Lord Shani: శని, శుక్రుల అరుదైన కలయిక.. ఆ రాశుల వారికి సిరిసంపదలు..!
Shani Shukra Yuti: శని, శుక్రుల అరుదైన కలయిక మార్చి 29 నుండి మే 31 వరకు జరుగుతుంది. దీని ప్రభావంతో కొన్ని రాశుల వారికి సిరిసంపదలు దక్కనున్నాయి. అలాగే ఈ యుతి కారణంగా ఉద్యోగంలో పదోన్నతులు, ఆర్థిక ప్రగతి, కుటుంబ సంతోషం వంటి శుభ ఫలితాలు పొందే అవకాశముంది.

Shani Shukra Yuti
Telugu Astrology: జ్యోతిషశాస్త్రం ప్రకారం శని, శుక్రులు ప్రాణ స్నేహితులు. ఈ రెండు గ్రహాలు ఎక్కడ కలిసినా తప్పకుండా ఏదో ఒక రూపంలో అదృష్టాన్ని కలగజేస్తాయి. ముఖ్యంగా ఊహించని సిరిసంపదలను ప్రసాదిస్తాయి. ఈ రెండు గ్రహాల యుతి అనుకూలంగా ఉన్న రాశుల వారికి సుఖ సంతోషాలకు, మానసిక ప్రశాంతతకు లోటుండదు. ఈ నెల(మార్చి) 29న శనీశ్వరుడు మీన రాశిలోకి మారడంతో అక్కడే ఉన్న ఉచ్ఛ శుక్రుడితో యుతి చెందడం జరుగుతుంది. ఈ అరుదైన కలయిక వల్ల వృషభం, మిథునం, కన్య, తుల, మకరం, కుంభ రాశుల వారికి దశ తిరిగే అవకాశం ఉంది. ఈ రెండు గ్రహాల కలయిక మే 31 వరకూ కొనసాగుతుంది.
- వృషభం: రాశ్యధిపతి శుక్రుడు ఉచ్ఛ స్థితిలో ఉండడం ఒక విశేషం కాగా, ఈ రాశికి అత్యంత శుభుడైన శని ఆ శుక్రుడితో కలవడం మరో విశేషం. ఈ రాశివారికి కొత్త సంవత్సరంలో తప్పకుండా మహా భాగ్య యోగాలు కలుగుతాయి. ఊహించని విధంగా సిరిసంపదలు కలుగుతాయి. ఉద్యోగంలో ఉన్నత పదవులు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అంచనాలను మించుతాయి. అత్యంత ప్రముఖులతో సైతం సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది.
- మిథునం: ఈ రాశికి అత్యంత శుభులైన శుక్రుడు, శనీశ్వరుడు దశమ స్థానంలో కలవడం వల్ల ఉద్యోగ పరంగా కీలకమైన శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగంలో ఉన్నత పదవులు లభిస్తాయి. జీతభత్యాలు విశేషంగా పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు బాగా వృద్ది చెందు తాయి. ఉద్యోగులకు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. ఉద్యోగులకు మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి ఆహ్వానాలు అందుతాయి. అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది.
- కన్య: ఈ రాశికి సప్తమ స్థానంలో ఉచ్ఛ శుక్రుడు, శని కలవడం వల్ల జీవనశైలి పూర్తిగా మారిపోతుంది. విలాసవంతమైన జీవితం అలవడుతుంది. ఆస్తిపాస్తులు వృద్ధి చెందుతాయి. ఆస్తి వివాదాలు అను కూలంగా పరిష్కారమై విలువైన ఆస్తి చేతికి అందుతుంది. ఉద్యోగంలో జీతభత్యాలు బాగా పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు లాభాల బాటపడతాయి. షేర్లు, స్పెక్యులేషన్లు, ఇతర ఆర్థిక లావాదేవీల వల్ల లాభాలు కలుగుతాయి. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి కుదిరే అవకాశం ఉంది.
- తుల: రాశినాథుడైన శుక్రుడు ఉచ్ఛ స్థితిలో ఉండడంతో పాటు, ఈ రాశికి అత్యంత శుభుడైన శనితో ఆరవ స్థానంలో కలవడం వల్ల ఆదాయం ఇబ్బడిముబ్బడిగా వృద్ది చెందుతుంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి దాదాపు పూర్తిగా విముక్తి లభిస్తుంది. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. వృత్తి, ఉద్యోగాలరీత్యా విదేశాలకు వెళ్లడం జరుగుతుంది. ఉద్యోగంలో పదోన్నతులు లభిస్తాయి. ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు సైతం అందుతాయి.
- మకరం: ఈ రాశికి తృతీయ స్థానంలో రాశ్యధిపతి శనితో ఉచ్ఛ శుక్రుడు యుతి చెందడం వల్ల విపరీత రాజ యోగాలు కలుగుతాయి. ప్రభుత్వపరంగా గుర్తింపు లభిస్తుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. సమాజ సేవా కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు. ప్రయాణాల వల్ల లాభాలు కలుగుతాయి. షేర్లు, స్పెక్యులేషన్లు లాభాల పంట పండిస్తాయి. ఉద్యోగంలో ఉన్నత పదవులు లభిస్తాయి. జీతభత్యాలు బాగా పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అంచనాల్ని మించుతాయి.
- కుంభం: రాశినాథుడైన శనీశ్వరుడు ధన స్థానంలో ఉచ్ఛ శుక్రుడితో కలవడం వల్ల పట్టిందల్లా బంగారం అవుతుంది. ఏలిన్నాటి శని ప్రభావం బాగా తగ్గిపోతుంది. కుటుంబంలో సుఖ సంతోషాలకు లోటు ఉండదు. ఇంట్లో శుభ కార్యాలు జరుగుతాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు ఘన విజయాలు సాధి స్తాయి. మాటకు విలువ పెరుగుతుంది. ఉద్యోగపరంగా ఆదాయం బాగా పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు లాభాల బాటపడతాయి. నిరుద్యోగులకు భారీ జీతభత్యాలతో విదేశీ ఆఫర్లు అందుతాయి.