Uday Kiran: ఇన్నాళ్లకు మీడియా ముందుకు వచ్చిన ఉదయ్ కిరణ్ సోదరి.. ఎమోషనల్ కామెంట్స్..
అటు మూవీ లవర్స్, యూత్ కూడా ఈ రీరిలీజ్ ట్రెండ్ పై ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే తెలుగు చిత్రపరిశ్రమలో ఉన్న స్టార్ హీరోస్ అందరి సినిమాలు మళ్లీ విడుదలయ్యాయి. ఇక ఇప్పుడు ఈ ట్రెండ్ లో ఒకప్పటి లవర్ బాయ్ ఉదయ్ కిరణ్ సినిమాలను రీరిలీజ్ చేసేందుకు రెడీ అయ్యారు మేకర్స్. అప్పట్లో బాక్సాఫీస్ ను షేక్ చేసిన కల్ట్ క్లాసిక్ హిట్ చిత్రాలను రీరిలీజ్ చేస్తున్నారు. ఉదయ్ కిరణ్ కు స్టార్ డమ్ తెచ్చిపెట్టిన చిత్రాల్లో నువ్వు నేను ఒకటి. ఇందులో ఉదయ్ సరసన అనిత కథానాయికగా నటించగా..

కొన్నాళ్లుగా టాలీవుడ్ ఇండస్ట్రీలో రీరిలీజ్ ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. అప్పట్లో బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయిన సినిమాలు.. డిజాస్టర్స్ అన్నింటిని ఇప్పుడు మళ్లీ అడియన్స్ ముందుకు తీసుకువస్తున్నారు మేకర్స్. 4కే వెర్షన్తో మళ్లీ విడుదల చేసిన సినిమాలు మంచి వసూళ్లు రాబడుతున్నాయి. అటు మూవీ లవర్స్, యూత్ కూడా ఈ రీరిలీజ్ ట్రెండ్ పై ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే తెలుగు చిత్రపరిశ్రమలో ఉన్న స్టార్ హీరోస్ అందరి సినిమాలు మళ్లీ విడుదలయ్యాయి. ఇక ఇప్పుడు ఈ ట్రెండ్ లో ఒకప్పటి లవర్ బాయ్ ఉదయ్ కిరణ్ సినిమాలను రీరిలీజ్ చేసేందుకు రెడీ అయ్యారు మేకర్స్. అప్పట్లో బాక్సాఫీస్ ను షేక్ చేసిన కల్ట్ క్లాసిక్ హిట్ చిత్రాలను రీరిలీజ్ చేస్తున్నారు. ఉదయ్ కిరణ్ కు స్టార్ డమ్ తెచ్చిపెట్టిన చిత్రాల్లో నువ్వు నేను ఒకటి. ఇందులో ఉదయ్ సరసన అనిత కథానాయికగా నటించగా.. దివంగత నటి శకుంతల.. తనికెళ్ల భరణి కీలకపాత్రలు పోషించారు.
ఇప్పుడు ఈ సూపర్ హిట్ మూవీని మార్చి 21న రీరిలీజ్ చేయనున్నారు. దీంతో అటు సోషల్ మీడియాలో ఉదయ్ కిరణ్ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. చాలా కాలం తర్వాత తమ అభిమాన హీరోను మళ్లీ బిగ్ స్క్రీన్ పై చూడొచ్చు అంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఉదయ్ కిరణ్ సోదరి శ్రీదేవి చాలా సంవత్సరాలకు మీడియా ముందుకు వచ్చారు. నువ్వు నేను సినిమా గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు.
“నువ్వు నేను సినిమా మా అందరికి చాలా స్పెషల్. ఉదయ్ కు ఈ సినిమాకు గానూ బెస్ట్ యాక్టర్ అవార్డ్ కూడా వచ్చింది. అంతేకాకుండా ఈ సినిమా రీరిలీజ్ తో మనం ఎంఎస్ నారాయణ, రాళ్లపల్లి, ధర్మవరపు సుబ్రమణ్యం, ఆహుతి ప్రసాద్, వైజాగ్ ప్రసాద్, తెలంగాణ శకుంతల వంటి లెజండరీ నటీనటులను మరోసారి థియేటర్లలో మనం ట్రిబ్యూట్ ఇచ్చేందుకు ఈ రీరిలీజ్ వేదిక అవుతుంది. ఈ సినిమా డైరెక్టర్ తేజ, మూవీ కి కంగ్రాట్యులేషన్స్.. అలాగే రిలీజ్ చేస్తున్నవారికి కృతజ్ఞతలు” అంటూ ఎమోషనల్ అయ్యారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
