కోనసీమకు-కెనడాకి వియ్యం కుదిరింది !! తెలుగు సంప్రదాయం ప్రకారం పెళ్లి
ప్రేమకు ప్రాంతం, కుల, మత భాష భేదాలు ఏవీ అడ్డుకావని అమలాపురం అబ్బాయి, కెనెడా అమ్మాయి నిరూపించారు. ఉన్నత చదువుల కోసం పధ్నాలుగేళ్ల క్రితం 2010లో కెనడా వెళ్లిన మనోజ్ కుమార్‌కు అక్కడ ట్రేసీ తో పరిచయం ఏర్పడింది. ఏడు సంవత్సరాల కొనసాగిన స్నేహం ప్రేమగా మారడంతో ఇరువైపులా కుటుంబసభ్యులను ఒప్పించి వివాహం చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు.
వీరి వివాహానికి ఇరువైపులా బంధువులు వచ్చిన ప్రేమ జంటను ఆశీర్వదించారు. కెనడాలో బ్యాంకు మేనేజర్ గా పనిచేస్తున్న మనోజ్ కుమార్, కెరడా అమ్మాయిని ప్రేమించి తెలుగు సాంప్రదాయంలో వివాహం చేసుకునేందుకు కెనడా నుండి అమలాపురం వచ్చి బందు మిత్రుల మధ్య అత్యంత వైభవంగా, తెలుగు సాంప్రదాయంలో వివాహం చేసుకున్నాడు. పెళ్లింట కెనడా అమ్మాయి బందువులు సందడి చేశారు. తెలుగు సాంప్రదాయంలో జరిగిన పెళ్లిని చూసి వారు మంత్రముగ్ధులయ్యారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బిస్కెట్ల సాయంతో ఉగ్రవాదిని లేపేశారు
Regina Cassandra: బాలీవుడ్‌లో మీటింగ్స్ అంటే ఏంటి ?? రెజీనా కామెంట్స్ వైరల్
ఆ ప్రశ్న అడిగినందుకు.. విలేకరి ఫోన్ విసిరేసిన స్టార్ కమెడియన్
వైరల్ వీడియోలు
Latest Videos