AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mamta Mohandas: క్యాన్సర్‍తో పోరాడి గెలిచిన ఎన్టీఆర్ హీరోయిన్.. ఇప్పుడు ఏం చేస్తుందంటే..

నటిగా వెండితెరపై తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని ఎన్నో కలలతో సినీరంగంలోకి అడుగుపెట్టిన అమ్మాయి. అతి తక్కువ సమయంలోనే వరుస ఆఫర్స్.. నటనతో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. దీంతో చేతినిండా సినిమాలతో ఇండస్ట్రీలో దూసుకుపోవాల్సిన సమయంలోనే అనుకోకుండా క్యాన్సర్ మహామ్మారి బారిన పడింది. ధైర్యంగా కోలుకుని ఇప్పుడు మరోసారి బిగ్ స్క్రీన్ పై అలరిస్తుంది. తనే మమతా మోహన్ దాస్.

Mamta Mohandas: క్యాన్సర్‍తో పోరాడి గెలిచిన ఎన్టీఆర్ హీరోయిన్.. ఇప్పుడు ఏం చేస్తుందంటే..
Mamta Mohandas.
Rajitha Chanti
|

Updated on: Nov 14, 2024 | 9:11 AM

Share

సౌత్ అడియన్స్‏కు ప్రత్యేకంగా పరిచయం అవసరంలేని పేరు మమతా మోహన్ దాస్. యమదొంగ సినిమాలో ఓలబ్బయ్యో అంటూ ఎన్టీఆర్‏తో కలిసి యాక్టింగ్ అదరగొట్టేసింది. అంతకు ముందు కృష్ణార్జున, హోమం చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది. మలయాళీ చిత్రపరిశ్రమలో అగ్రకథానాయికగా తనకంటూ ఓ స్థానాన్ని సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. మయూఖం సినిమాతో పాపులారిటీని సొంతం చేసుకున్న మమతా మోహన్ దాస్ నటిగానే కాదు సింగర్ కూడా. అయితే నటిగా చేతినిండా సినిమాలతో దూసుకుపోతున్న సమయంలోనే ఆమెను క్యాన్సర్ కబలించింది. ఆ మహమ్మారిని ఎదుర్కొని ఇప్పుడు మరోసారి వెండితెరపై సందడి చేస్తుంది. ఈరోజు మమతా మోహన్ 40వ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమెకు సినీ ప్రముఖులు, అభిమానులు బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు.

నవంబర్ 14, 1984న బహ్రెయిన్‌లో కన్నూర్‌కు చెందిన అంబాలపట్ మోహన్‌దాస్, గంగా దంపతులకు జన్మించింది మమతా మోహన్ దాస్. మమత బాల్యం అంతా బహ్రెయిన్‌లోనే సాగింది. అక్కడే ఇండియన్ స్కూల్‌లో 12వ తరగతి పూర్తి చేసి.. ఆ తర్వాత బెంగళూరులోని మౌంట్ కార్మెల్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ చేసింది. ఆ తర్వాత IBM, కళ్యాణ్ కేంద్రం వంటి సంస్థల ప్రకటనలకు మోడల్‌గా వర్క్ చేసింది. అదే సమయంలో మలయాళీ చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టింది. మమతా ఇప్పుడు ఇండస్ట్రీలో అత్యధిక ఆస్తులు కలిగిన నటీమణులలో ఒకరు. ఆమె దగ్గర కేరళలోనే అరుదైన పోర్షే 911 కారెరా ఎస్ స్పోర్ట్స్ కారు ఉంది.

