Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పిల్లల భవిష్యత్ కోసం తల్లి పడే తపనే ఈ సినిమా.. కన్నీరు పెట్టని ప్రేక్షకులకు నగదు బహుమతి అనే ఛాలెంజ్.. గుర్తు పట్టారా..

సినిమా అంటే ఒక వినోదం అనుకునే వారు చాలా మంది ఉన్నారు. భిన్నమైన కథలతో సినీ ప్రేక్షకులను ఆకట్టుకుని సరికొత్త అనుభూతిని అందించే సినిమాలు కూడా ఉన్నాయి. అయితే అప్పట్లో ఒక సినిమా సినీ ప్రేక్షకులకు, ప్రేమికులకు సరికొత్త చాలెంజ్ ను విసిరింది.. ఈ సినిమా చూసి ఏడవకుండా సినిమా హాల్ నుంచి బయటకు వస్తే.. నగదు బహుమతి అని ప్రకటించి సంచలనం సృష్టించింది. ఎందుకంటే సినిమా చూస్తూ మహిళా ప్రేక్షకులు ఏడుస్తారేమో .. కానీ మగవారు మాత్రం కంట నీరు పెట్టరు అనే నమ్మకంతో.. తీరా ఆ సినిమా చూసిన ప్రతి ప్రేక్షకుడు కంట కన్నీరు పెట్టాడు. హాల్ నుంచి బయటకు వస్తూ కంట నీరు తుడుచుకుంటూ కనిపించాడు. అలా హృదయాన్ని తాకిన సినిమా.. ఎన్ని సార్లు చూసినా కంట నీరు వచ్చే సినిమా.. అంతేకాదు తెలుగు పాటకు జాతీయ ఖ్యాతిని ఆర్జించి పెట్టిన సినిమా ఏమిటో తెలుసా..

పిల్లల భవిష్యత్ కోసం తల్లి పడే తపనే ఈ సినిమా.. కన్నీరు పెట్టని ప్రేక్షకులకు నగదు బహుమతి అనే ఛాలెంజ్.. గుర్తు పట్టారా..
Matrudevo Bhavam Movie
Follow us
Surya Kala

|

Updated on: Mar 22, 2025 | 4:23 PM

సృష్టిలో అమ్మ ప్రేమని తెలియజేస్తూ అనేక కథలు వింటూనే ఉన్నాం.. అనేక సినిమాలు చూస్తూనే ఉన్నాం.. కానీ అమ్మ ప్రేమ .. తన పిల్లల ఉన్నతి కోసం.. ముఖ్యంగా తాను మరణిస్తే తన పిల్లలు అనాధలు కాకూడదని.. వారికి తల్లిదండ్రుల ప్రేమ దక్కాలని తపని పడే ఓ అమ్మ తపనతో తీసిన సినిమా నేటికీ మేటి సినిమాగా నిలిచింది.. నలుగురు పిల్లలు ఉన్నా..చివరికి ఒక కొడుకు చేతిలో కన్ను మూసిన ఓ తల్లి కథ.. అందుకే అమ్మకి సృష్టిలో మొదటి స్థానం ఇస్తూ.. మాతృదేవోభవ అని అంటారేమో అని సినిమా చూసిన ప్రతి ఒక్కరూ అనుకునే సినిమా.. ఇప్పటికే గుర్తు పట్టి ఉంటారు రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే అంటూ తెలుగు పాటకు జాతీయ స్థాయిలో ఖ్యాతి తెచ్చిన మాతృదేవో భవ.. సినిమా అని. అమ్మ ప్రేమలోని గొప్పదనాన్ని నేటి తరం పిల్లలకు తెలియాలి అనుకుంటే తప్పని సరిగా మాతృదేవో భవ సినిమా చూపించాల్సిందే..

