Thiruveer: 20 ఏళ్ల కల నిజం చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో.. అమ్మ చివరి కోరిక అంటూ..
ఇప్పుడిప్పుడే టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా గుర్తింపు తెచ్చుకుంటున్నాడు తిరువీర్. కెరీర్ తొలినాళ్లల్లో సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు, సహాయ పాత్రలు పోషించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఇక ఇప్పుడు హీరోగా పలు సినిమాల్లో కనిపించి తనకంటూ ఓ ఇమేజ్ సంపాదించుకుంటున్నాడు. ప్రస్తుతం తిరువీర్ షేర్ చేసిన ఫోటోస్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

తెలంగాణ కుర్రాడు.. నటనపై ఆసక్తితో సినీరంగంలోకి అడుగుపెట్టి చిన్న చిన్న పాత్రలలో కనిపించాడు. కెరీర్ తొలినాళ్లల్లో సినిమాల్లో సహాయ పాత్రలు పోషించిన తిరువీర్.. ఇప్పుడిప్పుడే హీరోగా పలు సినిమాల్లో నటిస్తున్నాడు. తనదైన నటనతో గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. ఇటీవల బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయిన హారర్ కామెడీ డ్రామా మసూద మూవీతో ప్రేక్షకులను అలరించాడు. ఈ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో అతడికి మంచి గుర్తింపు వచ్చింది. ప్రస్తుతం ఒకటి రెండు చిత్రాల్లో హీరోగా నటిస్తున్నాడు. తాజాగా తన ఇన్ స్టాలో షేర్ చేసిన పోస్ట్ ఇప్పుడు తెగ వైరలవుతుంది. రెండు దశాబ్దాలు.. తన తల్లి చివరి కోరికను తీర్చినట్లు చెప్పుకొచ్చాడు.
సినీరంగంలో 2016 నుంచి కొనసాగుతున్నాడు తిరువీర్. నటుడిగా అడపాదడపా సినిమాలు చేస్తున్న తిరువీర్.. ఇన్నాళ్లకు సొంతూరిలో ఇల్లు కట్టుకున్నాడు. తాజాగా తన భార్యతో కలిసి గృహప్రవేశం చేశాడు. ఇందుకు సంబంధించిన ఫోటోస్ తన ఇన్ స్టాలో షేర్ చేస్తూ “రెండు దశాబ్దాల కల.. అమ్మ చివరి కోరిక” అంటూ రాసుకొచ్చాడు. దీంతో తిరువీర్ దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు అభిమానులు, నెటిజన్స్.
తిరువీర్.. అచ్చ తెలంగాణ అబ్బాయి. సహాయ పాత్రలు, విలన్ పాత్రలతో కెరీర్ మొదట్లో అలరించాడు. నాని నటించిన టక్ జగదీష్ సినిమాలో విలన్ పాత్రలో కనిపించాడు. పరేషాన్, పలాస్ 1978, జార్జ్ రెడ్డి వంటి చిత్రాల్లో నటించాడు. అలాగే సిన్, మెట్రో కథలు, కుమారి శ్రీమతి వంటి వెబ్ సిరీస్ సైతం చేశాడు. గతేడాది కల్పన అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఇక ఇప్పుడు సొంతంగా ఇళ్లు కూడా కట్టుకుని తన తల్లి చివరి కోరికను నెరవేర్చాడు. ప్రస్తుతం తెలుగులో వరుస ఆఫర్స్ అందుకుంటూ బిజీగా ఉంటున్నాడు.
View this post on Instagram
ఇది చదవండి : Tollywood: చిన్నప్పుడే అవార్డులు.. టాలీవుడ్ క్రేజీ హీరో.. ఇప్పుడు అవకాశాల కోసం..
Tollywood: అప్పుడు కలెక్టర్ దగ్గర ఉద్యోగం.. ఇప్పుడు స్టార్ కమెడియన్.. ఎవరో తెలుసా.. ?
Mahesh Babu: మహేష్ మేనకోడలు ఎంత అందంగా ఉందో చూశారా.. ? ఇక హీరోయిన్స్ సైడ్ అవ్వాల్సిందే..