Pragya Nagra : అదంతా పీడ కల అయితే బాగుండు.. ప్రైవేట్ వీడియో లీక్ పై స్పందించిన నటి..

సౌత్ ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే నటిగా గుర్తింపు తెచ్చుకుంటున్న ప్రగ్య నగ్ర ఇప్పుడు ఫేక్ వీడియోల భారీన పడింది. కొన్ని రోజులుగా ఆమె పేరుతో కొన్ని వీడియోస్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఆ వీడియోస్ పై స్పందించింది ప్రగ్య నగ్ర.

Pragya Nagra : అదంతా పీడ కల అయితే బాగుండు.. ప్రైవేట్ వీడియో లీక్ పై స్పందించిన నటి..
Pragya Nagra
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 07, 2024 | 9:25 PM

కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో నటీమణుల ప్రైవేట్ వీడియోస్ లీక్ అంటూ కొన్ని రూమర్స్ చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. గతంలో రష్మిక మందన్నకు చెందిన ఓ ఫేక్ వీడియో లీక్ అయి దేశ వ్యాప్తంగా వార్తల్లో నిలిచింది. కొన్ని వారాల క్రితం, ‘కిరాతక’ నటిగా భావించే ఒక నకిలీ వీడియో వైరల్ అయ్యింది. దీనిపై నటి ఓవియ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీకి చెందిన ఓ యువ నటి ప్రైవేట్ వీడియోస్ అంటూ కొన్ని వీడియోస్ చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఆ వీడియోలు ఏఐని ఉపయోగించి రూపొందించినట్లు నటి తెలిపింది. గత రెండేళ్లుగా సౌత్ ఇండియన్ సినిమాల్లో నటిస్తున్న ప్రగ్య నగ్రకి సంబంధించిన కొన్ని ప్రైవేట్ వీడియోస్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

దీంతో ఆమె అభిమానులు షాకయ్యారు. నిజంగానే ప్రగ్య నగ్ర వీడియోస్ ఆ అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఈ ప్రైవేట్ వీడియోస్ పై నటి ప్రగ్య నగ్ర స్పందించింది. ఈ ఫేక్ వీడియోస్ పై దిగ్ర్బాంతి వ్యక్తం చేసింది. “నేను నమ్మలేకపోతున్నాను. ఇదంతా ఓ పీడ కల అయితే బాగుండనిపిస్తోంది. టెక్నాలజీ మనకు సాయం చేయాలి.. కానీ మన జీవితాలను నాశనం చేయకూడదు. దుర్మార్గమైన ఆలోచన ఉన్న వ్యక్తులు ఏఐ సాయంతో ఓ చెత్త వీడియో సృష్టించి.. దాన్ని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. వరుసగా వస్తున్న ఆలోచనల నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నాను. ఇలాంటి కష్టమైన సమయాల్లో నాకు అండగా నిలిచిన వారికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. నాలాగా మరో అమ్మాయికి జరగకూడదని ప్రార్థిస్తున్నాను. మీరందరూ క్షేమంగా ఉండాలని నేను ఆశిస్తున్నాను” అంటూ ట్వీట్ చేసింది.

హర్యానాకు చెందిన ప్రగ్య నగ్ర దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలో నటిగా గుర్తింపు పొందింది. 2022లో విడుదలైన తమిళ చిత్రం ‘వరలారు ముఖ్యమ్’తో నటించడం ప్రారంభించిన ప్రగ్య నగ్ర.. తమిళంలో ‘ఎన్4’, మలయాళ చిత్రం ‘నదికళిల్ సుందరి యమునా’, తెలుగులో ‘లగ్గం’ చిత్రాల్లో నటించింది.

ఇది చదవండి : Tollywood: ఒక్క సినిమాకు రూ.40 కోట్లు రెమ్యునరేషన్.. ప్రైవేట్ జెట్, ఇండియా, అమెరికాలో కోట్ల ఆస్తులు ఉన్న ఏకైక హీరోయిన్..

Vijay Sethupathi: విజయ్ సేతుపతి ఇన్ స్టాలో ఫాలో అవుతున్న ఏకైక హీరోయిన్.. ఎవరో తెలుసా..?

Tollywood : గ్యాంగ్‌స్టర్‌తో ప్రేమలో పడి కెరీర్ నాశనం చేసుకున్న హీరోయిన్.. ఇండస్ట్రీకి దూరం..

Actress Gajala: వాసి వాడి తస్సాదియ్యా.. అందాలతో హార్ట్ ఎటాక్ తెప్పిస్తోన్న ఎన్టీఆర్ హీరోయిన్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.