ఆ ప్రశ్న అడిగినందుకు.. విలేకరి ఫోన్ విసిరేసిన స్టార్ కమెడియన్
బాలీవుడ్ స్టార్ కమెడియన్ రాజ్‌పాల్ యాదవ్‌కు ఇప్పుడు మంచి డిమాండ్ ఉంది. వరుసగా సినిమాల్లో నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన ‘భూల్ భూలయ్య 3’ చిత్రంలోనూ ఆయన కీలక పాత్ర పోషించారు. తాజాగా సినిమా ప్రమోషన్లకు సంబంధించి ఆయన విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. తన సినిమా ప్రయాణం గురించి అడిగిన దానికి రాజ్‌పాల్ చాలా కూల్ గా రిప్లై ఇచ్చారు.
అయితే దీపావళి పండుగ గురించి గతంలో తాను చేసిన ప్రకటనను ప్రశ్నించడంపై రాజ్‌పాల్ యావద్ ఫైర్ అయ్యారు . ప్రశ్న అడిగిన జర్నలిస్టు మొబైల్ ఫోన్ లాక్కుని విసిరేశారు. అంతకుముందు రాజ్‌పాల్ యావద్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. ‘ఎక్కువగా బాణాసంచా కాల్చకండి. దాని వల్ల వాయుకాలుష్యం ఏర్పడుతుంది’ అని అందులో రాసుకొచ్చారు. అయితే ఈ వీడియోను కొందరు వ్యతిరేకించారు. దీంతో రాజ్‌పాల్ యాదవ్ ఆ వీడియోను డిలీట్ చేసి క్షమాపణలు చెప్పారు. తాజాగా మీడియా సమావేశంలో ఇదే అంశంపై ఓ ప్రశ్న ఎదురైంది. రాజ్‌పాల్ యాదవ్ మాట్లాడుతూ, ప్రేక్షకులు ప్రతి నెలన్నరకోసారి తన కొత్త సినిమా ఒకటి చూస్తారనీ అన్నారు. తర్వాత దీపావళి గురించి ఒక ప్రశ్న వచ్చింది. దీపావళి పండుగ ముందు ఒక ప్రకటన చేశారు కదా అని జర్నలిస్టు ప్రశ్న పూర్తి చేసేలోపే రాజ్‌పాల్ యాదవ్ మొబైల్ ఫోన్ లాక్కున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరలవుతోంది. రాజ్ పాల్ యాదవ్ సహనం కోల్పోకుండా ఉండాల్సిందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ వీడియోను పెట్టుకుని కొందరు స్టార్ కమెడియన్ ను ట్రోల్ చేస్తున్నారు. ‘పటాకులు కాల్చకండి’ అని రాజ్‌పాల్ యాదవ్ చెప్పడం సరైనదేనని పలువురు సమర్థించారు. మొత్తం మీద సోషల్ మీడియాలో ఈ విషయంపై చర్చ నడుస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఈ రకమైన చేపలు.. క్యాన్సర్ రోగులకు వరమట
త్వరలో IRCTC సూపర్ యాప్ !! అన్ని సేవలు ఒకే చోట
మధురానగర్ ఆంజనేయస్వామి ఆలయంలో జాన్వీకపూర్ పూజలు
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

