Poonam Kaur: గీతాంజలి మరణంపై నటి పూనమ్ కౌర్ సంచలన ట్వీట్‌.. వారిని శిక్షించాలంటూ..

తెనాలికి చెందిన గీతాంజలి మరణం ఏపీ రాజకీయాల్లో పెను దుమారం రేపుతోంది. టీడీపీ, జనసేన సోషల్‌ మీడియా ట్రోలింగ్ కారణంగానే గీతాంజలి ఆత్మహత్య చేసుకున్నట్లు వైఎస్సార్ సీపీ ఆరోపిస్తోంది. మరోవైపు ఆమె మరణంలో ఏదో కుట్ర దాగి ఉందంటూ టీడీపీ, జనసేన మద్దతు దారులు వైసీపీకి కౌంటర్లు వేస్తున్నారు.

Poonam Kaur: గీతాంజలి మరణంపై నటి పూనమ్ కౌర్ సంచలన ట్వీట్‌.. వారిని శిక్షించాలంటూ..
Actress Poonam Kaur
Follow us
Basha Shek

|

Updated on: Mar 13, 2024 | 10:35 AM

తెనాలికి చెందిన గీతాంజలి మరణం ఏపీ రాజకీయాల్లో పెను దుమారం రేపుతోంది. టీడీపీ, జనసేన సోషల్‌ మీడియా ట్రోలింగ్ కారణంగానే గీతాంజలి ఆత్మహత్య చేసుకున్నట్లు వైఎస్సార్ సీపీ ఆరోపిస్తోంది. మరోవైపు ఆమె మరణంలో ఏదో కుట్ర దాగి ఉందంటూ టీడీపీ, జనసేన మద్దతు దారులు వైసీపీకి కౌంటర్లు వేస్తున్నారు. ఇలా ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారిన గీతాంజలి మరణంపై టాలీవుడ్ ప్రముఖ నటి పూనమ్‌ కౌర్ స్పందించింది. మృతురాలికి న్యాయం జరగాలంటే, దీనికి కారణమైన వారికి శిక్ష పడాలంటూ సోషల్‌ మీడియా వేదికగా డిమాండ్ చేసింది. ‘గీతాంజలికి న్యాయం జరగాలి. అసలు ఆమె విషయంలో ఏం జరిగింది? గీతాంజలికి ఎందుకు ఆత్మహత్య చేసుకునే దుస్థితి వచ్చింది? ఒక పార్టికి చెందిన సోషల్‌ మీడియా‌ ట్రోలర్స్‌ కారణంగానే ఆమె బలవన్మరణానికి పాల్పడిందా? అమ్మాయిల మీద ఇలా లేని పోని పుకార్లు పుట్టించి, మానసికంగా వేధించడం కొందరికి బాగా అలవాటైపోయింది. దయచేసి వారిని కఠినంగా శిక్షించండి. ఆ పసి పిల్లలు (గీతాంజలి బిడ్డలు)కు న్యాయం చేయండి’ అని ట్వీట్ చేసింది పూనమ్. దీనికి JusticeForGeethanjali అనే హ్యాష్ ట్యాగ్‌ను జోడించింది. ప్రస్తుతం పూనమ్‌ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. నెటిజన్లు కూడా గీతాంజలికి న్యాయం జరగాలంటూ JusticeForGeethanjali, WeStandWithGeetanjali హ్యాష్ ట్యాగ్ లను ట్రెండ్ చేస్తున్నారు.

గతంలో పలు సినిమాల్లో హీరోయిన్ గా పనిచేసిన పూనమ్ కౌర్ ఇప్పుడు కెమెరాకు దూరంగా ఉంది. సినిమాయేతర విషయాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. సీఎం జగన్, వైఎస్సారీపీకి అనుకూలంగా పోస్టులు పెడుతోంది. ఇటీవల చేనేత కార్మికులకు సీఎం జగన్ అందించిన సాయాన్ని గుర్తు చేస్తూ పూనమ్ షేర్ చేసిన పోస్ట్ నెట్టింట బాగా వైరలైంది. అంతకుముందు కూడా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సేవలను స్మరించుకుంటూ నెట్టింట పలు పోస్ట్ లు షేర్ చేసింది.

ఇవి కూడా చదవండి

ఆ ఇద్దరు పిల్లలకు న్యాయం జరగాలి..

సీఎం జగన్ పై పూనమ్ కౌర్ ప్రశంసలు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.