Shani Transit: ఈ ఏడాదిలో మొదటి సూర్యగ్రహణం, శని సంచారం.. ఈ రాశుల వారు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది..
హిందూ మతంలో ప్రతి తిధి ప్రత్యేకమైంది. ముఖ్యంగా ప్రతి నెల అమావాస్య, పౌర్ణమి తిధులు వెరీ వెరీ స్పెషల్. అయితే ఈ ఏడాది పాల్గుణ మాసంలోని అమావాస్య చాలా ప్రత్యేకమైనదిగా పరిగణించబడుతుంది. ఎందుకంటే ఈ అమావాస్య రోజున చాలా అరుదైన యాదృచ్చిక సంఘటనలు జరగబోతున్నాయి. ఈ రోజున మొదటి సూర్యగ్రహణం ఏర్పడనుంది. అంతేకాదు ఈ రోజున శనీశ్వరుడు కుంభ రాశి ను వదిలి మీన రాశిలోకి ప్రవేశించనున్నాడు.

హిందూ మతంలో అనేక పండుగలున్నాయి. అయితే ఉగాది పండగ మాత్రం వెరీ వెరీ స్పెషల్. ఎందుకంటే ఈ రోజు తెలుగు నూతన సంవత్సరం. హిందూ క్యాలెండర్ ప్రారంభం రోజుని ఉగాదిగా చైత్ర మాసం పాడ్యమి రోజున జరుపుకుంటారు. ఈ రోజున సృష్టి ప్రారంభం అయిందని నమ్మకం. ప్రతి ఇంట్లో నూతన సంవత్సర వేడుకలు ఎంతో సంప్రదాయంగా ఉత్సాహంగా జరుపుకుంటారు. కొత్త సంవత్సరంనుంచి అయినా తమ జీవితం సుఖ సంతోషాలతో ప్రారంభం కావాలని అందరూ కోరుకుంటారు. అయితే జీవితంలో జరిగే ప్రతి సంఘటన జాతకంలో గ్రహాల స్థానం ఆధారంగా జరుగుతుందని నమ్మకం. ప్రతి సంవత్సరం తెలుగు నూతన సంవత్సరం చైత్ర మాసంలోని శుక్ల పక్షంలోని పాడ్యమి తిథిలో ప్రారంభమవుతుంది. పంచాంగం ప్రకారం ఈసారి పాల్గుణ అమావాస్య మార్చి 29న వచ్చింది. ఈ రోజు హిందువులు చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తున్నారు.
ఈ సంవత్సరం చైత్ర మాసం అమావాస్య రోజున అనేక అరుదైన యాదృచ్చిక సంఘటనలు జరగబోతున్నాయి. నిజానికి సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం ఏర్పడనుంది. అదే రోజున శనీశ్వరుడు కుంభ రాశి నుంచి బయటకు వచ్చి మీన రాశిలోకి ప్రవేశిస్తాడు. కర్మ ప్రధాత శనీశ్వరుడు మార్చి 29, 2025న రెండున్నర సంవత్సరాల తర్వాత తన రాశిని మార్చుకోనున్నాడు. ప్రస్తుతం శనీశ్వరుడు కుంభరాశిలో ఉన్నాడు. ఈ రాశిలో తన ప్రయాణాన్ని పూర్తి చేసిన తర్వాత శనీశ్వరుడు మీనరాశిలోకి ప్రవేశిస్తాడు.
శని మీన రాశిలోకి ప్రవేశించే రోజునే సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం కూడా ఏర్పడనుంది. కొన్ని రాశులకు చెందిన వ్యక్తులకు శని సంచారము, సూర్యగ్రహణం కలయిక చాలా అశుభకరం కావచ్చు. జ్యోతిషశాస్త్రం ప్రకారం ఈ అరుదైన యాదృచ్చికం కారణంగా.. కొన్ని రాశులకు చెందిన వ్యక్తులు భారీ నష్టాలను చవిచూడవచ్చు. ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం.
సూర్యగ్రహణం, శని సంచారము ఎవరికి అశుభకరం అంటే..
- మేష రాశి వారికి ఈ సంవత్సరం మొదటి సూర్యగ్రహణం, శని సంచారము కలయిక ఎన్నో కష్టాలను తీసుకొస్తుంది. వీరి కెరీర్‌లో ఒడిదుడుకులు, పెరిగే పనిభారం, సహోద్యోగులతో విభేదాలు, వ్యాపారంలో నష్టాలు, ఆరోగ్య సమస్యలు, తీవ్ర ఒత్తిడి ఉంటాయి.
- కర్కాటక రాశి వారు శని సంచార సమయంలో ఏ రంగంలోనూ పెట్టుబడి పెట్టకూడదు. లేకుంటే మీరు నష్టపోవచ్చు లేదా మీ డబ్బు చిక్కుకుపోవచ్చు. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. కొత్తగా ఏ పని పెట్టవద్దు.
- తుల రాశి: సూర్యగ్రహణం, శని సంచారము కారణంగా వ్యక్తిగత సంబంధాలలో అపార్థాలు పెరగవచ్చు, ఖర్చులు పెరుగుతాయి, ఆర్థిక సమస్యలు పెరుగుతాయి, విద్యార్థులు విద్యలో సమస్యలను ఎదుర్కొంటారు.
- వృశ్చిక రాశి: ఈ అరుదైన యాదృచ్చికం కారణంగా వృశ్చిక రాశి వ్యక్తులు ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇంట్లో తగాదాలు ఏర్పడవచ్చు, జీవిత భాగస్వామితో సంబంధాలు క్షీణించవచ్చు, ఆస్తి సంబంధిత వివాదాలు తలెత్తవచ్చు, జీవితంలో ప్రతికూలత పెరుగుతుంది.
- ధనుస్సు రాశి వారికి సూర్యగ్రహణం, శని సంచారము కలయిక కూడా అశుభ ఫలితాలను ఇస్తుంది. ధనుస్సు రాశి వారు ఈ కాలంలో ఎక్కడా పెట్టుబడి పెట్టకూడదు. వీరు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. అంతేకాదు మాటలను నియంత్రించుకోవాలి.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు