మొన్న సల్మాన్ ఖాన్.. ఇప్పుడు షారుక్ ఖాన్
బాలీవుడ్‌లో స్టార్ హీరో షారుక్ ఖాన్‌కుబెదిరింపులు వచ్చాయి. రూ. కోట్లలో డబ్బు ఇవ్వకపోతే.. హాని తలపెడతామంటూ బెదిరింపులొచ్చాయి. దీనిపై ముంబయిలోని బాంద్రా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఛత్తీస్‌గఢ్ నుంచి ఈ బెదిరింపులు వచ్చినట్లు దర్యాప్తులో తెలిసింది. పోలీసులు షారుక్‌కు వచ్చిన కాల్స్‌ను ట్రేస్ చేశారు.
ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్ నుంచి ఈ బెదిరింపులు వచ్చినట్లు గుర్తించారు. ఫైజాన్ ఖాన్ అనే వ్యక్తి ఈ బెదిరింపులకు పాల్పడినట్లు అనుమానిస్తున్న పోలీసులు.. అతడి కోసం గాలింపు చేపట్టారు. కాగా.. కృష్ణజింకలను వేటాడిన కేసు నేపథ్యంలో ఇప్పటికే పలుమార్లు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి సల్మాన్‌ఖాన్ కు బెదిరింపులు వచ్చాయి. తాజాగా షారుఖ్ ఖాన్‌కు సల్మాన్ తరహాలోనే బెదిరింపులు రావడంతో బాలీవుడ్‌లో కలకలం రేపింది. ఇంకా వారి లిస్ట్‌లో ఎంతమంది హీరోలు ఉన్నారోనని ఆందోళన వ్యక్తం చెందుతున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అవునా.. నిజమేనా !! అభిషేక్-ఐశ్వర్యలపై వైరల్ న్యూస్
Published on: Nov 08, 2024 12:41 PM
వైరల్ వీడియోలు
Latest Videos