయం సాధించారు.
శనివారం జరిగిన లష్కరే కమాండర్ ఉస్మాన్ ఎన్‌కౌంటర్ వివరాలను సీఆర్‌పీఎఫ్ బలగాలు ఆదివారం వెల్లడించాయి. పాక్ ఉగ్ర కమాండర్ ఉస్మాన్ .. శ్రీనగర్ శివారులోని ఖన్యాయ్ ప్రాంతంలో దాక్కున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. 2000 నుంచి లోయలో మెరుపుదాడులు చేయడంలో ఉస్మాన్ సిద్ధహస్తుడు. గత ఏడాది పోలీస్ ఇన్‌స్పెక్టర్ మస్రూర్ వనీని చంపిన ఘటనలో ఇతని ప్రమేయముంది. ఇంతటి కరడుగట్టిన ఉగ్రవాది జాడ తెలియడంతో సీఆర్‌పీఎఫ్, స్థానిక పోలీసులు పక్కా ప్రణాళిక రచించారు. అయితే ఖన్యాయ్‌లో శునకాల బెడద ఎక్కువ. కొత్త వ్యక్తులు కనిపిస్తే వెంటనే మొరుగుతాయి. ఈ శబ్దాలకు ఉస్మాన్ అప్రమత్తమవడం ఖాయం. దీనికి పరిష్కారంగా బలగాలు తమ వెంట బిస్కెట్లు తీసుకెళ్లాయి. అంతా జల్లెడ పడుతూ కుక్కలు అరవకుండా బిస్కెట్లు వెదజల్లుతూ వాటి నోరు మూయించారు. దీంతో వీరి పని సులువైంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Regina Cassandra: బాలీవుడ్‌లో మీటింగ్స్ అంటే ఏంటి ?? రెజీనా కామెంట్స్ వైరల్
ఆ ప్రశ్న అడిగినందుకు.. విలేకరి ఫోన్ విసిరేసిన స్టార్ కమెడియన్
ఈ రకమైన చేపలు.. క్యాన్సర్ రోగులకు వరమట