టెక్నాలజీ యుగంలో కూడా ఇప్పటికీ మారనిది ఒంటరిగా బతికే స్త్రీ అంటే చిన్న చూపు.. ఈ సమస్త భూ ప్రపంచంలో ఇప్పటికి మారనిది ఏదైనా ఉంటే అది భర్త మరణించిన మహిళ అంటే చిన్న చూపు.. ఒంటరి స్త్రీ అంటే అందరికీ అలుసే.. తన సొంత కుటుంబాన్ని వదిలి.. నిన్ను గొప్పగా చూస్తా అంటూ ఎక్కడలేని ప్రేమ ప్రదర్శిస్తాడు. అలాంటి తోడేళ్ళ నేచర్ ఉన్న మగవారి నుంచి తనని తాను కాపాడుకుంటూ తన పిల్లలకు అన్నీ తానై తన కుటుంబాన్ని కాపు కాచే స్త్రీలు ఎందరో ఉన్నారు. తన పిల్లల కోసం కోరికలు మాత్రమే కాదు తన జీవితాన్ని సైతం త్యాగం చేసి తన పిల్లలకు అందమైన భవిష్యత్ ను ఇచ్చే అమ్మలు కో కొల్లలు. అలాంటి ఒక స్త్రీకి తాను మరణిస్తానని.. తన పిల్లలు అనాధలుగా మారిపోనున్నారని తెలిస్తే.. ఆ తల్లి హృదయం పడే తపనే మాతృదేవో భవ.

వాస్తవానికి ఈ సినిమాకు మూలం జాన్ ఎర్మాన్ డైరెక్ట్ చేసి న సినిమా ” హూ విల్ లవ్ మై చిల్డ్రన్”. తనకు క్యాన్సర్ అని తెలియడంతో తల్లి.. తన పిల్లలకు ఒక గూడుని చూపించింది. తల్లిదండ్రుల ప్రేమని పిల్లలకు అందించిన తృప్తితో కన్నుమూసింది. ఈ సినిమా కథ ఆధారంగా మలయాళంలో “అక్షదూత్”గా తెరకెక్కించారు. ఇదే సినిమాను కొన్ని మార్పులు చేర్పులతో తెలుగులో మాతృదేవోభవ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాను చూస్తే అమ్మ మనసు అంటే ఏమిటో తెలియడమే కాదు.. . కన్నీళ్ల విలువ తెలుస్తుంది. అనుబంధాల గొప్పదనం తెలుస్తుంది. మనసు లోతులో ఉన్న విషాదం తెలుస్తుంది.

ఇవి కూడా చదవండి

అనాధాశ్రమంలో పెరిగిన ఇద్దరు సత్యం ( నాసర్ ) శారద ( మాధవి )లు పెళ్లి చేసుకుంటారు. శారద మ్యూజిక్ టీచర్.. నాజర్ లారీ డ్రైవర్.. తాగుబోతు.. అయినా మంచి మనసున్న వ్యక్తీ.. ఈ దంపతులకు నలగురు పిల్లలు. మద్యం అమ్మే అప్పారావు ( తనికిళ్ళ భరణి) అందమైన శారదపై కన్నేస్తాడు. అది తెలిసి అప్పారావుతో సత్యం గొడవ పడతాడు. అయితే తన భార్యకు క్యాన్సర్ అని తెలియడంతో పిల్లలు, భార్య కోసం సత్యం మారతాడు. దీంతో కక్షకట్టిన అప్పారావు సత్యంని చంపేస్తాడు. క్యాన్సర్‌తో చావుతో పోరాడుతున్న శారద.. తన పిల్లలు తనలా సేవా ఆశ్రమంలో పెరగకూడదు అని.. తల్లిదండ్రులు అన్నదమ్ములు చుట్టాలు అందరూ ఉండాలని కోరుకుంటుంది. నలుగురు పిల్లలని వేరు వేరు కుటుంబాలకు దత్తత ఇవ్వాలని భావిస్తుంది. ముగ్గురు పిల్లలని దత్తతకు ఇస్తుంది..