దీంతో పాటు మమతకు కొచ్చి, దుబాయ్‌లలో ఫ్లాట్లు ఉన్నాయని, కోట్ల ఆస్తులు ఉన్నాయని కూడా సమాచారం. తల్లిదండ్రులు ఇద్దరూ ఎన్నో ఆస్తులు సంపాదించినప్పటికీ.. తన సొంతంగా ఆస్తిని కూడబెట్టుకుంది మమతా. క్యాన్సర్ కారణంగా కొన్నాళ్లపాటు నటనకు దూరమైన మమతా.. ఇప్పుడు మమళ్లీ రీఎంట్రీ ఇచ్చింది. ఇటీవలే జగపతి బాబు నటించిన రుద్రంగి సినిమాలో కనిపించింది. ఇందులో అద్భుతమైన నటనతో నటిగా ప్రశంసలు అందుకుంది.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి : Arundhati movie: తస్సాదియ్యా.. అసలేం మారలేదు.. అరుంధతి డ్యాన్స్ టీచర్‏ను చూశారా..?

Tollywood: ఆ ఒక్క డైలాగ్‏తో నెట్టింట తెగ ఫేమస్.. ఈ యంగ్ హీరో సతీమణి ఎవరో గుర్తుపట్టారా.?

Pawan Kalyan: ఏంటీ బాస్.. మరీ అంత తక్కువా.. పవన్ కళ్యాణ్ ఫస్ట్ మూవీ రెమ్యునరేషన్ తెలిస్తే..

Samantha: సామ్ ఈజ్ బ్యాక్.. సిటాడెల్ కోసం ఎంత రెమ్యునరేషన్ తీసుకుందో తెలుసా.. ?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కొవ్వు కరగాల్సిందే.. కండరాలు పెంచాల్సిందే.. లేకపోతే మెదడు..
కొవ్వు కరగాల్సిందే.. కండరాలు పెంచాల్సిందే.. లేకపోతే మెదడు..
ఓలా, ఉబర్‌కు పోటీగా ఏపీ ప్రభుత్వం కొత్త యాప్.. తక్కువ ధరకే..
ఓలా, ఉబర్‌కు పోటీగా ఏపీ ప్రభుత్వం కొత్త యాప్.. తక్కువ ధరకే..
భయపెట్టే ఘోర యాక్సిడెంట్.. చూస్తే షాకే
భయపెట్టే ఘోర యాక్సిడెంట్.. చూస్తే షాకే
వరల్డ్ కప్ జట్టు నుంచి గిల్ అవుట్ వెనుక ఉన్న నమ్మలేని నిజాలివే
వరల్డ్ కప్ జట్టు నుంచి గిల్ అవుట్ వెనుక ఉన్న నమ్మలేని నిజాలివే
విన్నర్ అవ్వాల్సినోడు టాప్-3లోనూ లేకుండా..ఇమ్మాన్యుయేల్ ఎలిమినేట్
విన్నర్ అవ్వాల్సినోడు టాప్-3లోనూ లేకుండా..ఇమ్మాన్యుయేల్ ఎలిమినేట్
వామ్మో.. ఒక్క వారంలోనే రూ.16వేలు పెరిగిన వెండి.. అసలు కారణాలు..
వామ్మో.. ఒక్క వారంలోనే రూ.16వేలు పెరిగిన వెండి.. అసలు కారణాలు..
పొలంలోకి వెళ్లి కళ్లు తేలేసిన పోలీసులు.. వీడియో చూశారా
పొలంలోకి వెళ్లి కళ్లు తేలేసిన పోలీసులు.. వీడియో చూశారా
తెలంగాణలో మరో ఎన్నికలు.. త్వరలోనే షెడ్యూల్..!
తెలంగాణలో మరో ఎన్నికలు.. త్వరలోనే షెడ్యూల్..!
శ్రీలంక అమ్మాయిలకు వైజాగ్‎లో చుక్కలు చూపించడం పక్కా భయ్యా
శ్రీలంక అమ్మాయిలకు వైజాగ్‎లో చుక్కలు చూపించడం పక్కా భయ్యా
సిబిల్ స్కోర్ తక్కువుందా.. 500 నుంచి 750కి పెరగాలంటే ఇలా చేస్తే.
సిబిల్ స్కోర్ తక్కువుందా.. 500 నుంచి 750కి పెరగాలంటే ఇలా చేస్తే.