AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pushpa 2: ‘ఏం చేసినా ఒక మనిషి లేని లోటు తీర్చలేం’.. సంధ్య థియేటర్ ఘటనపై మరోసారి స్పందించిన అల్లు అర్జున్

అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప2 బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకెళుతోంది. డిసెంబర్ 05న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా కేవలం రెండు రోజుల్లోనే రూ.449 కోట్లు రాబట్టింది. ఈ నేపథ్యంలో పుష్ప 2 చిత్ర బృందం ప్రెస్‌మీట్ నిర్వహించింది.

Pushpa 2: 'ఏం చేసినా ఒక మనిషి లేని లోటు తీర్చలేం'.. సంధ్య థియేటర్ ఘటనపై మరోసారి స్పందించిన అల్లు అర్జున్
Allu Arjun
Basha Shek
|

Updated on: Dec 07, 2024 | 9:02 PM

Share

పుష్ప 2 ప్రీమియర్ షోస్ సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఇప్పటికే ఈ ఘటనపై విచారం వ్యక్తం చేసి ఆర్థిక సాయం ప్రకటించాడు అల్లు అర్జున్. తాజాగా శనివారం (డిసెంబర్ 07) జరిగిన పుష్ప 2 ప్రెస్ మీట్ లో మరోసారి ఈ విషాద ఘటనపై స్పందించాడు బన్నీ. ‘అందరికీ నమస్కారం. దేశ నలుమూలల నుండి మాకు సపోర్ట్ చేసిన అందరికీ ధన్యవాదాలు. ప్రపంచంలో ఉన్న తెలుగు వారికి, భారతీయులకు, చిత్ర బృందానికి, నిర్మాతలకు, మీడియా వారికి ధన్యవాదాలు. ఒక సినిమా ఇలాంటి విజయం సాధించడానికి కారణం దర్శకుడు. కాబట్టి మా దర్శకుడు సుకుమార్ కి ధన్యవాదాలు. నన్ను ఒక స్థాయిలో పెట్టినందుకు నీకు రుణపడి ఉంటాను. సినిమా కలెక్షన్స్ చూస్తే నాకు సినిమాను ఎంత మంది ప్రేక్షకులు చూసారో అర్థం అవుతుంది. చిత్ర బృందం తరఫున, తెలుగు వారి అందరి తరుపున ప్రపంచ సినీ ప్రేక్షకులు అందరికీ నా థాంక్స్. అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి గారికి, సినిమాటోగ్రఫీ మినిష్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, అదే విధంగా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉపముఖ్య మంత్రి పవన్ కళ్యాణ్ బాబాయ్ గారికి, సినిమాటోగ్రఫీ కందుల దుర్గేష్ గారికి ధన్యవాదాలు. అలాగే బీహార్ ప్రభుత్వానికి, పాట్నా ప్రజలకు, బీహార్ పోలీసులకు, తమిళనాడు, కేరళ ప్రభుత్వాలకు, దేశంలో ఈ సినిమాకు సపోర్ట్ ఇచ్చిన అన్ని సినిమా ఇండస్ట్రీలకు మనస్పూర్తిగా ధన్యవాదాలు. నేను ఈ సినిమా తీయడానికి ముఖ్య కారణం ఈ సినిమా అందరిని గర్వంగా చెప్పుకునేలా చేస్తుంది అనే నమ్మకంతోనే.

‘ అనుకోకుండా సంధ్య థియేటర్లో జరిగిన సంఘటన మమ్మల్ని ఎంతగానో కదిలించింది. గత 20 సంవత్సరాలుగా ఇలాగే వస్తున్నాం. కానీ ఆరోజు కొంచం ఎక్కువ జనం ఉండటంతో ఇబ్బంది అవుతుంది అని థియేటర్ యాజమాన్యం చెప్పగానే వెళ్లిపోయాం. కానీ ఇంటికి వచ్చిన తరువాత రోజు జరిగిన సంఘటన తెలిసి చాలా బాధ కలిగింది. రేవతి చనిపోయారని తెలిశాక నేను షాక్ లోకి వెళ్లిపోయాను. స్పందించడానికి నాకు సమయం పట్టింది. అందుకే కొంచెం ఆలస్యంగా స్పందించాల్సి వచ్చింది. మరొకసారి చెప్తున్నాను ఆ కుటుంబం కోసం 25 లక్షలు కేవలం ఒక సాయంగా అనుకుని ఇస్తున్నాము. అయినా ఒక మనిషి లేని లోటు ఎవరు తీర్చలేం. అందుకు ఎంతో విచారిస్తున్నాను. అంత కుదుటపడిన తరువాత వ్యక్తిగతంగా వెళ్లి ఆ కుటుంబాన్ని కలుస్తాను’ అని చెప్పుకొచ్చారు అల్లు అర్జున్.

అల్లు అర్జున్ స్పీచ్..

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us