వికలాంగుడైన ఒక కొడుకుని దత్తత తీసుకోవడానికి ఎవరూ ముందుకు రారు. అయితే ఆ కొడుకు.. అమ్మా నాకు ఈ అంగవైకల్యం కూడా ఓ వరమే.. అందుకే నేను నీదగ్గర ఉన్నాను అని అన్నప్పుడు.. కంట కన్నీరు పెట్టని మనసు ఉండదేమో.. రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే అనడమే కాదు.. వేణువై వచ్చాను భువనానికి గాలినై పోతాను అంటూ తుది శ్వాస విడిచింది. ఎన్ని సార్లు చివరి సన్నివేశాన్ని చూసినా సరే కంట కన్నీరు పెట్టని మనిషి ఉండడని చెప్పవచ్చు. మాధవి, నాజర్, పిల్లలు ఇలా ప్రతి ఒక్కరూ తమ నటనతో ప్రేక్షకుల మనసులో నిలిచిపోయారు. నాటి మేటి సినిమా మాతృదేవో భవను నేటి తరం పిల్లలకు తప్పకుండా చూపించాల్సిన సినిమా అని చెప్పవచ్చు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ట్రైన్ టికెట్ కాన్సిల్ చేస్తే.. డబ్బులు రిఫండ్‌ పొందటం ఎలా?
ట్రైన్ టికెట్ కాన్సిల్ చేస్తే.. డబ్బులు రిఫండ్‌ పొందటం ఎలా?
హైదరాబాద్​లో యాపిల్ పాడ్స్ తయారీ !! కానీ మన కోసం కాదు
హైదరాబాద్​లో యాపిల్ పాడ్స్ తయారీ !! కానీ మన కోసం కాదు
ఓటు కార్డు-ఆధార్‌ లింకుతో దేశంలో విప్లవాత్మక మార్పు రాబోతోందా ??
ఓటు కార్డు-ఆధార్‌ లింకుతో దేశంలో విప్లవాత్మక మార్పు రాబోతోందా ??
లోహపు గుండెతో 105 రోజులు.. వైద్య చరిత్రలోనే సంచలనం
లోహపు గుండెతో 105 రోజులు.. వైద్య చరిత్రలోనే సంచలనం
పాముతో పసిపిల్లవాడు ఆటలా ?? ఏమైనా జరిగితే.. నెటిజన్స్‌ మండిపాటు
పాముతో పసిపిల్లవాడు ఆటలా ?? ఏమైనా జరిగితే.. నెటిజన్స్‌ మండిపాటు
ప్రేమించి పెళ్ళాడిన భర్తను ముక్కలుగా నరికేసిన భార్య
ప్రేమించి పెళ్ళాడిన భర్తను ముక్కలుగా నరికేసిన భార్య
ఈ వ్యాధి ఉన్నవారు బెల్లం తింటే కిడ్నీలు పాడవుతాయా..?
ఈ వ్యాధి ఉన్నవారు బెల్లం తింటే కిడ్నీలు పాడవుతాయా..?
నన్ను కూడా లైంగికంగా వేధించారు అంటూ.. షోలోనే ఏడ్చిన హీరోయిన్
నన్ను కూడా లైంగికంగా వేధించారు అంటూ.. షోలోనే ఏడ్చిన హీరోయిన్
ఫ్లోలో SSMB29 గురించి చెప్పి.. అందరికీ షాకిచ్చిన పృథ్వీరాజ్‌
ఫ్లోలో SSMB29 గురించి చెప్పి.. అందరికీ షాకిచ్చిన పృథ్వీరాజ్‌
దేవరను పూజిస్తున్న జపాన్ అమ్మాయిలు.. అది తారక్‌ క్రేజ్ అంటే!
దేవరను పూజిస్తున్న జపాన్ అమ్మాయిలు.. అది తారక్‌ క్రేజ్ అంటే!