ఒకే స్టేజ్‌పై రెండు సింహాలు.. అస్సలు మిస్ అవ్వకండి
నందమూరి బాలకృష్ణ హీరోగానే కాదు హోస్ట్ గాను ఇరగదీస్తున్నారు. ఓ వైపు వరుసగా హిట్స్ అందుకుంటున్న బాలయ్య. మరో వైపు అన్ స్టాపబుల్ అంటూ టాక్ షోతో దూసుకుపోతున్నారు. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ టాక్ షో ఇప్పటికే మూడు సీజన్స్ పూర్తి చేసుకుంది. ఇప్పుడు సీజన్ 4 స్ట్రీమింగ్ అవుతుంది.
ఈ సీజన్ 4కి మొదటి ఎపిసోడ్ లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరు అయ్యారు. అలాగే సెకండ్ ఎపిసోడ్ లో లక్కీ భాస్కర్ మూవీ టీమ్ హాజరయ్యారు. దుల్కర్ సల్మాన్ హాజరయ్యి సందడి చేశారు. బాలయ్య తన ఎనర్జీతో ఈ టాక్ షోను సక్సెస్ ఫుల్ గా రన్ చేస్తున్నారు. కాగా లేటెస్ట్ ఎపిసోడ్ లో కంగువ మూవీ టీమ్ హాజరయ్యారు. కంగువ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సూర్య అన్ స్టాపబుల్ సీజన్ 4కి హాజరయ్యారు. ఈ ఎపిసోడ్ లో సూర్యతో బాలయ్య ఆడుకున్నారు. సూర్యను ఆటపట్టించారు బాలయ్య. తాజాగా సూర్యకు సంబంధించిన ఎపిసోడ్ ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. సరదా ముచ్చట్లతో పాటు సూర్యతో కొన్ని గేమ్స్ కూడా ఆడించారు బాలయ్య. అలాగే ఈ ఎపిసోడ్ లో సూర్య తమ్ముడు కార్తితోనూ బాలయ్య ఫోన్ చేసి మాట్లాడారు. అలాగే ఈ ఎపిసోడ్ లో బాలకృష్ణ సూర్య చేస్తున్న సమాజ సేవ గురించి కూడా ప్రస్తావించారు. అలాగే సూర్యను ప్రశంసిస్తూ.. ఆయన చేసిన సాయం పై ఓ బాలిక మాట్లాడిన వీడియోను ప్లే చేశారు. అది చూస్తూ సూర్య ఎమోషనల్ అయ్యారు. సూర్య కన్నీళ్లు పెట్టుకున్నారు. బాలకృష్ణ కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇక ఈ ఎపిసోడ్ లో చివరిలో దర్శకుడు శివ, నటుడు బాబీ డియోల్ కూడా ఎంట్రీ ఇచ్చారు. బాబీ డియోల్ తో కలిసి యానిమల్ సినిమాలో గ్లాస్ స్టెప్పేశారు బాలకృష్ణ. ఈ ఎపిసోడ్ ను ఆశలు మిస్ అవకండి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Janaka Aithe Ganaka: బోల్డ్ కాన్సెప్ట్‌తో కామెడీ బేస్‌గా హిట్ టాక్ తెచ్చుకున్న సుహాస్ సినిమా
సందర్మాట్ కెనాల్ ఒడ్డున అరుదైన శ్వేతనాగు దర్శనం!
అడ్డంగా దొరికిపోయిన చైన్ స్నాచర్లు..ఆ తర్వాత ఊహించని సీన్
నడిరోడ్డుపై బోల్తాపడిన భారీ కంటైనర్.. తృటిలో తప్పిన బైకర్!
గోల్డ్ షాప్‌లో మహిళల చేతివాటం.. రూ.45 లక్షల విలువైన బంగారం మాయం
నీటిలో చిక్కుకున్న ఐదుగురిని రక్షించిన పోలీసులు!
ఏంట్రా ఇలా ఉన్నారు.. AIతో చావును కూడా మోసం చేశాడు..
పరుగెత్తి గెలిచింది కానీ.. నిరాశే ఎదురైంది!

