మధురానగర్ ఆంజనేయస్వామి ఆలయంలో జాన్వీకపూర్ పూజలు
దేవర’ మూవీ హిట్‌తో జోరుమీదున్న బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ తాజాగా, హైదరాబాద్ మధురానగర్‌లోని ఆంజనేయస్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. భక్తిభావం కలిగిన జాన్వీ షూటింగ్ విరామంలో తరచూ ఆలయాలను సందర్శిస్తుంటారు. తాజాగా, ఆంజనేయస్వామి ఆలయాన్ని సందర్శించిన ఆమెకు అర్చకులు స్వాగతం పలికారు.
అరగంటపాటు ఆలయంలో పూజలు నిర్వహించిన జాన్వీకి అర్చకులు తీర్థ ప్రసాదాలు అందించి ఆశీర్వదించారు. ఆలయానికి జాన్వీకపూర్ వచ్చిన విషయం తెలిసిన అభిమానులు, స్థానికులు ఆమెను చూసేందుకు ఆలయానికి చేరుకున్నారు. ఆమెతో కలిసి సెల్ఫీలు, ఫొటోలు తీసుకునేందుకు పోటీ పడ్డారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మొన్న సల్మాన్ ఖాన్.. ఇప్పుడు షారుక్ ఖాన్
అవునా.. నిజమేనా !! అభిషేక్-ఐశ్వర్యలపై వైరల్ న్యూస్
Published on: Nov 08, 2024 12:48 PM
వైరల్ వీడియోలు
Latest Videos