Tollywood: సినిమాకు ఓకే చెప్పాకా.. హీరోతో డేటింగ్ చేయొద్దని కండీషన్ పెట్టారు.. టాలీవుడ్ హీరోయిన్..
సాధారణంగా సినీరంగంలో నటిగా గుర్తింపు రావాలంటే అందం, అభినయతోపాటు కాస్త అదృష్టం కూడా ఉండాలి. కొన్నాళ్లుగా సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న ఈ అమ్మడుకు ఇప్పుడు చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది. టాలీవుడ్ అగ్ర హీరోల సినిమాల్లో నటిస్తున్న ఈ అమ్మడు.. తనకు ఎదురైన వింత కండీషన్ గురించి చెప్పుకొచ్చింది.

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే గుర్తింపు తెచ్చుకుంటున్న హీరోయిన్లలో ఆమె ఒకరు. అతి తక్కువ సమయంలోనే తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె.. ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా దూసుకుపోతుంది. అయితే ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాక.. ఆ మూవీ మేకర్స్ పెట్టిన కండీషన్ చూసి తాను ఆశ్చర్యపోయానని చెప్పుకొచ్చింది. ఒక సినిమాలో యాక్ట్ చేసినప్పుడు ఆ హీరోతో డేిటంగ్ చేయకూడదని టీమ్ షరతు పెట్టిందని గుర్తుచేసుకుంది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. తనే హీరోయిన్ నిధి అగర్వాల్. హలో సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది నిధి అగర్వాల్. ఫస్ట్ మూవీ డిజాస్టర్ కావడంతో ఈ బ్యూటీకి అంతగా గుర్తింపు రాలేదు. ఆ తర్వాత నిధి నటించిన రెండు మూడు సినిమాలు సైతం నిరాశ పరిచాయి.
కొన్నాళ్లు పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో భారీ విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జోడిగా హరి హర వీరమల్లు సినిమాలో నటిస్తుంది. అలాగే పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ది రాజాసాబ్ మూవీలోనూ కనిపించనుంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ పాడ్ కాస్ట్ లో పాల్గొన్న నిధి అగర్వాల్.. తన కెరీర్ కు సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఒక సినిమాలో నటించినప్పుడు.. ఆ మూవీలోని హీరోతో డేటింగ్ చేయకూడదని టీమ్ షరతు పెట్టిందని చెప్పుకొచ్చింది. అలాగే ఆన్ లైన్ ట్రోలింగ్ గురించి సైతం మాట్లాడింది.
“మున్నా మైకేల్ సినిమాతో ఇండస్ట్రీలో నా కెరీర్ స్టార్ట్ అయ్యింది. అందులో టైగర్ ష్రాఫ్ హీరోగా నటించారు. ఆ సినిమాకు ఓకే చెప్పిన తర్వాత టీమ్ నాతో ఒక కాంట్రాక్ట్ పై సైన్ చేయించుకుంది. అందులో నేను పాటించాల్సిన విధి విధానాలు ఉన్నాయి. అయితే అందులో నో డేటింగ్ అనే షరతు కూడా ఉంది. సినిమా పూర్తయ్యేవరకూ హీరోతో నేను డేటింగ్ చేయకూడదని రాసి ఉంది. కాంట్రాక్ట్ మీద సంతకం చేసినప్పుడు నేను పెద్దగా చదవలేదు. ఆ తర్వాత నాకు ఆ విషయం తెలిసి ఆశ్చర్యపోయాను. నటీనటులు ప్రేమలో పడితే వర్క్ పై దృష్టిపెట్టరని ఆ టీమ్ భావించి ఉండొచ్చు. అందుకే ఇలాంటి షరతులు పెట్టారనుకున్నాను” అంటూ చెప్పుకొచ్చింది నిధి అగర్వాల్.
View this post on Instagram
ఇది చదవండి : Tollywood: చిన్నప్పుడే అవార్డులు.. టాలీవుడ్ క్రేజీ హీరో.. ఇప్పుడు అవకాశాల కోసం..
Tollywood: అప్పుడు కలెక్టర్ దగ్గర ఉద్యోగం.. ఇప్పుడు స్టార్ కమెడియన్.. ఎవరో తెలుసా.. ?
Mahesh Babu: మహేష్ మేనకోడలు ఎంత అందంగా ఉందో చూశారా.. ? ఇక హీరోయిన్స్ సైడ్ అవ్వాల్సిందే..