AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: చటుక్కున దూకి.. లటుక్కున అందుకున్నాడు..! మళ్లీ మళ్లీ చూడాలనిపించే క్యాచ్ ఇది

ధర్మశాలలో భారత్-ఆఫ్ఘనిస్తాన్ తొలి వన్డేలో శుభ్‌మన్ గిల్ పట్టిన అసాధారణ ఒంటిచేతి క్యాచ్ మ్యాచ్‌కే హైలైట్. ఈ వైరల్ వీడియోతో పాటు, రహెమనుల్లా గుర్బాజ్ 48 బంతుల్లో వేగవంతమైన సెంచరీ చేసి రికార్డు సృష్టించాడు. వర్షం కారణంగా 25 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో, ఈ రెండు అద్భుత ఘట్టాలు అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

Video: చటుక్కున దూకి.. లటుక్కున అందుకున్నాడు..! మళ్లీ మళ్లీ చూడాలనిపించే క్యాచ్ ఇది
Shubman Gill Catch
SN Pasha
|

Updated on: Jun 14, 2026 | 11:12 AM

Share

ధర్మశాలలో భారత్ – ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరిగిన తొలి వన్డేలో భారత కెప్టెన్ శుబ్‌మన్ గిల్ పట్టిన అద్భుతమైన ఒంటిచేతి క్యాచ్ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో గిల్ క్యాచ్ పట్టిన వీడియో వైరల్‌గా మారింది. టీమిండియా బౌలర్ హర్ష్ దుబే వేసిన ఓవర్లో, ఆఫ్గాన్ ప్లేయర్ ఘజన్‌ఫర్ ఆఫ్ స్టంప్ వెలుపల నెమ్మదిగా వచ్చిన బంతిని ఆడేందుకు ప్రయత్నించగా, అది బ్యాట్ అంచుకు తగిలి ఫస్ట్ స్లిప్ ఎడమవైపుగా వేగంగా ఎగిరింది. క్షణాల్లో స్పందించిన గిల్ పూర్తిగా గాల్లోకి డైవ్ చేస్తూ ఎడమ చేతితో అసాధారణ క్యాచ్‌ను అందుకున్నాడు. నేలపై దొర్లినా బంతిని గట్టిగా పట్టుకుని వికెట్‌ను పూర్తి చేశాడు. అంతే స్టేడియంలోని ప్రక్షకులు, ఇరు జట్ల ఆటగాళ్లు అంతా షాక్ అయ్యారు. అలా ఎలా పట్టాడో చాలా మంది వెంటనే అర్థం కూడా కాలేదు.

ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. వర్షం కారణంగా 25 ఓవర్లకు కుదించబడిన ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్లు దూకుడుగా ఆరంభించారు. ముఖ్యంగా ఓపెనర్ రహెమనుల్లా గుర్బాజ్ భారత బౌలర్లపై విరుచుకుపడి కేవలం 48 బంతుల్లోనే శతకం బాదాడు. ఇది ఆఫ్ఘనిస్తాన్ తరఫున అత్యంత వేగవంతమైన వన్డే సెంచరీగా, అలాగే భారత్ – ఆఫ్ఘనిస్తాన్ వన్డే చరిత్రలో అత్యంత వేగవంతమైన సెంచరీగా నమోదైంది. భారత్‌పై వన్డే సెంచరీ చేసిన రెండో ఆఫ్ఘన్ బ్యాటర్‌గా కూడా గుర్బాజ్ నిలిచాడు.

గుర్బాజ్ దూకుడుతో ఆఫ్ఘనిస్తాన్ భారీ స్కోరు దిశగా పయనించినప్పటికీ, భారత బౌలర్లు కీలక సమయాల్లో వికెట్లు పడగొట్టారు. అరంగేట్రం చేసిన హర్ష్ దూబే సహా బౌలర్లు సమిష్టిగా రాణించగా, గిల్ వంటి ఫీల్డర్లు అద్భుతమైన క్యాచ్‌లతో జట్టుకు మద్దతుగా నిలిచారు. చివరి ఓవర్లలో భారత్ పుంజుకుని ఆఫ్ఘనిస్తాన్‌ను 24.5 ఓవర్లలో 194 పరుగులకే ఆలౌట్ చేసింది. గుర్బాజ్ మెరుపు సెంచరీ ఎంతగా ఆకట్టుకుందో, గిల్ పట్టిన అద్భుతమైన క్యాచ్ కూడా అంతే స్థాయిలో అభిమానులను అలరించింది. మ్యాచ్ ముగిసిన తర్వాత సోషల్ మీడియాలో గిల్ క్యాచ్ వీడియో వైరల్‌గా మారి క్రికెట్ అభిమానుల ప్రశంసలు అందుకుంటోంది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us