AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NEET Admit Card 2026: నీట్ యూజీ హాల్ టికెట్ విడుదలకు కౌంట్‌డౌన్.. విద్యార్థులు రెడీనా?

జూన్ 21న జరగనున్న నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామినేషన్‌కు సంబంధించి అడ్మిట్ కార్డులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఈ రోజు విడుదల చేయనుంది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ లాగిన్ వివరాలతో హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈసారి పరీక్ష సమయాన్ని 15 నిమిషాలు పెంచుతూ మొత్తం 195 నిమిషాల పాటు నిర్వహించనున్నట్లు ఎన్‌టీఏ ప్రకటించిన సంగతి తెలిసిందే..

NEET Admit Card 2026: నీట్ యూజీ హాల్ టికెట్ విడుదలకు కౌంట్‌డౌన్.. విద్యార్థులు రెడీనా?
NEET UG Re-Exam admit card
Srilakshmi C
|

Updated on: Jun 14, 2026 | 10:46 AM

Share

హైదరాబాద్, జూన్‌ 14: వచ్చే ఆదివారం నీట్ యూజీ 2026 రీ-టెస్ట్‌ జరనున్న సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నేడు విడుదల చేయనుంది. నీట్ రీ టెస్ట్‌కు హాజరుకానున్న అభ్యర్థులు తమ హాల్ టిక్కెట్లను అధికారిక వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించింది. నీట్‌ 2026 రీటెస్ట్‌ జూన్ 21వ తేదీన మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5:15 గంటల వరకు జరగనుంది. అడ్మిట్ కార్డుల విడుదల, పరీక్షకు సంబంధించిన ఇతర సూచనల కోసం అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను క్రమం తప్పకుండా తనిఖీ చేయాలని ఎన్టీయే సూచించింది.

నీట్ యూజీ 2026 అడ్మిట్ కార్డుల డౌన్‌లోడ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

నీట్ యూజీ అనేది దేశంలో అండర్ గ్రాడ్యుయేట్ వైద్య కోర్సులలో ప్రవేశం కోసం నిర్వహించే అతిపెద్ద ప్రవేశ పరీక్షలలో ఒకటి. ఈ సంవత్సరం ఈ పరీక్ష కోసం సుమారు 22.75 లక్షల మంది అభ్యర్థులు నమోదు చేసుకోకున్నారు. మే 3న నిర్వహించిన పరీక్షకు 22.05 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. ఆ తర్వాత పేపర్‌ లీకేజీ కారణంగా ఈ పరీక్షను రద్దు చేశారు. సరిగ్గా వారం తర్వాత జరిగనున్న నీట్ పరీక్షకు సంబంధించిన అడ్మిట్‌ కార్డులు నేడు వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తీసుకురానున్నారు. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్‌ నంబర్‌, పుట్టిన తేదీ లేదా పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేసి అడ్మిట్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

నీట్ యూజీ 2026 అడ్మిట్ కార్డుల డౌన్‌లోడ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కాగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఆధ్వర్యంలో నిర్వహింనున్న నీట్ (UG)-2026 రీ టెస్ట్ 21 జూన్ 2026 (ఆదివారం)ను దేశవ్యాప్తంగా 551 నగరాలు,విదేశాలలో 14 నగరాల్లో జరగనుంది. పెన్, పేపర్ విధానంలో ఈ పరీక్షను నిర్వహించనున్నారు. నీట్ (యూజీ) పరీక్షను నిష్పక్షపాతంగా, పకడ్బందీగా నిర్వహిస్తామని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ శుక్రవారం విద్యార్థులకు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ ప్రవేశ పరీక్ష కోసం ఆత్మవిశ్వాసంతో పరీక్షకు సిద్ధం కావాలని సూచించారు. అలాగే రఫ్ వర్క్‌కు 4 షీట్లు ఇవ్వడం, పరీక్ష సమయాన్ని పొడిగించడం వంటి మార్పులు కూడా ఈసారి నీట్ పరీక్ష కోసం ఎన్టీయే తీసుకువచ్చింది. పరీక్షను మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5:15 గంటల వరకు నిర్వహిస్తారు. అంటే మొత్తం 195 నిమిషాల సమయం కేటాయించనున్నారు. పరీక్ష వ్యవధిని 15 నిమిషాలు పొడిగించారు.

Follow Us