Ugadi 2025: రాబోయేది విశ్వావసు నామ సంవత్సరం.. సూర్యుడు అధిపతి.. ఎలా ఉండబోతోంది..
మరికొన్ని రోజుల్లో నూతన తెలుగు సంవత్సరం ప్రారంభం కానుంది. ఈ నేపధ్యంలో ప్రజలు కొత్త సంవత్సరంలోనైనా తమ కష్ట నష్టాల నుంచి విముక్తి కలిగి సిరి సంపదలు, సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకుంటారు. ఈ మేరకు తమ జాతకం ఎలా ఉంటుందో అని తెలుసుకోవాలని కోరుకుంటారు. అంతేకాదు కొత్త ఏడాదిలో ప్రపంచం ఎలా ఉండనుందని కూడా తెలుసుకోవాలని ఆసక్తిని చూపిస్తారు. ఈ సంవత్సరంలో విశ్వావసు సంవత్సరంలో ఒక కొత్త వ్యాధి ప్రబలుతుంది. . దొంగతనం భయం పెరుగుతుందట

తెలుగు వారి క్యాలెండర్ ఉగాది నుంచి ప్రారంభం అవుతుంది. ఈ తెలుగు నూతన సంవత్సరం మొదటి రోజుని ఉగాదిగా జరుపుకుంటాం. దీనికి కారణం ప్రకృతి సహజత్వం. మనిషి ప్రకృతికి, కాలానికి అనుగుణంగా జీవిస్తున్నాడు కనుక ప్రకృతి నూతనంగా మారినప్పుడు.. మనిషి జీవన విధానం కూడా నూతనంగా మొదలవుతుంది. ఉగాదిని యుగాది అని కూడా అంటారు. అంటే సృష్టి ప్రారంభం అయిన రోజు. హిందూ పంచాంగం ప్రకారం ఒకొక్క తెలుగు సంవత్సరానికి ఒకొక్క పేరు ఉంటుంది. ఈ ఏడాది ఉగాది పేరు విశ్వావసు నామ సంవత్సరం. మార్చి 30 వ తేదీ ఆదివారం పాడ్యమి తిధి నుంచి ఈ విశ్వవాసు సంవత్సర మొదలు కానుంది. ఈ నేపధ్యంలో ఈ ఏడాది మనిషి జీవితం ఎలా సాగనుంది..ఆదాయ, వ్యయాలు, కష్ట, సుఖాలు, వ్యాధులు వంటి అనేక విషయాలను తెలుసుకోవాలని భావిస్తారు. ఈ నేపధ్యంలో ఈ ఏడాది మానవ జీవితం ఎలా ఉండనుందో తెలుసుకుందాం
ఈ సంవత్సరం మొక్కలు పెరుగుదల అంతంత మాత్రంగానే ఉంటుంది. దీంతో రైతులకు ఫలాలను కూడా మోస్తరు రేటుతో ఇస్తాయి. సంపద అధికంగా ఉండదు. అదే సమయంలో అసలు ఈ రోజు చేతిలో డబ్బులు లేవు అనే రోజు ఉండదు. ఈ సంవత్సరం వర్షాలు అధికంగా పడవు లేదా కరువు కూడా ఏర్పడదు. అంటే వర్షాలు తగినంత పడతాయి. దొంగతనం భయం పెరుగుతుంది. కొత్త వ్యాధులు లేదా ప్రతిచోటా ఒకే వ్యాధి వ్యాపించడం వంటి అనేక ఆరోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. ప్రజాప్రతినిధులు, అధికారులు దురాశతో నిండి ఉంటారు.
ఆదివారం: విశ్వావసు నామ సంవత్సరం మార్చి 30 వ తేదీ ఆదివారం రోజు నుంచి మొదలు కానుంది. అంటే ఈ సంవత్సర అధిపతి సూర్యుడు. అతని పాలన వల్ల ప్రపంచంలో ఏమి జరుగుతుందో తెలుసుకుందాం..
తెలుగు నూతన సంవత్సరం ఆదివారం రోజు నుంచి మొదలు అయితే రాజులు అంటే పాలకులు అనారోగ్యంతో బాధపడతారు. పౌరులు నష్టపోతారు. ఆహార కొరత ఏర్పడుతుంది.
రేవతి నక్షత్రం:
ఉగాది పండగ రేవతి నక్షత్రంతో ప్రారంభమవుతుంది. ఈ నక్షత్రంతో కొత్త ఏడాది మొదలు కావడం వలన కలిగే ప్రయోజనం ఏమిటి?
ఈ నక్షత్రంలో ఏడాది ప్రారభం కావడం వలన ప్రజలు సౌమ్యంగా ఉంటారు. ఈ నక్షత్రం వలన కలిగే శుభ ఫలితాలను మార్గశిర మాసంలో చూడవచ్చు. ఈ సంవత్సరం సంపద సమృద్ధిగా ఉంటుంది. పౌరులలో ఆనందం, శాంతి ఉంటుంది.
ఐంద్ర యోగం:
ఉగాది ప్రారంభంలో ఐంద్ర యోగం ఉంటుంది. ఇది శుభ యోగంగా పరిగణించబడుతుంది. కనుక ఈ సంవత్సరం రాష్ట్రానికి, దేశానికి శుభప్రదమైనది. రాష్ట్రంలో అనుకున్న పనులు నెరవేరుతాయి. పాలకులు, ప్రజలు ఇద్దరూ సంతోషంగా ఉంటారు.
భవ కరణం:
చంద్రగతిని అనుసరించి ఈ ఏడాది భవ కారణంతో మొదలవుతుంది. కనుక కళాప్రకాశిక ఆ చర్య ఫలితంగా జీవితం ఉంటుంది. శుభతిథిని ఎన్నుకుని పని – ప్రారంభిస్తే సంపద, వారం వల్ల – ఆయుషు, నక్షత్రం వల్ల పుణ్యం, యోగం వల్ల వ్యాధినాశం, కరణం వల్ల ఇష్టకామ్యం సిద్ధిస్తాయి. కనుక వివాహాది శుభకార్యాలను సుముహూర్తంలో ప్రారంభించడం వల్ల కార్యసిద్ధి, విజయం ప్రాప్తిస్తాయని చెబుతున్నారు.
మూలాలు
ఎవరైనా చేసే పనుల్లో , చేసే అన్ని ప్రయత్నాలలో బలం, సామర్థ్యం ఉంటుంది. విజయం సాధించాలంటే తెలివితేటలను ఉపయోగించాల్సిందే. ఈ మూలల వలెనే చేపట్టిన పని విజయం అనేది ఆధార పడి ఉంటుంది. అందువలన పంచాంగంలో ఈ సంవత్సరంలో జరగనున్న మంచి చెడులను వివరించాయి.
ఉగాది రోజున పంచాంగ శ్రవణం, ఏడాదిలో తమ భవిష్యత్ ఎలా ఉంటుంది.. ఆదాయ వ్యవయాల గురించి తెలుసుకోవడం.. జాతకాన్ని వినడం ,యు గ్రహ కదలికలను అర్థం చేసుకోవడం ద్వారా ఏడాదిలో ఎలా జీవించాలి అనే అంచనాకు వస్తారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు