AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ రోజు ఆయన కాళ్ల మీద పడి ఏడ్చేశాను.. ఈ రోజు ఇలా ఉన్నానంటే కారణం వారే

ప్రముఖ గాయకుడు మనో తన సినీ ప్రస్థానాన్ని గుర్తుచేసుకున్నారు. ఓ స్టార్ దర్శకుడు ప్రోత్సాహంతో నటుడిగా ఆరంభించి, ఎం.ఎస్. విశ్వనాథన్ గారి వద్ద సంగీత సహాయకుడిగా పనిచేశారు. ఆపై చక్రవర్తి గారి మార్గదర్శకత్వంలో సంగీత మెళకువలు నేర్చుకుని, గాయకుడిగా ఎదిగారు .

ఆ రోజు ఆయన కాళ్ల మీద పడి ఏడ్చేశాను.. ఈ రోజు ఇలా ఉన్నానంటే కారణం వారే
Singer Mano
Rajeev Rayala
|

Updated on: Jun 14, 2026 | 11:21 AM

Share

ప్రముఖ గాయకుడు మనో ఎన్నో అద్భుతమైన సాంగ్స్ ఆలపించి ప్రేక్షకులను అలరించారు మనో. తన సినీ జీవితపు తొలి అడుగులను, అందుకు కారణమైన గొప్ప వ్యక్తులను స్ఫూర్తిదాయకంగా వివరించారు. తన కెరీర్‌కు దాసరి నారాయణరావు గారే బీజం వేశారని మనో స్పష్టం చేశారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో.. 1976లో రంగున్ రౌడీ, అత్తవారిల్లు చిత్రాలలో బాల నటుడిగా సినీ రంగ ప్రవేశం చేశారు. అలాగే ఓ ఆడది ఓ మగడు అనే సినిమాలో నటించారు మనో.. ఈ సినిమాలో దాసరి నారాయణరావు గారు తన తల్లిని ఒక పాత్రకు ఎంపిక చేసినప్పుడు, తాను కూడా నటించాలని మనో కోరుకున్నారు. హీరోయిన్ తమ్ముడు పాత్రలో నటించాలని మనో అనుకున్నారు. అయితే, అప్పటికి మనో పెద్దవాడయ్యాడని, పాత్రకు సరిపోడని దాసరి నారాయణరావు గారు మొదట తిరస్కరించారు. కానీ, మనో తన కోరికను విడిచిపెట్టలేదు. పదే పదే దాసరి గారిని అడిగి, చివరికి కాళ్ల మీద పడి కన్నీళ్లు పెట్టుకుని మరీ ఆ పాత్రను పొందారు. ఈ సంఘటన తన జీవితంలో ఒక మలుపు అని మనో గుర్తుచేసుకున్నారు.

ఇది కూడా చదవండి : Jabardasth Vinod: జబర్దస్త్ లేకపోతే ఆ పని చేసేవాడిని.. అసలు విషయం చెప్పిన లేడీ గెటప్ వినోద్

ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకులు ఎం.ఎస్. విశ్వనాథన్ గారు సంగీతం సమకూర్చారు. పూజా రికార్డింగ్‌లో మనో పాడిన విధానం చూసి, విశ్వనాథన్ గారు ఆయన గాత్రంలోని మాధుర్యాన్ని గుర్తించారు. బాల నటుడిగా నటించిన మనో, గులాం అలీ గజల్స్ పాడి విశ్వనాథన్ గారిని మెప్పించారు. సినిమా పూర్తయిన తర్వాత తన వద్ద సంగీత సహాయకుడిగా చేరమని విశ్వనాథన్ గారు ఆహ్వానించారు. రెండు సంవత్సరాల పాటు మనో ఎం.ఎస్. విశ్వనాథన్ గారి దగ్గర అసిస్టెంట్‌గా పనిచేశారు. మద్రాసులో తెలుగు కుర్రాడిగా తమిళ భాష తెలియకపోవడం వల్ల ఎదురైన ఇబ్బందులను కూడా ఆయన ప్రస్తావించారు.

ఇది కూడా చదవండి : ఇప్పుడున్న హీరోల్లో అతనొక్కడే నన్ను ఆంటీ అని పిలుస్తాడు.. జయసుధ ఆసక్తికర కామెంట్స్

ఈ దశలో మనో తమ్ముడు, ఒక తబలిస్ట్, చక్రవర్తి గారి వద్ద అవకాశాన్ని వెతుకుతూ వెళ్లారు. అక్కడ మనో పాడి, ఆయన తమ్ముడు తబలా వాయిస్తుండగా, చక్రవర్తి గారు మనోను గుర్తించారు. మనో, ఎం.ఎస్. విశ్వనాథన్ గారి వద్ద సహాయకుడిగా పనిచేస్తున్నారని తెలుసుకున్న చక్రవర్తి గారు, వెంటనే విశ్వనాథన్ గారికి ఫోన్ చేసి మనోను తన వద్దకు పంపమని కోరారు. విశ్వనాథన్ గారి అనుమతితో మనో చక్రవర్తి గారి దగ్గర సహాయకుడిగా చేరారు. చక్రవర్తి గారు మనోకు ఎంతో ప్రోత్సాహాన్ని అందించారు. రీ-రికార్డింగ్ మార్కింగ్ నుంచి 100 మంది వాయిద్యకారులతో కూడిన ఆర్కెస్ట్రాను నిర్వహించడం వరకు, సంగీత దర్శకత్వంలోని ప్రతి మెళకువనూ నేర్పించారు. తన జీవితంలో దాసరి నారాయణరావు గారు నటుడిగా అవకాశం ఇవ్వడం, ఎం.ఎస్. విశ్వనాథన్ గారు సంగీత సహాయకుడిగా తీర్చిదిద్దడం, చక్రవర్తి గారు సంగీత దర్శకత్వంలో పూర్తి అవగాహన కల్పించడం వంటి ఈ మహనీయుల ప్రోత్సాహం లేకపోతే తాను ఈ రోజు ఈ స్థితిలో ఉండేవాడిని కాదని మనో తెలిపారు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : అప్పుడు నా సినిమాలో నటించాడు.. ఇప్పుడు స్టార్ హీరో.. అతను ఎంత మారిపోయాడంటే

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us