Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Venus Transit 2025: త్వరలో నక్షత్రం మార్చుకోనున్న శుక్రుడు.. ఈ రాశులు ఆస్థి కొనుగోలు చేసే ప్రయత్నాలు సఫలం..

జ్యోతిషశాస్త్రంలో నవ గ్రహాల్లో శుక్రుడుకి ప్రత్యేక స్థానం ఉంది. రాక్షస గురువైన శుక్రుడు ఆనందం, శ్రేయస్సు , వైభవాన్ని ఇచ్చే గ్రహం. శుక్రుడు త్వరలో రాశిని మార్చబోతున్నాడు. ఈ శుక్ర సంచారం 12 రాశుల వారిని ప్రభావితం చేసినప్పటికీ ఈ నక్షత్ర రాశి మార్పు కొన్ని రాశుల వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈ సమయంలో కొన్ని రాశులకు చెందిన వ్యక్తులు భారీ లాభాలను పొందవచ్చు. ఈ రోజు ఆ అదృష్ట రాశులు ఏమిటో తెలుసుకుందాం..

Venus Transit 2025: త్వరలో నక్షత్రం మార్చుకోనున్న శుక్రుడు.. ఈ రాశులు ఆస్థి కొనుగోలు చేసే ప్రయత్నాలు సఫలం..
Venus Transit 2025
Follow us
Surya Kala

|

Updated on: Mar 22, 2025 | 1:33 PM

జ్యోతిషశాస్త్రం ప్రకారం నవ గ్రహాలు కాలానుగుణంగా తమ రాశులను, నక్షత్రరాశులను మార్చుకుంటూ ఉంటాయి. ఈ గ్రహ సంచార ప్రభావం మొత్తం 12 రాశులపై ఉంటుంది. ఈసారి శుక్రుడు నక్షత్రాన్ని మార్చుకోనున్నాడు. జ్యోతిషశాస్త్రంలో రాక్షస గురువు శుక్రుడిని సంపద, సౌకర్యాలు, అందం, కళ, ప్రేమకు కారకుడిగా పరిగణిస్తారు. ఎవరి జాతకంలోనైనా శుక్రుడు బలమైన స్థానంలో ఉంటే ఆ వ్యక్తిని అదృష్టవంతుడు అని అంటారు. అతను ఎప్పుడూ విలాసవంతమైన జీవితాన్ని గడుపుతాడు. ఈసారి శుక్ర గ్రహం రాశి మార్పుతో కొన్ని రాశులకు చెందిన వ్యక్తులపై దయతో ఉండనున్నాడు. ఈ సమయంలో సంపదతో పాటు ఈ రాశికి చెందిన వ్యక్తులకు సమాజంలో గౌరవం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. ఈ రోజు ఆ అదృష్ట రాశులు ఏమిటో తెలుసుకుందాం.

శుక్ర నక్షత్రరాశి మార్పు

జ్యోతిషశాస్త్ర గణన ప్రకారం శుక్రుడు ప్రస్తుతం మీన రాశిలో ఉన్నాడు.. అయితే ఏప్రిల్ 1న ఉదయం 4:25 గంటలకు పూర్వాభాద్రపద నక్షత్రంలోకి ప్రవేశించనున్నాడు. శుక్రుడు ఈ రాశిలో ఏప్రిల్ 26 వరకు ఉంటాడు. దీంతో కొన్ని రాశులకు చెందిన వ్యక్తులకు మేలు జరుగుతుంది. ఈ రాశుల వారికి మంచి రోజులు ప్రారంభంకానున్నాయి. అవి ఏమిటో తెలుసుకుందాం..

వృషభ రాశి: శుక్ర గ్రహం రాశిలో మార్పుతో వృషభ రాశి వ్యక్తులు చాలా ప్రయోజనం పొందబోతున్నారు. ఈ సమయంలో ఈ రాశికి చెందిన వ్యక్తుల పాత కోరిక ఏదైనా నెరవేరవచ్చు. ఈ రాశికి చెందిన వ్యక్తులు కొత్త ఉద్యోగ అవకాశం లభించవచ్చు. అదే సమయంలో వ్యాపారం చేసే వారికి మంచి లాభాలు కలిగే అవకాశాలున్నాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వీరు డబ్బు ఆదా చేయడంలో విజయం సాధిస్తారు, దీంతో మీ పొదుపు పెరుగుతుంది. అంతేకాదు ప్రేమ విషయంలో జీవితం బాగుంటుంది. వీరి వైవాహిక జీవితం మెరుగుపడుతుంది.

ఇవి కూడా చదవండి

మకరరాశి: ఈ రాశి వారు శుక్ర రాశిలో మార్పు వల్ల ఎంతో ప్రయోజనం పొందుతారు. ఈ సమయంలో ఈ రాశికి చెందిన వ్యక్తుల జీవితాల్లో అనేక సానుకూల మార్పులు రావచ్చు. చేపట్టిన పనుల్లో అడ్డంకులు తొలగిపోతాయి. వీరికి కుటుంబం నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. అంతేకాదు ఆస్తి, వాహనాన్ని కొనాలనుకుంటే ఇదే శుభతరుణం. వైవాహిక జీవితంలో జరుగుతున్న సమస్యలను పరిష్కరించుకుంటారు. కుటుంబంతో చిరస్మరణీయ సమయాన్ని గడపడానికి అవకాశాన్ని పొందుతారు.

కుంభ రాశి: ఈ రాశి వారికి శుక్ర నక్షత్ర మార్పు సమయం శుభప్రదంగా ఉంటుంది. ఈ సమయం విద్యార్థులకు చాలా శుభప్రదంగా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో కుంభ రాశి విద్యార్థులు పరీక్షలు, పోటీ పరీక్షల్లో మెరుగైన ఫలితాలను పొందవచ్చు. అదే సమయంలో ఉద్యోగులు పదోన్నతి పొందవచ్చు. వ్యాపారస్తులు తమ మూలధన పెట్టుబడిలో కూడా లాభాలను పొందవచ్చు. అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంలో వీరు విజయం సాధిస్తారు. అంతేకాదు ప్రేమికులు తాము కోరుకున్న వ్యక్తికి దగ్గరవ్వగలరు. సమాజంలో వీరికి గౌరవం పెరుగుతుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు