AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: ఏముందీ సినిమాలో? తెలుగు ఆడియెన్స్ తెగ చూస్తున్నారు.. ఒక్క రోజులోనే ఓటీటీ టాప్ ట్రెండింగ్‌లోకి..

ఈ క్రైమ్ థ్రిల్లర్ గత శుక్రవారం (జూన్ 12)నే ఓటీటీలోకి వచ్చింది. మలయాళం వెర్షన్ తో పాటు తెలుగు వెర్షన్ కూడా అందుబాటులో ఉంది. దీంతో గత రెండు రోజులుగా ఈ మూవీ పేరు తెగ మార్మోగుతుంది. ముఖ్యంగా ఈ సినిమా క్లైమాక్స్ గురించి అందరూ తెగ మాట్లాడుకుంటున్నారు.

OTT Movie: ఏముందీ సినిమాలో? తెలుగు ఆడియెన్స్ తెగ చూస్తున్నారు.. ఒక్క రోజులోనే ఓటీటీ టాప్ ట్రెండింగ్‌లోకి..
OTT Movie
Basha Shek
|

Updated on: Jun 14, 2026 | 10:26 AM

Share

గత వారం ఓటీటీలోకి పలు కొత్త సినిమాలు వచ్చేశాయి. సూర్య కరుప్పు, రమణి కల్యాణం వంటి తెలుగు సినిమాలతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషలకు చెందిన సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు వచ్చేశాయి. అయితే వీటిలో ఒక సినిమా ఇప్పుడు ఓటీటీని షేక్ చేస్తోంది. గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో ఈ సినిమా పేరే వినిపిస్తోంది. మరీ ముఖ్యంగా తెలుగు ఆడియన్స్ ఈ సినిమాను ఎగబడి చూస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే ఇప్పుడీ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఓటీటీ టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతోంది. అయితే కొన్ని రోజుల క్రితం థియేటర్లలో ఈ సినిమా విడుదలైనప్పుడు ఓ మోస్తరుగా మాత్రమే ఆడింది. ఉన్నంతలో బాక్సాఫీస్ వద్ద మెరుగైన వసూళ్లనే రాబట్టింది. కానీ ఓటీటీలో మాత్రం ఈ సినిమా అదరగొడుతోంది. ముఖ్యంగా సినిమా క్లైమాక్స్ షాకింగ్ ఉందంటూ సోషల్ మీడియాలో తెగ పోస్టులు పెడుతున్నారు. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. కేరళలోని ఓ గ్రామం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. హీరో విజయ్ ఎస్సైకొత్తగా పోస్టింగ్ మీద వస్తాడు. అయితే డ్యూటీలో చేరిన మరుసటి రోజు నుంచే ఊరిలో చిత్ర విచిత్రమైన సంఘటనలు జరుగుతాయి. రెండో రోజే దారుణ హత్య, మూడో రోజే ఓ ఫైనాన్స్ కంపెనీలో దొంగతనం, ఆ తర్వాత బ్లాక్ మెయిల్ కేసు, ఆపై మరికొన్ని హత్యలు.. ఇలా నగరంలో వరుసగా క్రైమ్స్ జరుగుతాయి. మరి ఈ ఇన్సిడెంట్స్ కు కారణమెవరు? కొత్తగా జాయిన్ అయిన విజయ్ ఈ కేసులను ఎలా సాల్వ్ చేశాడు? ఇన్వెస్టిగేషన్ లో విజయ్ కు ఎదురైన పరిస్థితులేంటి? అన్నది తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

ప్రస్తుతం ఓటీటీ టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతోన్న ఈ సినిమా పేరు ధృడం (Dridam). ఇదొక మలయాళం క్రైమ్ థ్రిల్లర్. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయిన దృశ్యం చిత్రాల దర్శకుడు జీతూ జోసెఫ్ సమర్పణలో ఈ సినిమా తెరకెక్కడం విశేషం. మార్టిన్ జోసెఫ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. తెలుగు వారికి బాగా తెలిసిన హీరో షేన్ నిగమ్ ఇందులో ప్రధాన పాత్ర పోషించాడు. ప్రస్తుతం ఈ సినిమా జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. మలయాళం, తెలుగు తో సహా మొత్తం ఐదు భాషల్లో ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమా అందుబాటులో ఉంది. వీకెండ్ లో ఓ మంచి క్రైమ్ థ్రిల్లర్ సినిమా చూడాలనుకునేవారికి ధృడం బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ సినిమా క్లైమాక్స్ అందరినీ షాక్ కు గురి చేస్తుంది.

ఇవి కూడా చదవండి

జియో హాట్ స్టార్ లో ధృడం సినిమా..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us