AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Teja Sajja: బంపర్ ఆఫర్ కొట్టేసిన ‘హనుమాన్ ‘ హీరో.. దీపికా పదుకొణె భారీ బడ్జెట్ ప్రాజెక్టులో తేజా సజ్జా..

మహాశివరాత్రి కానుకగా ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తుందని ప్రచారం నడిచింది. కానీ ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ రాలేదు. ఇదిలా ఉంటే.. ఇప్పుడిప్పుడే హీరోగా కెరీర్ ప్రారంభిస్తున్న యంగ్ హీరో తేజా సజ్జాకు ఈ మూవీ బ్రేక్ ఇచ్చిందనే చెప్పాలి. హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోగా ఇమేజ్ సొంతం చేసుకున్నాడు తేజా. దీంతో ఇప్పుడు ఈ హీరోతో సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు దర్శకనిర్మాతలు. ఈక్రమంలోనే తాజాగా ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరలవుతుంది.

Teja Sajja: బంపర్ ఆఫర్ కొట్టేసిన 'హనుమాన్ ' హీరో.. దీపికా పదుకొణె భారీ బడ్జెట్ ప్రాజెక్టులో తేజా సజ్జా..
Deepika Padukone, Teja Sajj
Rajitha Chanti
|

Updated on: Mar 13, 2024 | 10:17 AM

Share

ఈ ఏడాది పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద రికార్డ్స్ సృష్టించిన సినిమా హనుమాన్. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. దాదాపు 50 రోజులకుపైగా థియేటర్లలో విజయవంతంగా రన్ అవుతుంది. ఇప్పటివరకు రూ.350 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ కోసం ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు మూవీ లవర్స్. మహాశివరాత్రి కానుకగా ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తుందని ప్రచారం నడిచింది. కానీ ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ రాలేదు. ఇదిలా ఉంటే.. ఇప్పుడిప్పుడే హీరోగా కెరీర్ ప్రారంభిస్తున్న యంగ్ హీరో తేజా సజ్జాకు ఈ మూవీ బ్రేక్ ఇచ్చిందనే చెప్పాలి. హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోగా ఇమేజ్ సొంతం చేసుకున్నాడు తేజా. దీంతో ఇప్పుడు ఈ హీరోతో సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు దర్శకనిర్మాతలు. ఈక్రమంలోనే తాజాగా ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరలవుతుంది.

తాజా సమాచారం ప్రకారం హనుమాన్ హీరో తేజా సజ్జాకు బంపర్ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న కల్కి 2898 ADలో తేజా సజ్జా కీలకపాత్రలో కనిపించనున్నాడట. ఇందులో ఇప్పటికే బాలీవుడ్ స్టార్స్ అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె, కమల్ హాసన్, దిశా పటానీ నటిస్తున్నారు. వీరు కాకుండా ఇంకా రాజేంద్రప్రసాద్, దుల్కర్ సల్మాన్, రాజమౌళి, ఎన్టీఆర్, విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ సహా మిగతా నటీనటులు నటించనున్నారని టాక్ వినిపిస్తుంది. కానీ వీటిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే ఇప్పుడు కల్కి ప్రాజెక్టులో తేజా సజ్జా కూడా భాగమవనున్నారని సమాచారం.

ఇటీవల తేజా సజ్జా ఇచ్చిన ఇంటర్వ్యూ నుంచి ఈ రూమర్స్ మొదలయ్యాయి. అందులో తేజా సజ్జా మాట్లాడుతూ.. ఇప్పుడు తన ఖాతాలో మరికొన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టులు ఉన్నాయని.. ఎప్పుడు వాటి గురించి ప్రకటిస్తాననో చెప్పలేనని అన్నాడు. తన రాబోయే సినిమాల గురించి త్వరలోనే అప్డేట్స్ ఇస్తానని.. అన్నాడు. దీంతో అతడు కల్కి 2898 ADలో కనిపించనున్నాడని వార్తలు వచ్చాయి. ప్రస్తుతం తేజా సజ్జా హనుమాన్ 2 కోసం వెయిట్ చేస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.